APSRTC డ్రైవర్ రిక్రూట్మెంట్ 2025 – అప్లికేషన్ లెదు, డైరెక్ట్‌గా డిపోకే వెళ్ళాలి!

On: August 4, 2025 7:24 PM
Follow Us:
Telegram Channel Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

APSRTC డ్రైవర్ రిక్రూట్మెంట్ 2025 – అప్లికేషన్ లెదు, డైరెక్ట్‌గా డిపోకే వెళ్ళాలి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వస్తున్న క్రమంలో APSRTC భారీ స్థాయిలో డ్రైవర్లను నియమించనుంది. ఆగస్టు 15, 2025 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సుమారు 1500 ఖాళీలకు ఈ నియామకాలు జరుగనున్నాయి. ఈ ఉద్యోగం 10వ తరగతి పాసైనవారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. మగ అభ్యర్థులకే ఈ అవకాశం ఉంది.

ఉద్యోగ వివరాలు – APSRTC లో డ్రైవర్ పోస్టులు

  • విభాగం పేరు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (APSRTC)

  • పోస్టు పేరు: డ్రైవర్

  • మొత్తం ఖాళీలు: 1500+

  • పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్ అంతటా

  • అర్హత: కనీసం 10వ తరగతి పాస్ కావాలి

  • వయస్సు పరిమితి: 22 నుంచి 35 ఏళ్లలోపు (విశ్రాంత సైనికులకి 45 ఏళ్ల వరకూ)

  • అనుభవం: కనీసం 18 నెలల డ్రైవింగ్ అనుభవం ఉండాలి

  • జీతం: APSRTC నిబంధనల ప్రకారం

డ్యూటీ విధానం – మోడల్ ఆఫ్ రిక్రూట్మెంట్

ఈ రిక్రూట్మెంట్ “ఆన్-కాల్ల్ డ్యూటీ” ఆధారంగా ఉంటుంది. అంటే, అవసరమైనప్పుడు మాత్రమే డ్రైవర్లను విధుల్లోకి పిలుస్తారు. ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు. కాకపోతే, మహిళల ఉచిత ప్రయాణ స్కీమ్‌కి సపోర్ట్‌గా కొత్త బస్సులు నడపడానికి కావాల్సినప్పుడల్లా వీళ్లను పిలుస్తారు.

అర్హతలు – ఎవరెవరు అప్లై చేయచ్చు?

  1. విద్యార్హత: 10వ తరగతి పాసవుండాలి.

  2. వయస్సు:

    • జనరల్ అభ్యర్థులు: 22–35 ఏళ్లు

    • SC/ST/BC/EWS: 5 సంవత్సరాల సడలింపు

    • ఎక్స్‌ సర్విస్‌మెన్‌కి: 45 ఏళ్ల వరకూ

  3. డ్రైవింగ్ అనుభవం: కనీసం 18 నెలల డ్రైవింగ్ అనుభవం అవసరం.

  4. ఫిజికల్ స్టాండర్డ్స్:

    • కనీస హైట్: 160 సెం.మీ (5.2 అడుగులు)

    • ఆరోగ్య పరంగా ఫిట్‌గా ఉండాలి.

  5. భాషా పరిజ్ఞానం: తెలుగు చదవడం, అర్థం చేసుకోవడం వచ్చాలి (పూర్తిగా రాయగలగకపోయినా పరవాలేదు).

కావాల్సిన డాక్యుమెంట్లు

అప్లై చేయడానికి కింద తెలిపిన సర్టిఫికేట్లు మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి:

సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

ఇది రాసే పరీక్ష ఆధారంగా కాదు. సెలెక్షన్ కింద తెలిపిన ప్రాసెస్‌ ఆధారంగా జరుగుతుంది:

  1. డ్రైవింగ్ టెస్ట్ – ట్రాన్స్‌పోర్ట్ అధికారులు డ్రైవింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు.

  2. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ – హైట్, ఆరోగ్యం బేసిస్‌పై స్క్రీనింగ్ ఉంటుంది.

  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ – పై చెప్పిన అన్ని సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.

ఈ మూడింటిలో ఫైనల్ గా సెలెక్ట్ అయ్యే అభ్యర్థులను “ఆన్-కాల్లు” విధానంలో APSRTC డిపోల్లో నియమిస్తారు.

ఎలా అప్లై చేయాలి? – Application Process

ఈ పోస్టులకు ఆన్లైన్‌లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు మీకు దగ్గర్లో ఉన్న APSRTC డిపోకి వెళ్లాలి. మీరు అన్నీ డాక్యుమెంట్లు తీసుకెళ్లి అక్కడే సెలెక్షన్ కోసం డ్రైవింగ్ టెస్ట్, ఫిట్‌నెస్ చెక్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ జరుగుతుంది.

ఒకవేళ మీరు పాస్ అయితే మీ నెంబర్‌ను రిజిస్టర్ చేసి అవసరమైనప్పుడు మీకీ విధులు అప్పగిస్తారు.

ఇది ఏవిధంగా మంచి అవకాశమో తెలుసా?

  • 10వ తరగతి పాస్ అయి ఉండటం సరిపోతుంది.

  • ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ లేదు – rural background వాల్లకి చాల సింపుల్.

  • డ్రైవింగ్ అనుభవం ఉన్న మగ అభ్యర్థులకు ఇది పక్కా ఛాన్స్.

  • మామూలు ప్రాసెస్ కాదు – డిపోకి వెళ్లి డైరెక్ట్ సెలెక్షన్ కావడం వల్ల influence లేకుండా మంచి అభ్యర్థులకి అవకాశం.

  • డ్యూటీ ప్రాతిపదికగా అయినా, ఈ స్కీమ్ ఎంత కాలం ఉంటుందో, అంత వరకూ అవకాశం ఉంటుంది.

  • ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి జీతం, భద్రత ఉంటాయి.

గమనికలు (Important Points)

  • ఈ ఉద్యోగం మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్ కింద జరుగుతోంది.

  • ఆన్ కాల్ డ్యూటీ అంటే ఫుల్ టైమ్ జాబ్ కాదు. కావాల్సినప్పుడు పిలుస్తారు.

  • ఇలాంటి అవకాశాలు ఎక్కువగా రాకపోవచ్చు కాబట్టి డ్రైవింగ్ అనుభవం ఉన్నవాళ్లు తప్పక ట్రై చేయండి.

  • మీరు ఎక్కడైనా ఏ డిపోకి వెళ్ళినా, ముందుగానే అన్ని సర్టిఫికెట్లు రెడీగా పెట్టుకోండి.

  • ఎంపికయ్యాక మీకు అవసరమైనప్పుడు కాల్ చేస్తారు. అంటే జాబ్ వస్తుందా వద్దా అనేదే కాదు, ఎప్పుడైనా రావచ్చు.

  • Notification 

ముగింపు మాట:

ఏపీలోని యువకులకు ఇది మంచి అవకాశం. 10వ తరగతి చదివిన, డ్రైవింగ్ అనుభవం ఉన్న యువకులు డైరెక్ట్ గా డిపోకి వెళ్లి ఎంపిక కావచ్చు. ఆన్లైన్ అప్లికేషన్‌లు, రాసే పరీక్షలు లేవు. పూర్తిగా ప్రాక్టికల్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక కాబట్టి, నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు – నీకు ఈ జాబ్ వస్తుంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబట్టి ముందుగానే రెడీగా ఉండండి!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join Instagram

Join Now

Related Job Posts

Leave a Comment

You cannot copy content of this page