RRB Section Controllers Recruitment 2025 | ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో 368 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రైల్వే శాఖలో ఉద్యోగం అనేది ఎంతో మందికి కలల ఉద్యోగం. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ట్రాఫిక్ విభాగంలో Section Controller పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 368 ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం
విభాగం | వివరాలు |
---|---|
నియామక సంస్థ | Railway Recruitment Board (RRB) |
పోస్టుల పేరు | Section Controller (SC) |
ఖాళీల సంఖ్య | 368 పోస్టులు |
అర్హత | కనీసం డిగ్రీ ఉత్తీర్ణత (Graduate) |
వయసు పరిమితి | కనిష్టం: 18 సంవత్సరాలు, గరిష్టం: 30 సంవత్సరాలు |
దరఖాస్తు విధానం | ఆన్లైన్‌లో |
దరఖాస్తు ప్రారంభ తేది | త్వరలో విడుదలవుతుంది |
దరఖాస్తు చివరి తేది | త్వరలో విడుదలవుతుంది |
రిక్రూట్మెంట్ విభాగం | ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ |
జాబ్ లొకేషన్ | దేశవ్యాప్తంగా (జోన్ వారీగా) |
పోస్టుల విభజన – జోన్ వారీగా ఖాళీలు
ప్రస్తుతం రైల్వే బోర్డు అన్ని జోన్‌ల నుండి Indent Management System ద్వారా ఖాళీల సమాచారం సేకరిస్తోంది. త్వరలో జోన్ వారీగా ఖాళీల విభజన కూడా అధికారికంగా విడుదల అవుతుంది.
అర్హత వివరాలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులు కనీసం గ్రాడ్యుయేషన్ (Degree) పూర్తి చేసి ఉండాలి. ఏ స్ట్రీమ్ అయినా సరే, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు.
వయసు పరిమితి
-
కనిష్ట వయసు: 18 సంవత్సరాలు
-
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025గరిష్ట వయసు: 30 సంవత్సరాలు
-
ప్రభుత్వ నియమాల ప్రకారం SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు తేదీలు
ప్రస్తుతం జోన్‌లతో ఇన్‌డెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు ప్రారంభం మరియు ముగింపు తేదీలు త్వరలో RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు. మీరు రెగ్యులర్‌గా వెబ్‌సైట్‌ను లేదా ఈ పేజీని చెక్ చేస్తూ ఉండండి.
రిక్రూట్మెంట్ ప్రక్రియ
ఈ పోస్టులకు సంబంధించి Centralized Employment Notification (CEN) ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో సాధారణంగా ఉండే దశలు:
-
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
-
మెడికల్ టెస్ట్
-
డాక్యుమెంట్ వెరిఫికేషన్
-
ఫైనల్ మెరిట్ లిస్ట్
జీతభత్యాలు (Pay Scale)
Section Controllers ఉద్యోగాలకు అటాచ్ఛైన పే స్కేల్ ప్రస్తుతానికి RRB CEN ద్వారా ప్రకటించాల్సి ఉంది. అయితే సాధారణంగా ఈ పోస్టులకు లెవల్-6 లేదా లెవల్-7 పే స్కేల్ ఉండే అవకాశం ఉంది. మొదట్లోనే ₹65,000/- పైగా జీతం వచ్చే అవకాశం ఉంది.
దరఖాస్తు ఎలా చేయాలి?
-
RRB అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.rrbcdg.gov.in
-
“CEN 2025 for Section Controllers” అనేదాన్ని క్లిక్ చేయండి
-
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
-
ఫీజు చెల్లించండి (కేటగిరీపై ఆధారపడి)
-
దరఖాస్తు ఫారమ్‌ను సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి
అవసరమైన డాక్యుమెంట్లు
-
గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్
-
ఫొటో & సిగ్నేచర్ (scan చేసినవి)
-
క్యాటగిరీ సర్టిఫికేట్ (SC/ST/OBC/EWS ఉన్నవారికి)
-
ఆధార్ లేదా ఇతర ఐడీ ప్రూఫ్
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
ముఖ్య సూచనలు
-
దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవండి
-
ఒకే జోన్‌లో అప్లై చేయాలి – మల్టిపుల్ జోన్‌లకు అప్లై చేయరాదు
-
ఫేక్ వెబ్‌సైట్లను జాగ్రత్తగా నివారించండి
Official Notification Status
ప్రస్తుతం RRB బోర్డు ద్వారా జోన్‌లకు ఉత్తర్వులు ఇచ్చారు. దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుంది. అప్లికేషన్ విండో ఒక వారం పాటు మాత్రమే ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1: ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుందా?
Ans: లేదండి, CBT (Computer Based Test) ఆధారంగానే ఎంపిక చేస్తారు.
Q2: మెడికల్ టెస్ట్ కచ్చితంగా అవసరమా?
Ans: అవును, ట్రాఫిక్ విభాగం కాబట్టి Good Vision & Hearing ఉండాలి.
Q3: ఇంటర్ చదివినవారు అప్లై చేయచ్చా?
Ans: మినిమమ్ అర్హత డిగ్రీ. ఇంటర్ మాత్రమే ఉంటే అప్లై చేయలేరు.
Q4: ఓబీసీ అభ్యర్థికి వయస్సు సడలింపు ఎంత?
Ans: సాధారణంగా 3 సంవత్సరాలు వరకూ సడలింపు ఉంటుంది.
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
చివరిగా…
ఈ ఉద్యోగాలు స్ట్రెస్స్ టోలరెన్స్, షార్ట్ డెసిషన్ మేకింగ్, కన్సన్ట్రేషన్ ఉన్న వారికి మంచి అవకాశాలు కల్పిస్తాయి. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు నిర్ధైర్యంగా అప్లై చేయండి. త్వరలో పూర్తి నోటిఫికేషన్, పరీక్ష విధానం, సిలబస్ తదితర సమాచారం అందిస్తాం.