APPSC Forest Jobs 2025 – FBO, ABO 691 Posts Notification Out

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు – 691 పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వారు 14 జూలై 2025న అటవీ శాఖలోని Forest Beat Officer (FBO) మరియు Assistant Beat Officer (ABO) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ నెం. 06/2025ను విడుదల చేశారు. రాష్ట్రంలో అటవీ ఉపశాఖ సేవలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు.

అటవీ శాఖ ఉద్యోగాలు అంటే గ్రామీణ యువతకు ఎంతో ఆసక్తికరమైనవి. ప్రకృతి మధ్యలో పని చేయాలన్న అభిలాష, ప్రాధాన్యమున్న ప్రభుత్వ ఉద్యోగం కావడంతో పోటీ కూడా ఎక్కువే. అయితే ఈసారి 691 ఖాళీలు ఉండటంతో ఎక్కువమందికి అవకాశం కలుగనుంది.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 14 జూలై 2025

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 16 జూలై 2025

దరఖాస్తుకు చివరి తేదీ: 5 ఆగస్టు 2025 (రాత్రి 11:59 వరకు)

పోస్టుల వివరణ:

Forest Beat Officer (FBO): 256 పోస్టులు

Assistant Beat Officer (ABO): 435 పోస్టులు

మొత్తం ఖాళీలు: 691 పోస్టులు

విద్యార్హత:

అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షను ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు ద్వారా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి (01-07-2025 నాటికి):
కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ఠ వయస్సు: 30 సంవత్సరాలు

వయోసడలింపు:

SC/ST/BC/EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాలు

CF ఖాళీలకు దరఖాస్తు చేసే SC/ST అభ్యర్థులకు: 10 సంవత్సరాలు

శారీరక ప్రమాణాలు:

పురుషులు:

ఎత్తు: కనీసం 163 సెం.మీ

ఛాతీ: 84 సెం.మీ (5 సెం.మీ విస్తరణతో)

మహిళలు:

ఎత్తు: కనీసం 150 సెం.మీ

ఛాతీ: 79 సెం.మీ (5 సెం.మీ విస్తరణతో)

గిరిజనులు మరియు కొండ ప్రాంతాల,st అభ్యర్థులకు 5CM సడలింపు వర్తించుతుంది.

నడక పరీక్ష (కేవలం అర్హత పరీక్ష మాత్రమే):
పురుషులు: 4 గంటల్లో 25 కిలోమీటర్లు నడవాలి

మహిళలు: 4 గంటల్లో 16 కిలోమీటర్లు నడవాలి

దరఖాస్తు విధానం:

APPSC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి: https://psc.ap.gov.in

One Time Profile Registration (OTPR) పూర్తి చేయాలి

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపాలి

అప్లికేషన్ ఫీజు చెల్లించి సమర్పించాలి

Notification 

Apply Online 

దరఖాస్తు ఫీజు:

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: ₹250

పరీక్ష ఫీజు: ₹80

విముక్తులు: SC, ST, BC, EWS, మాజీ సైనికులు, వైట్ కార్డ్ హోల్డర్లు, నిరుద్యోగ యువత – పరీక్ష ఫీజు మినహాయింపు

ఎంపిక ప్రక్రియ:

స్క్రీనింగ్ టెస్ట్ (అప్లికేషన్లు ఎక్కువైతే – OMR ఆధారంగా)

ప్రధాన పరీక్ష

ఫిజికల్ టెస్ట్ (నడక & వైద్య పరీక్ష)

కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష (CPT)

రిజర్వేషన్లు & లోకల్ ప్రాధాన్యత:

మొత్తం పోస్టుల్లో 80% లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యం

షెడ్యూల్ ఏరియాల్లోని పోస్టులకు 100% స్థానిక ST అభ్యర్థులకు ప్రాధాన్యం

కోర్సుల వివరాలు – RK Logics App లో ప్రత్యేక కోచింగ్:
ఈ పోస్టులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం RK Logics App ద్వారా ప్రత్యేక కోర్సు అందుబాటులో ఉంది. అటవీ శాఖకు ప్రత్యేకంగా రూపొందించిన subject-wise video classes, daily mock tests, previous papers analysis, walking test tips, మరియు medical preparation guidelines అందించబడతాయి.

RK Logics లో ప్రతి చాప్టర్ ని ఇంట్లో ఉండగానే practice చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా పల్లెటూరి యువతకు ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది.

ఫారెస్ట్ జాబ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

తెలుగు & జెనరల్ స్టడీస్ పైన ఫోకస్ పెట్టాలి: ముఖ్యంగా AP ఆధారిత కరెంట్ అఫైర్స్, చరిత్ర, భౌగోళికం, పాలన – ఇవన్నీ ఫోకస్ చేయాలి.

బైపాస్ అడగబోయే సైన్స్ & ఎన్‌విరాన్మెంట్ టాపిక్స్ – పర్యావరణ పరిరక్షణ, వృక్షజాలం, అడవుల రక్షణ నియమాలు వంటి అంశాలు తప్పనిసరిగా చదవాలి.

నడక పరీక్ష కు ప్రాక్టీస్: రోజూ కనీసం 5 కి.మీ. నడక చేయడం ప్రారంభించాలి. Walking Test సీరియస్‌గా తీసుకోవాలి.

మెడికల్ టెస్ట్ పాస్ అవ్వాలంటే: ఆరోగ్యంగా ఉండడం, బరువు మరియు బీపీ వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం.

RK Logics – Apps on Google Play లో ప్లాన్ చేయబడిన ప్రాక్టీస్ టెస్టులు: వీటిని రోజూ attempt చేయడం ద్వారా పేపర్ పద్ధతి మీద గ్రిప్ పెరుగుతుంది.

చివరి మాట:
Forest Beat Officer మరియు Assistant Beat Officer ఉద్యోగాలు వారికి ఉద్యోగం మాత్రమే కాదు, ఒక లైఫ్ స్టైల్. అడవుల్లో పని చేయడం, ప్రకృతిని కాపాడటం, రికార్డులు నిర్వహించడం – ఇవన్నీ మిక్స్ అయిన challenging job. ఇలాంటి అవకాశాలు తరచూ రావు.

ఈసారి మొత్తం 691 పోస్టులు ఉండడం వల్ల, ఎవరి కోసం అయినా ఇది స్వర్ణావకాశం. ప్రిపరేషన్ సరిగ్గా చేస్తే, అర్హత ఉండి, శారీరక ప్రమాణాలు కలిగి ఉంటే ఉద్యోగం ఖాయం. RK Logics App ద్వారా పూర్తిగా సన్నద్ధం కావచ్చు.

 

Leave a Reply

You cannot copy content of this page