కరెంట్ డిపార్ట్మెంట్ భారీ రిక్రూట్మెంట్ : NPCIL Apprentice Recruitment 2025

On: July 21, 2025 10:23 PM
Follow Us:
Telegram Channel Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

కరెంట్ డిపార్ట్మెంట్‌ నుండి భారీ నోటిఫికేషన్ – పరీక్షలే లేని ప్రభుత్వ శిక్షణ ఉద్యోగాలు

NPCIL Apprentice Recruitment 2025 : మనలో చాలామంది చదువు పూర్తయ్యాక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. పరీక్షలు, ఇంటర్వ్యూలు, మెరిట్ ఇలా చాలా అడ్డంకులు ఎదురవుతుంటాయి. కానీ ఇప్పుడు ఒక్కసారి చూడు రా – NPCIL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – వీళ్ల నుంచే ఎగ్జామ్ లేకుండా నేరుగా ఎంపిక చేసే అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించారు.

ఇది ఏ కంపెనీంటే? కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన అణు విద్యుత్ ఉత్పత్తి సంస్థ. అటువంటి NPCIL లో అప్రెంటిస్‌షిప్ (శిక్షణ ఉద్యోగాలు) కోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు – ఏవేవి ఉన్నాయి?

ఈసారి NPCIL వారు కల్పక్కం, తమిళనాడు లో ఉన్న మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ (MAPS) లో శిక్షణార్థుల కోసం మొత్తం 337 పోస్టులు రిలీజ్ చేశారు.

వాటిని మూడు వర్గాల్లో విభజించారు:

ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ – 122 పోస్టులు

డిప్లొమా అప్రెంటిస్ – 94 పోస్టులు

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 121 పోస్టులు

ఒక్కొక్క విద్యార్హతకి తగిన పని అవకాశం ఉండటం ఇది స్పెషల్!

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

ఎక్కడ పనిచేయాలి?

కల్పక్కం, తమిళనాడు లోని మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్– ఇదే పనిచేసే ప్రదేశం. ఎవరైనా నేషనల్ లెవల్‌కి వెళ్లాలన్నా, లేదా తర్వాత ప్రభుత్వ సంస్థల్లోకి జంప్ అవ్వాలన్నా – ఇది ఒక బలమైన స్టెప్.

AP/TS వాళ్లకి కూడా ఇది ఓ జెమిటి అవకాశం. ఎందుకంటే ఇది పాన్ ఇండియా రిక్రూట్మెంట్ – ప్రాంత పరిమితి ఏదీ లేదు.

అర్హతలు – ఎవరు అప్రై చేయవచ్చు?

1. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్
పదవ తరగతి + ఐటీఐ కంప్లీట్ చేసినవారు

వయస్సు: 14 నుంచి 24 ఏళ్ళ లోపు

2. డిప్లొమా అప్రెంటిస్
ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ డిప్లొమా చేసినవారు

వయస్సు: 18 నుంచి 25 ఏళ్ళ లోపు

3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
ఇంజినీరింగ్ డిగ్రీ లేదా BA/B.Sc/B.Com పూర్తిచేసినవారు

వయస్సు: 20 నుంచి 28 ఏళ్ళ లోపు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకి ప్రభుత్వం నియమించిన విధంగా వయస్సులో రాయితీ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ – ఎగ్జామ్ ఉందా? ఇంటర్వ్యూలు ఉన్నాయా?

అవేంటీ? అసలు పరీక్షలే లేవు.

ఎలాంటి రాత పరీక్ష లేదు

ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు

మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

పూర్తి నిశ్చింతగా అప్లై చేయవచ్చు. ఎంపిక విధానం ఇలా ఉంటుంది:

ఐటీఐ అభ్యర్థులు – పదవ తరగతి + ఐటీఐ మార్కుల ఆధారంగా

డిప్లొమా అభ్యర్థులు – డిప్లొమా మార్కుల ఆధారంగా

డిగ్రీ అభ్యర్థులు – డిగ్రీ శాతం ఆధారంగా

చివరగా ఎంపికైనవారికి మెడికల్ పరీక్ష ఉంటుంది. దానితో ఫైనల్ సెలక్షన్ అవుతుంది.

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

స్టైపెండ్ – ఎంత ఇస్తారు?

ఇది శిక్షణ ఉద్యోగం కాబట్టి నెలవారీ జీతం స్థిరంగా ఉండదు, కానీ ఒక్కో కోర్సుకు తగినట్లు స్టైపెండ్ ఇవ్వబడుతుంది:

ఒక సంవత్సరపు ఐటీఐ చేసినవారికి – ₹7,700

రెండు సంవత్సరాలు ఐటీఐ చేసినవారికి – ₹8,050

డిప్లొమా అభ్యర్థులకు – ₹8,000

గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు – ₹9,000

చదువు అయిపోయి పనికోసం చూస్తున్నవాళ్లకి ఇది మంచి అవకాశం. పైగా సర్టిఫికెట్ కూడా వస్తుంది.

ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? చివరి తేదీ ఎప్పుడంటే?

సంఘటన తేదీ
నోటిఫికేషన్ విడుదల జూన్ 20, 2025
అప్లికేషన్ స్టార్ట్ జూన్ 20, 2025
చివరి తేదీ జూలై 31, 2025

చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లై చేయడం ఉత్తమం.

దరఖాస్తు ఎలా చేయాలి?

ఈసారి అప్లికేషన్ విధానం ఆన్లైన్ + ఆఫ్లైన్ రెండు రకాలుగా ఉంటుంది.

పద్ధతి:

NPCIL అధికారిక నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి

మీ విద్యార్హతకు సంబంధించిన అప్రెంటిస్ లింక్‌ మీద క్లిక్ చేయాలి

ఫోన్ నంబర్, ఈమెయిల్ ద్వారా ప్రొఫైల్ క్రియేట్ చేయాలి

అవసరమైన డాక్యుమెంట్లను JPG/PDF రూపంలో అప్‌లోడ్ చేయాలి

ట్రేడ్, విద్యార్హత, కేటగిరీ ఎంపిక చేయాలి

ఫైనల్ సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ pdf సేవ్ చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: లేనట్లే. ఉచితమే.

Notification (Last Date Extended to 31st july)

 For ITI Apply Link 

For Diploma,Degree Apply Link 

అవసరమైన డాక్యుమెంట్లు (స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సినవి):

పదవ తరగతి మెమో

ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ సర్టిఫికెట్లు

కుల ధృవీకరణ పత్రం (ఉంటే)

ఆధార్ కార్డు

పాస్‌పోర్ట్ ఫోటో

సంతకం (స్కాన్ ఫార్మాట్‌లో)

ఈ ఉద్యోగం ఎవరి కోసం బాగా సెట్ అవుతుంది?

చదువు అయిపోయి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న యువతకి

ఫ్రెషర్లు, రీసెంట్ పాస్ అవుట్స్

ప్రైవేట్ & విదేశీ కంపెనీల్లో పనిచేయాలని ఉన్నవారికి – PSU అనుభవం ప్లస్ పాయింట్

ప్రభుత్వ సంస్థల్లో నెక్స్ట్ లెవెల్ సెలక్షన్‌ల కోసం ప్రిపేర్ అవుతున్నవారికి

NPCIL లాంటి సంస్థలో Apprenticeship అనేది మీ రిజ్యూమ్‌లో ఒక బలమైన దశగా మారుతుంది.

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

చివరగా – ఓపికగా చదివినవారికి ఓ మాట

ఇదొక సాధారణ ఉద్యోగం కాదు – ఇది మన కెరీర్‌కి ఒక ప్రభుత్వ రంగ ఆధ్యాయం లాంటిది. ఎలాంటి పరీక్షలు లేకుండా, ప్రత్యక్షంగా ఎంపిక చేయడమంటే మీకు ఇవ్వబోయే గుర్తింపు ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. ఈ అవకాశం వస్తే వదలకుండా వినియోగించుకోవాలి.

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join Instagram

Join Now

Related Job Posts

Leave a Comment

You cannot copy content of this page