DSSSB Recruitment 2025 : సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ గ్రూప్ బీ, సి జాబ్స్ భారీ నోటిఫికేషన్ విడుదల

DSSSB Recruitment 2025 : సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ గ్రూప్ బీ, సి జాబ్స్ భారీ నోటిఫికేషన్ విడుదల

ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) నుంచి 2025కి సంబంధించి ఒక పెద్ద నోటిఫికేషన్ విడుదల అయింది. 2/2025 Advertisement Number తో ఈ నోటిఫికేషన్ విడుదల కాగా, మొత్తం 615 పోస్టులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటిలో Accountant, UDC, Forest Guard, Junior Engineer, Programmer, Pharmacist, Music Teacher లాంటి చాలానే విభాగాలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలు అంతా ఫుల్ టైం ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే Delhi లో కుదిరితే, పక్కా సెటిల్మెంట్. జీతం మంచి రేంజ్ లో ఉంటుంది. ఆగస్టు 18 నుంచి ఆన్లైన్లో అప్లై ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ 16, 2025 చివరి తేదీ.

 మొత్తం పోస్టుల వివరాలు – 615 ఖాళీలు

ఈ రిక్రూట్మెంట్ లో మొత్తం 615 పోస్టులు ఉన్నాయి. వాటిలో:

  • OC (UR): 294 పోస్టులు

  • OBC: 159 పోస్టులు

  • SC: 74 పోస్టులు

  • ST: 39 పోస్టులు

  • EWS: 49 పోస్టులు

ఈ విభజన కింద పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మీ కేటగిరీ బట్టి అప్లై చేసుకోవచ్చు.

 ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: ఆగస్టు 4, 2025

  • అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 18, 2025

  • అప్లై చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2025

  • ఎగ్జామ్ తేదీ: త్వరలో ప్రకటిస్తారు

 అప్లికేషన్ ఫీజు

  • General / OBC / EWS వారికి ₹100

  • SC / ST / PWD / Women వారికి ఎలాంటి ఫీజు అవసరం లేదు

  • పేమెంట్ విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

 అర్హతలు, విద్యా ప్రమాణాలు

ఇక్కడ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, పోస్ట్ వారీగా అర్హతలు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని పోస్టులకు డిగ్రీ, కొన్ని పోస్టులకు డిప్లొమా, కొన్ని పోస్టులకు 10th లేదా 12th చదివిన వారు అప్లై చేయొచ్చు. కింద కొన్ని ముఖ్యమైన పోస్టులకి అర్హతలు చూద్దాం:

1. Statistical Clerk

Mathematics, Economics లేదా Statistics లో డిగ్రీ ఉండాలి.

2. Assistant Public Health Inspector

10+2 చదివి, Sanitary Inspector డిప్లొమా ఉండాలి.

3. Forest Guard

12th క్లాస్ (Intermediate) చదివి ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ తప్పనిసరి.

  • మగవాళ్లకి హైట్: 163cms

  • ఛెస్ట్: 84cms (5cms Expansion)

  • ఆడవాళ్లకి హైట్: 150cms

  • ఛెస్ట్: 79cms (5cms Expansion)

4. Accountant / UDC (Auditor)

B.Com (Commerce డిగ్రీ) అవసరం. Accountant కి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

5. Programmer

Computer Science / Electronics లో Engineering డిగ్రీ లేదా DOEACC B Level ఉత్తీర్ణత అవసరం.

6. Junior Engineer (JE – Electrical/Mechanical)

3 years Diploma లేదా Degree in Engineering. JE కి 2 సంవత్సరాల అనుభవం కూడా అవసరం.

7. TGT (Special Education Teacher)

Graduation + B.Ed in Special Education ఉండాలి.

8. Music Teacher

Music లో Degree ఉండాలి.

9. Pharmacist (Unani)

10th + 2 years Unani Pharmacy డిప్లొమా ఉండాలి.

10. Mason, Draftsman, Caretaker, Work Assistant

అందులో కొన్నింటికి సాధారణ 10th చదివినవారు కూడా అప్లై చేయొచ్చు. అనుభవం ఉండాలి.

ఇంకా చాలా విభాగాల్లో పోస్టులు ఉన్నాయి – వాటి వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో ఉన్నాయి. ప్రతి అభ్యర్థి తన అర్హతను బట్టి చూసుకుని అప్లై చేయాలి.

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

 వయస్సు పరిమితి

  • పోస్ట్ బట్టి వయస్సు మారుతూ ఉంటుంది.

  • గరిష్ట వయస్సు 27 ఏళ్లుగా సూచించారు చాలా పోస్టులకి.

  • కట్ ఆఫ్ తేదీ: సెప్టెంబర్ 16, 2025

  • వయస్సు రాయితీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.

 జీతం ఎంత వస్తుంది?

ఇక్కడ ఉద్యోగాల రేంజ్ బట్టి జీతాలు మారతాయి. Pay Matrix – ₹19,900 నుంచి ₹1,42,400 వరకు జీతం ఉంటుంది.

చాలా పోస్టులకు స్టార్ట్ అయ్యే పే స్కేల్ ₹25,000 – ₹35,000 మధ్యే ఉంటుంది. JE, Programmer లాంటి పోస్టులకు ₹50,000+ వరకు ఉంటుంది.

 ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

  1. Written Exam (One Tier లేదా Two Tier – పోస్టు బట్టి)

  2. Skill Test (Stenographer లాంటి పోస్టులకి)

  3. Document Verification

  4. Medical Examination

ప్రతి అభ్యర్థికి అనుగుణంగా ఈ దశలు ఉండబోతున్నాయి. బోర్డు అధికారికంగా డేట్స్ & అడ్మిట్ కార్డ్స్ తర్వాత విడుదల చేస్తుంది.

ఉద్యోగం ఎక్కడ ఉంటుంది?

దిల్లీలోని ప్రభుత్వ శాఖలు, సబోర్డినేట్ సంస్థలు, మునిసిపల్ కార్యాలయాలు, స్కూళ్లు, వైద్య కేంద్రాలు ఇలా చాలా విభాగాల్లో ఈ ఉద్యోగాలు వుంటాయి. ముఖ్యంగా Karkardooma, New Delhi ప్రాంతం లో ఎక్కువగా పోస్టింగ్ వుంటుంది.

 దరఖాస్తు ఎలా చేయాలి?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే:

  1. https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్ కి వెళ్లండి

  2. కొత్తగా రిజిస్టర్ చేసుకోండి (లేదా ఉన్నవారు లాగిన్ అవ్వండి)

  3. మీ పూర్తి వివరాలు అక్క‌డ నమోదు చేయండి

  4. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి (ఫోటో, సంతకం, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు)

  5. కేటగిరీ బట్టి ఫీజు పేమెంట్ చేయండి

  6. ఫారమ్ లో డిటైల్స్ చెక్ చేసి Submit చేయండి

ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఎలాంటి మార్పులు చేయలేరు. కాబట్టి జాగ్రత్తగా పూర్తి చేయాలి.

Notification 

Apply Online 

Official Website 

చివరిగా – ఎవరికి ఈ జాబ్స్ బాగా ఉపయోగపడతాయంటే?

  • ప్రభుత్వ ఉద్యోగమే టార్గెట్ పెట్టుకున్న వాళ్లకి ఇది మంచి అవకాశం

  • Delhi లో ఉద్యోగం కావాలనుకునే వాళ్లకి

  • Technical / Non-Technical రెండు సెట్‌ల వాల్లకి కూడా వీలవుతుంది

  • Fresher లకి కొంతమంది పోస్టులు సూటవుతాయి

  • అనుభవం ఉన్న వాళ్లకి ప్రత్యేకమైన పోస్టులు కూడా ఉన్నాయి

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

 ముఖ్యమైన సూచనలు

  • అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోండి

  • తప్పుల్లేని రెజ్యూమ్ తయారు చేయండి

  • ఎగ్జామ్ సిలబస్ త్వరలో రాబోతుంది, ముందుగానే ప్రిపేర్ అవ్వండి

  • అప్లై చేసే ముందు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి పూర్తిగా చదవండి

  • మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసే సమయంలో రిఫరెన్స్‌గా ఉంచండి

ఇంతకు మించి క్లారిటీ కావాలంటే కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేస్తా. ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తే, ఈ DSSSB 2025 నోటిఫికేషన్ తప్పక పంపండి.

Leave a Reply

You cannot copy content of this page