Indian Navy Recruitment 2025 – 260 SSC ఆఫీసర్స్ పోస్టులు – అఖిల భారతస్థాయిలో జాబ్స్
భారత నేవీ లో ఉద్యోగం చేయాలని ఆశించే వాళ్లకి ఇది మంచి అవకాశం. Indian Navy SSC Officers Recruitment 2025 ప్రకారం, మొత్తం 260 పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇది పూర్తిగా డిఫెన్స్ రంగం లో ఒక గౌరవప్రదమైన ఉద్యోగం. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, పిజి వంటి చదువులు పూర్తిచేసినవాళ్లు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయవచ్చు. చివరి తేదీ సెప్టెంబర్ 1, 2025.
ఈ ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి సమాచారం, అర్హతలు, పోస్టుల వివరాలు, ఎలా అప్లై చేయాలో, ఎంపిక విధానం వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుగులో చూద్దాం.
పోస్టు వివరాలు:
ఈ రిక్రూట్‌మెంట్ లో మొత్తం పోస్టులు: 260
పోస్టుల వివరాలు:
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (GS(X)/ Hydro Cadre): 57
- పైలట్: 24
- నావల్ ఎయిర్ ఆపరేషన్స్ (ఆబ్జర్వర్స్): 20
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC): 20
- లాజిస్టిక్స్: 10
- నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్ (NAIC): 20
- లా: 2
- ఎడ్యుకేషన్: 15
- ఇంజినీరింగ్ బ్రాంచ్ (General Service): 36
- ఎలక్ట్రికల్ బ్రాంచ్ (General Service): 40
- నావల్ కన్స్ట్రక్టర్: 16
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
అర్హత వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే కనీసం కింద పేర్కొన్న విద్యార్హతలు ఉండాలి.
- BE/ B.Tech: ఎక్కువ పోస్టులకు ఇదే ప్రధాన అర్హత
- B.Sc, B.Com + MBA / MCA / M.Sc: కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లకు అవసరం
- LLB: లా పోస్టుకు
- M.Tech / Post Graduation: ఎడ్యుకేషన్ బ్రాంచ్, NAIC పోస్టులకు
వయస్సు పరిమితి:
- నేవీ అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, అర్హులైన అభ్యర్థులు వయస్సు పరిమితిని నోటిఫికేషన్ ప్రకారం చూసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఎలాంటి ఫీజు లేదు. (No Application Fee)
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
ఎంపిక విధానం:
ఇతర ప్రభుత్వ ఉద్యోగాల లాగా రాత పరీక్ష ఉండదు. ఎంపిక పూర్తిగా:
- Merit List
- ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి:
- ముందు ఆఫిషియల్ వెబ్‌సైట్ joinindiannavy.gov.in కి వెళ్ళాలి
- Careers / Recruitment సెక్షన్ లోకి వెళ్లి “SSC Officers Recruitment 2025” నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి
- నోటిఫికేషన్ పూర్తి చదివి అర్హతలు, వయస్సు, అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకోవాలి
- Apply Online బటన్ పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలు తప్పులేకుండా ఎంటర్ చేయాలి
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత అcknowledgment లేదా అప్లికేషన్ నంబర్ సేవ్ చేసుకోవాలి
అప్లికేషన్ దరఖాస్తు తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 09-08-2025
- దరఖాస్తు ముగింపు: 01-09-2025
ఇందులో ప్రత్యేకతలు ఏమిటి?
- ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
- జీతం నేవీ నిబంధనల ప్రకారం అద్భుతంగా ఉంటుంది
- వర్క్ లొకేషన్ దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉండొచ్చు – అంటే ట్రాన్స్‌ఫరబుల్
- జాబ్ సెక్యూరిటీ, పెన్షన్, ఇతర గవర్నమెంట్ లాభాలు ఉన్నాయి
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
ఈ ఉద్యోగం ఎందుకు విశిష్టం?
Indian Navy లో ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు, దేశానికి సేవ చేసే గర్వం కూడా కలుగుతుంది. మిలిటరీ డిసిప్లిన్, ఉత్తమ వర్క్ ఎన్విరాన్‌మెంట్, స్ట్రాంగ్ కెరీర్ గ్రోత్, ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఇవన్నీ ఉండే అవకాశాలు కలుగుతాయి.
అందుకే, మీ దగ్గర ఉన్న అర్హతలు ఈ పోస్టులకు సరిపోతే ఆలస్యం చేయకుండా అప్లై చేయండి.
ఉద్యోగానికి సంబంధించి మరింత సమాచారం కోసం నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ను రెగ్యులర్ గా చెక్ చేయండి.
సంక్షిప్తంగా:
- జాబ్ పేరు: SSC Officers
- మొత్తం పోస్టులు: 260
- అర్హత: బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్ఎల్బీ, ఎంఎస్సీ, పిజి డిగ్రీ
- అప్లై చేయడంలాస్ట్ డేట్: సెప్టెంబర్ 1, 2025
- ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్ & ఇంటర్వ్యూకి ఆధారంగా
- అప్లికేషన్ ఫీజు: లేదు
ఇది మీ కెరీర్‌ని మార్చే చాన్స్ కావొచ్చు. అర్హత ఉంటే ఇప్పుడే దరఖాస్తు చేయండి!