TMB Ace Bankers Program 2025 – బ్యాంక్ ప్రోబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు
బ్యాంకింగ్ రంగంలో మంచి జాబ్ తీసుకోవాలని, అదే టైంలో హ్యాండ్సమ్ ప్యాకేజ్ తో కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్లకి ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. Tamilnad Mercantile Bank Ltd. (TMB) – ఇది 100 సంవత్సరాల ట్రస్ట్, ఇన్నోవేషన్ తో రాణిస్తున్న బ్యాంక్. ఈ బ్యాంక్ ఇప్పుడు Probationary Officer పోస్టుల కోసం “Earn While You Learn” మోడల్ లో TMB Ace Bankers Program ద్వారా కొత్తగా రిక్రూట్‌మెంట్ మొదలుపెట్టింది.
ఇది సాధారణ జాబ్ కాదురా – ఇది ఒక పూర్తి ట్రైనింగ్ + ఇంటర్న్‌షిప్ + జాబ్ ప్యాకేజ్, అందులో మీరు నేర్చుకుంటూనే జీతం కూడా పొందుతారు.
ఎందుకు ఈ అవకాశం స్పెషల్?
-
CTC ప్యాకేజ్: ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాత ₹8,64,000 వార్షిక ప్యాకేజ్ (ఫిక్స్‌డ్ + వేరియబుల్ పేతో)
-
Earn While You Learn: ట్రైనింగ్ సమయంలోనే ₹3,56,000 జీతం వస్తుంది
-
PGDBSO సర్టిఫికేట్: ట్రైనింగ్ పూర్తయ్యాక మణిపాల్ అకాడమీ ఆఫ్ BFSI నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లభిస్తుంది
-
50% ఫీజు రీయింబర్స్‌మెంట్: జాయినింగ్ తర్వాత 36 నెలలు పూర్తి చేస్తే, ప్రోగ్రామ్ ఫీజులో సగం తిరిగి వస్తుంది
ప్రోగ్రామ్ డీటైల్స్
ఈ TMB Ace Bankers Program ని Tamilnad Mercantile Bank మరియు Manipal Academy of BFSI కలిసి నిర్వహిస్తున్నాయి. ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్, ఆన్-ది-జాబ్ లెర్నింగ్ అన్నీ ఇందులో భాగం.
1. ఫీజు మరియు కవరేజ్
-
ప్రోగ్రామ్ ఫీజు: ₹2,80,000 (GST కలిపి)
-
ఇందులో కవరయ్యేవి:
-
బోర్డింగ్ & లాడ్జింగ్ (మణిపాల్ క్యాంపస్, బెంగళూరు)
-
ట్రైనింగ్ మెటీరియల్
-
ఆండ్రాయిడ్ టాబ్లెట్
-
2. ట్రైనింగ్ & లెర్నింగ్ స్టేజ్‌లు
-
4 నెలలు – క్లాస్‌రూమ్ ట్రైనింగ్ (Manipal Campus, Bangalore)
-
బ్యాంకింగ్ ఫండమెంటల్స్, కస్టమర్ సర్వీస్, రీటైల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ టూల్స్ పై డీటైల్డ్ క్లాసులు
-
ప్రాక్టికల్ సెషన్స్, కేస్ స్టడీస్
-
-
2 నెలలు – ఇంటర్న్‌షిప్ @ TMB బ్రాంచ్
-
రియల్ టైమ్ కస్టమర్ హ్యాండ్లింగ్
-
అకౌంట్ ఓపెనింగ్, లొన్ ప్రాసెసింగ్, బ్రాంచ్ ఆపరేషన్స్ పై ప్రాక్టికల్ వర్క్
-
-
6 నెలలు – ఆన్-ది-జాబ్ ట్రైనింగ్
-
పూర్తి స్థాయి పనిని చేసి జీతం పొందే స్టేజ్
-
కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, ప్రోడక్ట్ సేల్స్, సర్వీస్ ఇంప్రూవ్‌మెంట్
-
- కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు
3. జీతం (Earn While You Learn)
-
క్లాస్‌రూమ్ ట్రైనింగ్: ₹5,000 / నెల
-
ఇంటర్న్‌షిప్: ₹24,000 / నెల
-
ఆన్-ది-జాబ్ ట్రైనింగ్: ₹48,000 / నెల
-
మొత్తం ట్రైనింగ్ సమయంలో ₹3,56,000 ఇన్‌కమ్ వస్తుంది
4. ఫైనల్ జాబ్ & ప్యాకేజ్
ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత:
-
డిజిగ్నేషన్: Probationary Officer (Senior Customer Service Executive – SCSE)
-
CTC: ₹8,64,000 / సంవత్సరం (ఫిక్స్‌డ్ + వేరియబుల్)
-
రీటైల్ బ్యాంకింగ్ లో ఆల్ ఇండియా లొకేషన్లలో పోస్టింగ్ అవకాశం
Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్
ఎలిజిబిలిటీ క్రైటీరియా
-
ఎడ్యుకేషన్: ఏదైనా రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ (60% మార్కులు తప్పనిసరి)
-
వయసు పరిమితి:
-
గ్రాడ్యుయేట్స్ – 28 ఏళ్లు లోపు
-
పోస్ట్ గ్రాడ్యుయేట్స్ – 30 ఏళ్లు లోపు
-
ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ప్యాటర్న్
సెక్షన్ | మార్కులు |
---|---|
Verbal Ability | 10 |
Analytical Ability | 20 |
Numerical Ability | 30 |
Computer Awareness | 10 |
Banking Awareness | 10 |
Listening Comprehension | 20 |
మొత్తం | 100 |
-
టెస్ట్ టైమ్: 60 నిమిషాలు
-
ప్రశ్నలు: 65
DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!
రిజిస్ట్రేషన్ ప్రాసెస్
-
అధికారిక వెబ్‌సైట్ లో అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి
-
అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి
-
ప్రోగ్రామ్ ఫీజు పేమెంట్
-
ఆన్‌లైన్ అసెస్‌మెంట్ రాయాలి
-
సెలెక్ట్ అయితే ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలి
కెరీర్ ప్రోగ్రెషన్
TMB లో ఉద్యోగులు డెడికేషన్ తో పనిచేస్తే, కెరీర్ లో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. Probationary Officer గా జాయిన్ అయ్యాక, మేనేజర్ లెవెల్స్, సీనియర్ మేనేజర్, బ్రాంచ్ హెడ్, రీజినల్ మేనేజర్ వరకు గ్రోత్ ఛాన్స్ ఉంటుంది.
కంపెనీ గురించి
Tamilnad Mercantile Bank Ltd. – 1921 లో తూతుకుడి లో ప్రారంభమై, ఇప్పుడు ఇండియా మొత్తం 585 బ్రాంచ్‌లతో ఎదిగిన బ్యాంక్. రోబోటిక్స్, డిజిటల్ బ్యాంకింగ్ వంటి ఆధునిక టెక్నాలజీ ని త్వరగా అంగీకరించిన బ్యాంక్.
Manipal Academy of BFSI – 2008 లో ప్రారంభమై, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ రంగాలలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తున్న ప్రముఖ ఇన్స్టిట్యూట్.
నా అభిప్రాయం
బ్యాంకింగ్ రంగంలో స్టేబుల్ జాబ్, గుడ్ ప్యాకేజ్, క్లియర్ కెరీర్ పాత్ కావాలనుకునే ఫ్రెషర్స్ కి ఇది సూపర్ ఛాన్స్. ట్రైనింగ్ టైంలోనే ఇన్‌కమ్ రావడం, తర్వాత పర్మనెంట్ జాబ్ రావడం ఈ ప్రోగ్రామ్ స్పెషల్.