వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ (WCL) Apprentices నియామకం 2025 – 1213 పోస్టులు, డిగ్రీ నుంచి 10వ వరకు అవకాశం
WCL Apprentices Recruitment 2025 దేశంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వ బొగ్గు సంస్థలలో ఒకటైన Western Coalfields Limited (WCL) నుంచి మరోసారి భారీ నియామక నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి మొత్తం 1213 Apprentices పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇది పూర్తిగా అప్రెంటిస్ ప్రోగ్రామ్ కింద జరుగుతున్న రిక్రూట్‌మెంట్. అంటే ట్రైనింగ్‌తో కూడిన ఉద్యోగ అవకాశం. ఇక్కడ B.Tech, Diploma, ITI, Inter, 10వ తరగతి అర్హత ఉన్నవారు అందరూ అప్లై చేయొచ్చు.
WCL Apprentices Notification 2025 ముఖ్యమైన విషయాలు
-
సంస్థ పేరు: Western Coalfields Limited (WCL)
-
పోస్ట్ పేరు: Apprentices
-
మొత్తం పోస్టులు: 1213
-
అర్హతలు: B.Tech/B.E, Diploma, ITI, 12వ, 10వ తరగతి
-
వయస్సు పరిమితి: కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 26 సంవత్సరాలు
-
అప్లికేషన్ ప్రారంభం: 17 నవంబర్ 2025
-
చివరి తేదీ: 30 నవంబర్ 2025
-
జీతం / స్టైపెండ్: ₹8,200 నుండి ₹12,300 వరకు
-
అధికారిక వెబ్‌సైట్: westerncoal.in
- SSC GD Constable 2026 Notification Telugu | Eligibility, PET, Salary, Apply Online Details | Latest Govt Jobs
పోస్టుల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్‌లో WCL యొక్క వివిధ ప్రాంతాల ఆధారంగా పోస్టులు ఉన్నాయి. Maharashtra మరియు Madhya Pradesh రాష్ట్రాల విభాగాల్లో మొత్తం 1213 Apprentices పోస్టులు భర్తీ చేస్తున్నారు.
-
Graduate Apprentices (Mining Engineering) – 101 పోస్టులు
-
Diploma Apprentices (Mining & Mine Surveying) – 215 పోస్టులు
-
Trade Apprentices (ITI) – 897 పోస్టులు (Fitter, Electrician, COPA, Welder, Mechanic Diesel, Surveyor, Machinist, Wireman, Steno మొదలైన విభాగాల్లో)
మొత్తం కలిపి 1213 పోస్టులు ఉన్నాయి.
అర్హత వివరాలు
Graduate Apprentices:
Mining Engineeringలో డిగ్రీ పూర్తయిన వారు అర్హులు.
Technician (Diploma) Apprentices:
Mining Engineering లేదా Mine Surveying Engineeringలో డిప్లొమా చేసినవారు అప్లై చేయవచ్చు.
Trade Apprentices (ITI):
ఇందులో వివిధ ట్రేడ్స్ ఉన్నాయి:
-
COPA (Computer Operator & Programming Assistant) – 10వ తరగతి + 1 సంవత్సరం ITI సర్టిఫికేట్
-
Fitter / Electrician / Wireman / Mechanic Diesel – 10వ తరగతి + 2 సంవత్సరాల ITI సర్టిఫికేట్
-
Welder / Pump Operator cum Mechanic / Steno (Hindi) – 10వ తరగతి + 1 సంవత్సరం ITI సర్టిఫికేట్
-
Draughtsman (Civil) / Machinist / Turner / Surveyor – 10వ తరగతి + 2 సంవత్సరాల ITI కోర్సు
Security Guard (Optional Trade):
కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది.
Federal Bank Officer Recruitment 2025 | Federal Bank Officer Jobs Apply Online
జీతం (Stipend)
WCL Apprenticesలకు ప్రతి ట్రేడ్ ఆధారంగా వేర్వేరు స్టైపెండ్‌లు ఉంటాయి.
-
Graduate Apprentice – ₹12,300 నెలకు
-
Technician Apprentice – ₹10,900 నెలకు
-
Fitter, Electrician, Machinist మొదలైన వారికి – ₹11,040 నెలకు
-
Welder, Pump Operator, Mechanic Diesel – ₹10,560 నెలకు
-
Security Guard – ₹8,200 నెలకు
ఇది ట్రైనింగ్ పీరియడ్‌లో ఇస్తారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
వయస్సు పరిమితి
-
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
-
గరిష్ట వయస్సు: 26 సంవత్సరాలు
-
01 ఆగస్టు 2025 నాటికి పరిగణలోకి తీసుకుంటారు.
-
వయస్సు సడలింపు SC/ST/BC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
ఎంపిక విధానం
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. అభ్యర్థులను అర్హతల్లో పొందిన మార్కుల ఆధారంగా (Merit Basis) షార్ట్‌లిస్ట్ చేస్తారు.
తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అందులో సర్టిఫికేట్‌లు చెక్ చేసిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్టు ప్రకటిస్తారు.
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
ఎలా అప్లై చేయాలి (How to Apply)
-
ముందుగా WCL అధికారిక వెబ్‌సైట్ westerncoal.in లోకి వెళ్ళాలి.
-
హోమ్ పేజీలో Career → Apprentice అనే సెక్షన్‌లోకి వెళ్లాలి.
-
మీకు తగిన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ చదవండి.
-
తర్వాత Online Registration చేసుకోవాలి. దీనికి valid email ID మరియు mobile number అవసరం.
-
రిజిస్ట్రేషన్ అయ్యిన తర్వాత online application form నింపాలి.
-
అందులో DOB, Address, Qualification, ITI details, caste details వంటి అన్ని వివరాలు జాగ్రత్తగా నింపాలి.
-
స్కాన్ చేసిన ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
-
ఫారమ్ చివర్లో Preview ఆప్షన్‌లో ఒకసారి చెక్ చేసి Submit చేయాలి.
-
చివరగా ఆ అప్లికేషన్‌ను PDF formatలో సేవ్ చేసుకోండి.
-
రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ భవిష్యత్తులో ఉపయోగపడతాయి కాబట్టి వాటిని నోట్ చేసుకోండి.
దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడుతుంది. పేపర్ ఆధారిత అప్లికేషన్లు అంగీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు
-
Online Apply ప్రారంభం: 17 నవంబర్ 2025
-
Online Apply ముగింపు: 30 నవంబర్ 2025
దీని తర్వాత అప్లికేషన్ లింక్ మూసివేయబడుతుంది కాబట్టి చివరి రోజుకి ఎదురుచూడకుండా ముందుగానే పూర్తి చేయడం మంచిది.
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
ఎందుకు అప్లై చేయాలి
-
పరీక్ష లేదు, సింపుల్‌గానే సెలెక్షన్ అవుతుంది
-
ప్రభుత్వ రంగ సంస్థలో పని చేసే అవకాశం
-
ట్రైనింగ్ తర్వాత శాశ్వత ఉద్యోగానికి అవకాశం ఉంటుంది
-
స్టైపెండ్ కూడా ఆకర్షణీయంగా ఉంది
-
10వ తరగతి నుండి డిగ్రీ వరకు ఎవరికైనా అవకాశం
చివరి మాట
ఈ WCL Apprentices Recruitment 2025 నిజంగా ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇది ప్రభుత్వ బొగ్గు సంస్థలో ట్రైనింగ్ తో కూడిన ఉద్యోగం. ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం అర్హత ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
కాబట్టి నీకు Mining, Electrician, Fitter, COPA, Mechanic Diesel వంటి ట్రేడ్స్‌లో ITI లేదా Diploma ఉంటే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసేయి.
ముఖ్య సూచన
“కింద ఉన్న లింకుల్లో నోటిఫికేషన్ PDF, Online Apply లింక్ అందుబాటులో ఉన్నాయి — వాటిని చూసి నేరుగా అప్లై చేయండి.”