ICF Railway Jobs 2025 : పదోతరగతి, ITI అభ్యర్థులకు మరోసారి సూపర్ ఛాన్స్

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో 1000 Posts – 2025

ICF Railway Jobs 2025 : పక్కా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ద్వారా అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 1010 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి పూర్తి చేసినవారు, కొన్ని ట్రేడ్స్ లో ITI చేసినవారు అప్లై చేయవచ్చు. కొన్ని పోస్టులకు ఇంటర్ చేసి ఉండాలనిపెడుతున్నారు.

అప్రెంటిస్ అంటేనే పనికిరాని పని అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ నిజానికి రైల్వేల్లో అప్రెంటిస్ చేసినవారికే టెక్నిషియన్, గ్రూప్-డి లాంటి జాబ్స్ లో అదీ మల్టిపుల్ ఎగ్జామ్స్ ద్వారా ర్యాంక్ రాబట్టడానికి చాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్రెంటిస్ అయిన వారికి ప్రయారిటీ పాయింట్లు వస్తాయి. పైగా డైరెక్ట్ గా ట్రైనింగ్ అనుభవం కూడా వస్తుంది.

AP Fee Reimbursement 2025 Released : విద్యార్థులకు శుభవార్త

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 12 జూలై 2025

దరఖాస్తు ప్రారంభం: 12 జూలై 2025

దరఖాస్తు ముగింపు: 11 ఆగస్టు 2025

మొత్తం పోస్టులు: 1010

OnePlus Nord 5 Mobile 2025 : మధ్య తరగతి వాళ్ల కోసం ఫుల్ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్!

అప్రెంటిస్ పోస్టుల వివరాలు:

ఫ్రెషర్స్ (10వ తరగతి / ఇంటర్):

కార్పెంటర్ – 40

ఎలక్ట్రిషియన్ – 40

ఫిట్టర్ – 80

మెషినిస్ట్ – 40

పెయింటర్ – 40

వెల్డర్ – 80

MLT – రేడియాలజీ – 5

MLT – పథాలజీ – 5

Ex-ITI (ITI పూర్తి చేసినవారు):

కార్పెంటర్ – 50

ఎలక్ట్రిషియన్ – 160

ఫిట్టర్ – 180

మెషినిస్ట్ – 50

పెయింటర్ – 50

వెల్డర్ – 180

PASAA – 10

అర్హత:

ఫ్రెషర్స్: పదోతరగతి లేదా ఇంటర్ పాసై ఉండాలి.

Ex-ITI: సంబంధిత ట్రేడ్ లో ITI పూర్తి చేసి ఉండాలి.

ఎలాంటి డిగ్రీలు, డిప్లొమాలు చేసినవారు అప్రెంటిస్ పోస్టులకు అర్హులు కాదు.

Free Electric Vehicles for Women – తెలంగాణ EV పాలసీ 2025 పూర్తి వివరాలు

వయస్సు పరిమితి (11-08-2025 నాటికి):

కనీస వయస్సు: 15 సంవత్సరాలు

గరిష్ఠ వయస్సు: ITI చేసినవారికి 24 సం.లు, మిగతావారికి 22 సం.లు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

స్టైపెండ్:

పదోతరగతి పాస్ ఫ్రెషర్స్: నెలకు రూ. 6000/-

ఇంటర్ పాస్ ఫ్రెషర్స్: నెలకు రూ. 7000/-

Ex-ITI అభ్యర్థులు: నెలకు రూ. 7000/-

అప్లికేషన్ ఫీజు:

మహిళలు, SC, ST, PwBD అభ్యర్థులకు: ఫీజు లేదు

మిగతా అభ్యర్థులకు: రూ. 100/-

PM Vidyakaxmi Scheme : స్టూడెంట్స్ కి ఉన్నత విద్యకు 7.50 లక్షల రూపాయలు

దరఖాస్తు విధానం:

ICF అధికారిక వెబ్‌సైట్ (icf.gov.in) ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.

అఫిషియల్ నోటిఫికేషన్ లో ఉన్న సూచనలు ఖచ్చితంగా చదివి అప్లై చేయాలి.

తప్పులు లేని విధంగా పూర్తి biodata, విద్యార్హతల సమాచారం సమర్పించాలి.

Notification

Apply Online 

అప్రెంటిస్ అంటే ఎలా ఉపయోగపడుతుంది?

చాలామంది అప్రెంటిస్ అనగానే చిన్నపాటి పని అని తక్కువ అంచనాలు పెట్టేస్తారు. కానీ రైల్వే, ఇతర సెంట్రల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాల్లో అప్రెంటిస్ చేసిన అభ్యర్థులకు weightage ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రైల్వే టెక్నిషియన్, గ్రూప్-D రిక్రూట్మెంట్స్ లో internal priority మార్కులు వస్తాయి. అలా అంటే అప్రెంటిస్ అనేది ఉద్యోగానికి base లాంటి దశ. అది చేసి ఉంచితే, తర్వాత రాసే ఏ రైల్వే పరీక్ష అయినా బాగా score చేయచ్చు. పైగా పనిలో అనుభవం వల్ల training గడువు కూడా తక్కువగా ఉంటుంది.

కొన్ని ట్రేడ్స్ లో practicals ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాటిలో అప్రెంటిస్ అనుభవం వల్ల exam preparation కూడా natural గా easy అవుతుంది.

ఇంకా మిల్టీ-టాస్కింగ్, ట్రాక్ మెయింటెనెన్స్ లాంటి పోస్టులకు దరఖాస్తు చేసినప్పుడు అప్రెంటిస్ సర్టిఫికెట్ వల్ల weightage లభిస్తుంది.

AP Nirudhyoga Bruthi Scheme 2025 : నిరుద్యోగులకు నెలకు ₹3000 మద్దతు ప్రారంభం!

అప్రెంటిస్ తర్వాత అవకాశం?

అప్రెంటిస్ పూర్తయిన తర్వాత అదే organization లో absorbed చేసే ఛాన్స్ ఉండదు కానీ రైల్వే ఉద్యోగాలకు రాస్తే internal experience, training తో advantage ఉంటుంది. మిగతా PSU, SSC Technician jobs, DRDO, ISRO వంటి సంస్థల్లో కూడా practical experience ఉండటంతో selection chances పెరుగుతాయి.

ముఖ్య గమనిక:

అప్రెంటిస్ కి దరఖాస్తు చేసే ముందు, ఎవరైతే already డిగ్రీ, డిప్లొమా చేసినవారో వాళ్లకు eligibility లేదు. ఇది స్కిల్ ట్రైనింగ్ పోస్టుగా మాత్రమే పరిగణించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదో తరగతి / ITI చేసినవాళ్లు తప్పక అప్లై చేయండి.

మా సూచన:

ఇవాళ IB, RRB, SSC ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకి, ముందుగా అప్రెంటిస్ లాంటి రియల్ ఫీల్డ్ ట్రైనింగ్ అవసరం. mana RK Logics App లాంటి ప్రాక్టీస్ యాప్స్ ద్వారా theoretical preparation చేసుకుంటూ practical exposure కోసం అప్రెంటిస్ లోకి వెళ్ళడం గొప్ప ఐడియా. తర్వాత competitive exams రాసేటప్పుడు మీకు edge ఉంటుంది.

ఈ అవకాశం చిన్నదిగా అనిపించినా, భవిష్యత్ టెక్నికల్ ఉద్యోగాలకు ఇది బేస్ స్టెప్ అవుతుంది. అప్లై చేయడం మర్చిపోకండి!

Leave a Reply

You cannot copy content of this page