AP Onestop Center Recruitment 2025 : 10వ తరగతి తో ఉద్యోగం

AP Onestop Center Recruitment 2025 – 10వ తరగతి తో ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళా నిరుద్యోగుల కోసం ఒక గొప్ప అవకాశంగా నిలుస్తున్నది ఈ AP Onestop Center Recruitment 2025 నోటిఫికేషన్. జిల్లాలవారీగా వన్ స్టాప్ సెంటర్లలో కుక్, మల్టీ పర్పస్ హెల్పర్ లాంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలైంది. చాలా మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే, అర్హతలు తక్కువగా ఉండటంతో ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది. మరి దీనికి సంబందించిన పూర్తి వివరాలు కింద తెలుగులో సింపుల్ గా క్లియర్ గా చూద్దాం.

ఎవరెవరు అప్లై చేయొచ్చు?

ఈ ఉద్యోగాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న మహిళా అభ్యర్థులే అప్లై చేయొచ్చు. ఇతర రాష్ట్రాలవారు అప్లై చేయడానికి అనుమతించడంలేదు. లోకల్ మహిళలు ఈ ఉద్యోగానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయసు పరిమితి ఎలా ఉంటుంది?

ఉద్యోగానికి అప్లై చేయాలంటే కనీసం వయసు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా అయితే 42 సంవత్సరాలు వరకూ అప్లై చేయొచ్చు. రిజర్వేషన్ ఉన్నవాళ్లకు వయసులో రీలాక్సేషన్ ఉంటుంది:

SC, ST అభ్యర్థులకు – 5 సంవత్సరాల రాయితీ

OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాల రాయితీ

దీంతోపాటు ఇతర రిజర్వేషన్ కోటాల విషయంలో స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత నిర్ణయించబడుతుంది.

OnePlus Nord 5 Mobile 2025 : మధ్య తరగతి వాళ్ల కోసం ఫుల్ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్!

అర్హతలు ఏంటంటే…

ఈ ఉద్యోగాలకు మీరు కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. దీని తో పాటు ఆరోగ్యంగా ఉండాలి, సేవా దృక్పథం ఉండాలి, సెంటర్ లో క్రమశిక్షణగా పని చేయగలగాలి.

కుక్ పోస్టుకు అయితే వంట చేయడంలో కొంత అనుభవం ఉంటే మంచిది.
మల్టీ పర్పస్ స్టాప్ పోస్టుకు అయితే శుభ్రత, చిన్నపాటి వర్కులు చేయడం వంటి పనుల్లో కొంత తెలివితేటలు అవసరం అవుతుంది.

ఖాళీలు (వెకెన్సీలు) ఎన్ని?

ప్రస్తుతం జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటనలో పేర్కొన్నారు. వాటిలో ఎక్కువగా రెండు పోస్టులే ఉన్నాయని చెబుతున్నారు:

కుక్

మల్టీ పర్పస్ స్టాప్

ఇవి అన్నీ కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. అంటే, మొదట సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ మీద పని చేస్తారు. పనితీరు బాగుంటే కాంట్రాక్ట్ పొడగించవచ్చు.

Free Electric Vehicles for Women – తెలంగాణ EV పాలసీ 2025 పూర్తి వివరాలు

జీతం ఎంత?

ఈ ఉద్యోగాల్లో పని చేస్తున్నవారికి నెలకు రూ.13,000/- జీతంగా చెల్లించబడుతుంది. ఇది సరిగ్గా గవర్నమెంట్ ఉద్యోగం కాదుగానీ, ప్రభుత్వం ద్వారా నడిచే కేంద్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగంగా పరిగణించబడుతుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత?

దరఖాస్తు చేసే సమయంలో కొన్ని చార్జీలు కూడా చెల్లించాలి.

సాధారణ అభ్యర్థులు (UR) – ₹250

SC / ST / BC అభ్యర్థులు – ₹200

ఈ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో లేదా బ్యాంకు చలాన్ ద్వారా చెల్లించాలని సూచించారు.

PM Vidyakaxmi Scheme : స్టూడెంట్స్ కి ఉన్నత విద్యకు 7.50 లక్షల రూపాయలు

సెలెక్షన్ విధానం ఎలా ఉంటుంది?

ఇక్కడ ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ అనేది ఉండదు. మీరు సమర్పించిన సర్టిఫికెట్లు ఆధారంగా మరియు స్థానికత ఆధారంగా డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది.

ఉదాహరణకి మీరు 10వ తరగతి పాసై ఉంటే, మీ డేటా స్థానిక అధికారులకు సమర్పించాలి. వాళ్లు అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి, వారి జాబితాను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు జూలై 7 నుంచి జూలై 14, 2025 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
సాయంత్రం 5:30 గంటల లోపు అప్లికేషన్ అందజేసేలా చూడాలి. ఆలస్యం అయిన అప్లికేషన్లు తీసుకోరని స్పష్టం చేశారు.

దరఖాస్తు ఎలా చేయాలి?

ఈ దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా నేరుగా సంబంధిత జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆఫీసు కు వెళ్లి సమర్పించవచ్చు.

అప్లికేషన్ ఫారమ్ ను నోటిఫికేషన్ లో ఇచ్చిన ఫార్మాట్ లోనే సిద్ధం చేయాలి. ఇందులో మీ పేరు, వయసు, విద్యార్హతలు, చిరునామా, ఫోన్ నెంబర్, తదితర వివరాలను స్పష్టంగా రాయాలి. అటాచ్ చేయవలసిన డాక్యుమెంట్స్:

10వ తరగతి సర్టిఫికెట్

కుల మరియు రెసిడెన్స్ సర్టిఫికెట్

ఆధార్ కార్డు

ఫోటోలు

చెల్లించిన అప్లికేషన్ ఫీజు రసీదు

Notification

Application Form 

నియామక ప్రాంతాలు:

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ జిల్లా స్థాయిలో విడుదల అయ్యింది. కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆఫీస్ అడ్రస్ ప్రకటించారు. మీరు ఎక్కడకు అప్లై చేయాలో, ఎక్కడ ఆఫీస్ ఉందో నోటిఫికేషన్ లో చూసి పంపించాలి. పత్రికల్లో లేదా జిల్లా వెబ్‌సైట్లలో పూర్తివివరాలు చూడవచ్చు.

ఈ ఉద్యోగాల్లో ప్రత్యేకతలు:

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వన్ స్టాప్ సెంటర్ లో పనిచేయడం

సురక్షితమైన ఉద్యోగం – మహిళల అభ్యుదయం కోసం

కనీస అర్హతతో – పెద్దగా చదువు అవసరం లేదు

ఎగ్జామ్ అవసరం లేదు

నెలకు 13 వేలు జీతం

లోకల్ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత

రూల్స్ ప్రామాణికంగా ఉండడం వల్ల మంచి ట్రాన్స్‌పరెన్సీ

AP Nirudhyoga Bruthi Scheme 2025 : నిరుద్యోగులకు నెలకు ₹3000 మద్దతు ప్రారంభం!

చివరిగా చెప్పాలంటే…

ఒకవేళ మీరు 10వ తరగతి పాసై ఉండి, ప్రభుత్వం ద్వారా నడిచే సురక్షితమైన చోట పని చేయాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. సెలెక్షన్ కోసం ఎగ్జామ్ లేదంటే ఇంటర్వ్యూలు కూడా లేవు. అర్హతలు సరిపోతే మీరు అప్లై చేసి, మీ గ్రామం దగ్గరే ఉద్యోగం దక్కించుకోవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగంగా ఉన్న మహిళల కోసం ఇది మంచి అవకాశం. జూలై 14 లోపల అప్లై చేయడం మర్చిపోవద్దు.

ఇదే పూర్తి AP Onestop Center Recruitment 2025 వివరాలు. ఇంకా ఏమైనా క్వెరీ ఉంటే అడగచ్చు.

Leave a Reply

You cannot copy content of this page