DRDO – NPOL జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) Recruitment 2025 | DRDO JRF Notification in Telugu

DRDO – NPOL జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) రిక్రూట్‌మెంట్ 2025 పూర్తి వివరాలు

DRDO JRF Notification in Telugu మన దేశంలో డిఫెన్స్ రంగంలో పనిచేయాలని కలలు కనేవాళ్లకి ఒక పెద్ద అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన DRDO – Naval Physical and Oceanographic Laboratory (NPOL), కొచ్చి కొత్తగా జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలు ప్రధానంగా పరిశోధన, టెక్నాలజీ డెవలప్మెంట్‌కి సంబంధించినవి.

ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో eligibility నుండి ఇంటర్వ్యూ వరకూ అన్నీ క్లియర్‌గా తెలుగులో చెబుతున్నా.

ఉద్యోగం ఎవరి కోసం అంటే?

DRDO అంటే మన రక్షణ విభాగం కింద నడిచే ఒక పెద్ద రీసెర్చ్ సంస్థ. ఇక్కడి లాబొరేటరీస్‌లో దేశానికి అవసరమైన నూతన టెక్నాలజీస్ తయారవుతాయి. ఇప్పుడు NPOL నుంచి వచ్చిన నోటిఫికేషన్ ప్రత్యేకంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) కోసం. అంటే చదువు పూర్తయిన తర్వాత పరిశోధన ఫెలోషిప్ చేస్తూ, భవిష్యత్తులో రీసెర్చ్ రంగంలో కెరీర్ చేయాలని అనుకునేవాళ్లకి ఇది సరిగ్గా సరిపోయే అవకాశం.

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్‌లో పలు బ్రాంచ్‌లలో ఫెలోషిప్ పోస్టులు ఇచ్చారు. ముఖ్యంగా:

  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ – 2 పోస్టులు

  • మెకానికల్ ఇంజనీరింగ్ – 1 పోస్టు

  • కెమికల్ ఇంజనీరింగ్ / రబ్బర్ టెక్నాలజీ / పాలిమర్ టెక్నాలజీ / నానో టెక్నాలజీ / మెటీరియల్స్ సైన్స్ – 1 పోస్టు

  • ఆప్టో ఎలక్ట్రానిక్స్ – 1 పోస్టు

  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ – అంచనా పోస్టులు

  • ఫిజిక్స్ – అంచనా పోస్టులు

  • ఓషనోగ్రఫీ / ఓషన్ టెక్నాలజీ / మీటిరాలజీ – అంచనా పోస్టులు

మొత్తం ఖాళీలు కొన్ని కన్‌ఫర్మ్‌గా, కొన్ని anticipated (అంటే వచ్చే అవకాశమున్న పోస్టులు)గా ప్రకటించారు.

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

చదువు అర్హత (Qualification)

ఈ పోస్టులకి కనీసం ఫస్ట్ డివిజన్‌లో BE/B.Tech లేదా ME/M.Tech చేసినవాళ్లు కావాలి. అదనంగా NET/GATE తప్పనిసరి. ప్రతి బ్రాంచ్‌కి ఇలా ఉంటుంది:

  • కంప్యూటర్ సైన్స్: BE/B.Tech + GATE/NET లేదా ME/M.Tech ఫస్ట్ డివిజన్

  • మెకానికల్: BE/B.Tech + GATE/NET లేదా ME/M.Tech ఫస్ట్ డివిజన్

  • కెమికల్ / నానో టెక్నాలజీ: BE/B.Tech + GATE/NET లేదా ME/M.Tech ఫస్ట్ డివిజన్

  • ఆప్టో ఎలక్ట్రానిక్స్: BE/B.Tech + GATE/NET లేదా ME/M.Tech ఫస్ట్ డివిజన్

  • ఎలక్ట్రికల్ & కమ్యూనికేషన్ బ్రాంచ్‌లు: BE/B.Tech + GATE/NET లేదా ME/M.Tech ఫస్ట్ డివిజన్

  • ఫిజిక్స్: MSc ఫస్ట్ డివిజన్ + NET

  • ఓషనోగ్రఫీ / మీటిరాలజీ: MSc + NET లేదా M.Tech ఫస్ట్ డివిజన్

అంటే, simple గా చెప్పాలంటే టెక్నికల్ బ్రాంచ్‌లో BE/B.Tech లేదా ME/M.Tech ఫస్ట్ డివిజన్, సైన్స్ బ్రాంచ్‌లో MSc ఫస్ట్ డివిజన్ తో పాటు NET/GATE ఉండాలి.

వయసు పరిమితి

  • గరిష్ట వయసు: 28 ఏళ్లు (ఇంటర్వ్యూ రోజు నాటికి)

  • SC, ST, OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

జీతం (Fellowship)

ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37,000 రూపాయలు + హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) ఇస్తారు.
ఫెలోషిప్ మొదట 2 సంవత్సరాల పాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి తర్వాత extend అవుతుంది.

ఎంపిక విధానం

ఈ నోటిఫికేషన్‌లో ఎటువంటి వ్రాత పరీక్ష లేదు. పూర్తిగా Walk-in Interview ద్వారానే ఎంపిక చేస్తారు.

అభ్యర్థులు తీసుకెళ్లాల్సినవి:

  • అన్ని అసలు సర్టిఫికేట్లు (డిగ్రీ, మార్క్ మెమోలు)

  • కమ్యూనిటీ సర్టిఫికేట్

  • GATE/NET స్కోర్ కార్డ్

  • ఒక సెట్ xerox copies

  • ఫోటో ఐడి (Aadhar, PAN, Voter ID లేదా Driving License)

  • ఒక passport size ఫోటో

ఎక్కడ, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది?

  • తేదీ: 11 అక్టోబర్ 2025 (శనివారం)

  • సమయం: ఉదయం 9:30 గంటలకు

  • స్థలం: భవన్స్ వరుణ విద్యాలయ, NPOL క్యాంపస్, త్రిక్కాకర, కొచ్చి, కేరళ

ఇంటర్వ్యూ రోజే certificates చెక్ చేసి, తరువాత face-to-face ఇంటర్వ్యూ జరుగుతుంది.

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

అప్లై చేయడం ఎలా?

  • నేరుగా walk-in ఇంటర్వ్యూ కి హాజరు కావాలి

  • అయితే, ముందు bio-data ఒక page లో తయారు చేసి hrd.npol@gov.in కి email చేయమని సూచించారు (administration arrangement కోసం మాత్రమే)

  • Government/PSU ఉద్యోగులు అయితే proper channel ద్వారా రావాలి

Notification & Application Form 

ముఖ్యమైన పాయింట్లు గుర్తుంచుకోవాలి

  1. NET/GATE తప్పనిసరి – లేకుంటే consider చేయరు

  2. ఫెలోషిప్ అంటే permanent ఉద్యోగం కాదు – research project ముగిసే వరకు మాత్రమే ఉంటుంది

  3. Panel ఒక సంవత్సరం వరకే valid – ఒకసారి ఎంపిక అయితే వెంటనే post ఇవ్వకపోయినా future లో chance ఉంటుంది

  4. DRDO వెబ్‌సైట్‌లో updates ఎప్పటికప్పుడు చెక్ చేయాలి

ఈ ఉద్యోగం ఎవరికీ సెట్ అవుతుంది?

  • కొత్తగా M.Tech/MSc పూర్తి చేసుకున్న వాళ్లకి

  • Research ఫీల్డ్‌లో ఆసక్తి ఉన్న వాళ్లకి

  • NET/GATE క్లీర్ చేసి, రీసెర్చ్‌లో కెరీర్ చేయాలనుకునే వాళ్లకి

  • Central Govt లాబొరేటరీలో పనిచేసి, experience certificate పొందాలనుకునే వాళ్లకి

చివరి మాట

ఈ DRDO – NPOL JRF Recruitment 2025 notification అంటే research field లోకి వెళ్లాలని అనుకునే వాళ్లకి golden chance అని చెప్పొచ్చు. జీతం కూడా బాగానే ఉంది, పైగా DRDO లో పని చేయడం వలన future opportunities కూడా చాలా వస్తాయి. Interested ఉన్న వాళ్లు ఇంటర్వ్యూ తేదీకి ముందు అన్ని documents సిద్ధం చేసుకుని హాజరుకావాలి.

Leave a Reply

You cannot copy content of this page