Indian Navy SSC Officer Recruitment 2026 : 260 ఆఫీసర్ ఉద్యోగాలు | ₹1,25,000 జీతం | Apply Online
ఇండియన్ నేవీలో SSC ఆఫీసర్ ఉద్యోగం అంటే చాలామందికి చిన్నప్పటి నుంచే ఉన్న కల. యూనిఫామ్, గౌరవం, మంచి జీతం, జీవితానికి ఒక దిశ అన్నీ కలిసే ఉద్యోగం ఇది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనే కన్‌ఫ్యూషన్‌లో ఉన్నవాళ్లకు ఈ నోటిఫికేషన్ నిజంగా ఒక మంచి ఛాన్స్. 2026 సంవత్సరానికి గాను ఇండియన్ నేవీ మొత్తం 260 SSC ఆఫీసర్ పోస్టులను ప్రకటించింది. చదువు ఉన్నవాళ్లు, వయసు సరిపడే వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు.
ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏంటంటే ఒకే రకమైన డిగ్రీ కాదు. బీకామ్, బీఎస్సీ, బీటెక్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ ఇలా చాలా రకాల అర్హతలతో అప్లై చేయొచ్చు. అంటే సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఆర్ట్స్, కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్లకూ అవకాశం ఉంది. అందుకే ఈ రిక్రూట్‌మెంట్ మీద ఎక్కువ మంది దృష్టి పెట్టారు.

Indian Navy SSC Officer Recruitment 2026 Overview
Company Name
Indian Navy
Post Name
SSC Officer (Short Service Commission Officers)
No of Posts
260
Salary
₹1,25,000
Qualification
B.Com, B.Sc, B.Tech/B.E, M.A, M.Sc, MBA/PGDM, MCA
Start Date for Apply Online
24-01-2026
Last Date for Apply Online
24-02-2026
Official Website
joinindiannavy.gov.in
ఈ ఓవerview చూసినా ఒక విషయం అర్థమవుతుంది. జీతం స్టార్టింగ్‌నే ₹1,25,000 అంటే మామూలు విషయం కాదు. పైగా ఇది గ్రాస్ సాలరీ. అలవెన్సులు కలిస్తే ఇంకా పెరుగుతుంది. ప్రైవేట్ జాబ్స్‌తో పోల్చుకుంటే ఈ స్టేబిలిటీ చాలా పెద్ద ప్లస్.
IOCL Jobs : 60000 జీతం తో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ | IOCL Govt Jobs Recruitment 2026 Apply Now
Indian Navy SSC Officers Recruitment 2026 Vacancy Details
Executive Branch (GS(X)/ Hydro Cadre)
Vacancy: 76
Gender: పురుషులు మరియు మహిళలు
Pilot
Vacancy: 25
Gender: పురుషులు మరియు మహిళలు
Naval Air Operations Officer (Observers)
Vacancy: 20
Gender: పురుషులు మరియు మహిళలు
Air Traffic Controller (ATC)
Vacancy: 18
Gender: పురుషులు మరియు మహిళలు
Logistics
Vacancy: 10
Gender: పురుషులు మరియు మహిళలు
Education
Vacancy: 7
Gender: పురుషులు మరియు మహిళలు
Engineering Branch (General Service)
Vacancy: 42
Gender: పురుషులు మరియు మహిళలు
Submarine Tech Engineering
Vacancy: 8
Gender: కేవలం పురుషులు
Electrical Branch (General Service)
Vacancy: 38
Gender: పురుషులు మరియు మహిళలు
Submarine Tech Electrical
Vacancy: 8
Gender: కేవలం పురుషులు
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని బ్రాంచ్‌ల్లో మహిళలకు లిమిటెడ్ సీట్లు మాత్రమే ఉంటాయి. కానీ అది నిరుత్సాహపడాల్సిన విషయం కాదు. అర్హత బాగా ఉంటే షార్ట్‌లిస్టింగ్‌లోకి రావడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.
Eligibility Criteria
Executive Branch (GS(X)/ Hydro Cadre)
ఏదైనా విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
Pilot
ఏదైనా విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉండాలి. డిగ్రీలో 60 శాతం మార్కులు అవసరం. అలాగే 10వ తరగతి, 12వ తరగతిలో కూడా మొత్తం మీద 60 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో కనీసం 60 శాతం ఉండాలి.
Naval Air Operations Officer
ఇక్కడ కూడా బీఈ లేదా బీటెక్ అవసరం. 10వ, 12వ తరగతుల్లో మరియు డిగ్రీలో 60 శాతం మార్కులు తప్పనిసరి.
Air Traffic Controller
ఈ పోస్టుకు కూడా బీఈ లేదా బీటెక్ అర్హతతో పాటు 10వ, 12వ తరగతుల్లో మంచి మార్కులు ఉండాలి.
Logistics
బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్ లేదా ఎంబీఏ ఫస్ట్ క్లాస్. లేదా బీకామ్, బీఎస్సీ ఫస్ట్ క్లాస్‌తో పాటు లాజిస్టిక్స్ లేదా ఫైనాన్స్ సంబంధిత పీజీ డిప్లొమా ఉండాలి.
Education
ఈ విభాగం చాలా స్పెసిఫిక్. మ్యాథ్స్, ఫిజిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పీజీ లేదా బీటెక్ ఉండాలి. 10వ లేదా 12వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు అవసరం.
Engineering Branch (GS)
మెరైన్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్ వంటి ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు అర్హత.
Submarine Tech Engineering
మెకానికల్, ప్రొడక్షన్, కంట్రోల్ ఇంజినీరింగ్ వంటి విభాగాలు అర్హత.
Electrical Branch
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజినీరింగ్ విభాగాలు అర్హత.
Salary / Stipend
ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్‌గా జాయిన్ అయిన వెంటనే సుమారు ₹1,25,000 గ్రాస్ సాలరీ వస్తుంది. దీనితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. పైలట్ లేదా ఆబ్జర్వర్ పోస్టులకి ట్రైనింగ్ పూర్తయ్యాక అదనంగా ₹31,250 అలవెన్స్ వస్తుంది. సబ్‌మరైన్ పోస్టులకు కూడా ప్రత్యేక అలవెన్స్ ఉంటుంది.
నిజం చెప్పాలంటే, ఈ జీతం ప్రైవేట్ సెక్టార్‌లో చాలా సంవత్సరాల అనుభవం ఉంటే గానీ రాదు.
Age Limit (as on 01-01-2027)
Executive Branch
02-01-2002 నుండి 01-07-2007 మధ్య జన్మించి ఉండాలి
Pilot / Observer
02-01-2003 నుండి 01-01-2008 మధ్య జన్మించి ఉండాలి
ATC / Education
02-01-2002 నుండి 01-01-2006 మధ్య జన్మించి ఉండాలి
Engineering / Electrical
02-01-2002 నుండి 01-07-2007 మధ్య జన్మించి ఉండాలి
వయసు లెక్కలో చిన్న తప్పు కూడా ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి పుట్టిన తేదీ సరిగ్గా చెక్ చేసుకుని అప్లై చేయాలి.
Important Dates
Apply Online Start Date
24-01-2026
Last Date
24-02-2026
Course Commencement
Jan 2027
Final Result Information
20-12-2026 లోపు
Selection Process
ఈ రిక్రూట్‌మెంట్‌లో మొదటిగా డిగ్రీ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అందరి కాలేజీల మార్కులు ఒకేలా ఉండవు కాబట్టి నార్మలైజేషన్ చేస్తారు. ఆ తర్వాత షార్ట్‌లిస్టయ్యిన వాళ్లకు SSB ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడే మీ అసలు టెస్ట్ మొదలవుతుంది. మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. చివరగా మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. డిగ్రీలో 60 శాతం కంటే తక్కువ ఉంటే చివరి దశలో సమస్య వస్తుంది. కాబట్టి అప్లై చేసే ముందు మీ మార్కులు ఖచ్చితంగా సరిపోతున్నాయా చూసుకోవాలి.
Federal Bank Officer Recruitment 2025 | Federal Bank Officer Jobs Apply Online
Indian Navy SSC Officer Recruitment 2026 How to Apply
ఈ అప్లికేషన్ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ముందుగా ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయ్యాక లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయాలి. వ్యక్తిగత వివరాలు, చదువు వివరాలు, కమ్యూనికేషన్ వివరాలు అన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ తప్పకుండా సరిపోవాలి.
డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసే సమయంలో క్లారిటీగా స్కాన్ చేసిన కాపీలు వాడాలి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయడం కష్టం. అందుకే సబ్మిట్ చేసే ముందు రెండు సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
Indian Navy SSC Officer Important Links
- Official Notification PDF: Click here
- Official Website: Click here

చివరిగా నా ఓపీనియన్
ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ జాబ్ అనేది డబ్బు కోసం మాత్రమే కాదు. డిసిప్లిన్, లైఫ్ స్టైల్, దేశానికి సేవ చేసే అవకాశం అన్నీ కలిపిన కెరీర్. ఒకసారి సెలెక్ట్ అయితే జీవితం ఒక ట్రాక్‌లో పడుతుంది. అందుకే అర్హత ఉన్నవాళ్లు ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు.
ఇంతవరకూ చదివిన తర్వాత కూడా అప్లై చేయాలా వద్దా అనే సందేహం ఉంటే, నా మాట వినండి. ట్రై చేయడం తప్పు కాదు. అప్లై చేయకపోతే మాత్రం అవకాశం వదులుకున్నట్టు అవుతుంది.