APSRTC Recruitment 2025– 281 పోస్టులు, ఇప్పుడే అప్లై చేయండి!

APSRTC ITI Apprenticeship 2025 – పూర్తి సమాచారం

పరిచయం

అందరికీ తెలిసినట్లుగానే, మన APSRTC అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్. ఇది మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున బస్సు సర్వీసులు నడిపే ఒక ముఖ్యమైన సంస్థ. ప్రతి ఏడాది RTC లో డ్రైవర్లు, కన్డక్టర్లు, టెక్నికల్ పోస్టులు, అప్రెంటిస్ ట్రైనింగ్ లాంటి అవకాశాలు రాబడుతూనే ఉంటాయి. ఈసారి కూడా APSRTC నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం 281 అప్రెంటిస్ పోస్టులను రిలీజ్ చేసింది.

ఈ ఉద్యోగాలు ముఖ్యంగా ITI పూర్తిచేసినవాళ్ల కోసం. ఎవరు transportation sector లో career మొదలుపెట్టాలనుకుంటున్నారో వాళ్లకి ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే selection ప్రక్రియ సింపుల్ గా ఉంటుంది – merit + certificate verification మాత్రమే.

ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి?

ఈ ఉద్యోగాలు నాలుగు జిల్లాల్లో ఉన్నాయి:

  • చిత్తూరు జిల్లా – 48 పోస్టులు

  • తిరుపతి జిల్లా – 88 పోస్టులు

  • నెల్లూరు జిల్లా – 91 పోస్టులు

  • ప్రకాశం జిల్లా – 54 పోస్టులు

మొత్తం 281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఏ Trades లో పోస్టులు ఉన్నాయి?

ఈ అప్రెంటిస్ జాబ్స్ కింది trades లో ఉన్నాయి:

  • డీజిల్ మెకానిక్

  • మోటార్ మెకానిక్

  • ఎలక్ట్రీషియన్

  • వెల్డర్

  • పెయింటర్

  • మషినిస్ట్

  • ఫిట్టర్

  • డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్)

ఎవరు ఏ trade లో ITI చేసినారో, వాళ్లు ఆ trade కి అప్లై చేసుకోవచ్చు.

ఎవరు అప్లై చేయవచ్చు?

  • తప్పనిసరిగా ITI సర్టిఫికేట్ ఉండాలి (రిలేటెడ్ ట్రేడ్ లోనే).

  • ఫ్రెషర్స్ అయినా, కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్లైనా అప్లై చేయవచ్చు.

  • AP కి చెందినవాళ్లు అయితే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది.

అప్లికేషన్ ఫీ

అప్లై చేయడానికి ఒక చిన్న ఫీజు ఉంటుంది:

  • ₹100 + ₹18 GST = ₹118/-
    ఇది online లోనే చెల్లించాలి.

సాలరీ / స్టైపెండ్

ఇది అప్రెంటిస్ జాబ్ కాబట్టి, APSRTC నిబంధనల ప్రకారం స్టైపెండ్ ఇస్తారు. అంటే ITI పూర్తిచేసిన వాళ్లకి training సమయంలో నెలనెలా కొంత జీతం వస్తుంది. ఇది ఫిక్స్‌డ్‌గా ఉండదు – కానీ సాధారణంగా మంచి హ్యాండ్‌సమ్ స్టైపెండ్ ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: అక్టోబర్ 4, 2025

  • సర్టిఫికేట్స్ అందజేయడానికి చివరి తేదీ: అక్టోబర్ 6, 2025

ఈ తేదీలను తప్పక గుర్తుంచుకోవాలి.

సెలక్షన్ ప్రాసెస్

ఇక్కడ exam లాంటి టెన్షన్ ఏమీ లేదు. Selection పూర్తిగా merit base మీదే జరుగుతుంది.

  1. మీరు ITI లో సాధించిన మార్కుల ఆధారంగా ఒక merit list తయారు చేస్తారు.

  2. ఆ తర్వాత certificate verification చేస్తారు.

  3. అన్ని డాక్యుమెంట్స్ సరైనవిగా ఉంటే, final selection జరుగుతుంది.

Certificate verification place: Zonal Staff Training College, Kakutur, SPSR Nellore district.

అవసరమైన డాక్యుమెంట్స్

అప్లై చేసిన తర్వాత, మీరు మీ certificates ని పంపాలి. అవి ఇవి:

  • SSC Marks Memo

  • ITI Marks Memo

  • Apprenticeship Registration Number Proof

  • Online Application Print

  • APSRTC resume format (అధికారిక వెబ్‌సైట్ లో డౌన్‌లోడ్ చేయాలి)

  • Self-attested xerox copies of all certificates

ఎలా అప్లై చేయాలి? (Step by Step)

  1. ముందుగా www.apprenticeshipindia.gov.in లో రిజిస్టర్ అవ్వాలి.
    Apprenticeship portal లో profile క్రియేట్ చేసి, మీ details సరిగ్గా ఫిల్ చేయాలి.

  2. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, login అవ్వాలి.

  3. మీరు ఏ జిల్లా లో apply చేయాలనుకుంటున్నారో, ఆ district select చేసి apply చేయాలి.

  4. APSRTC official website లోకి వెళ్లి resume format డౌన్‌లోడ్ చేయాలి.

  5. Resume నింపి, మీ self-attested certificates attach చేయాలి.

  6. Completed documents ని post ద్వారా ఈ అడ్రస్ కి పంపాలి:
    Principal, Zonal Staff Training College, Kakutur, Venkatachalam Mandal, SPSR Nellore District.

  7. Certificates పంపే చివరి తేదీ – October 6, 2025.

Notification

Apply Online 

ఎందుకు ఈ జాబ్ మంచిది?

  • Govt sector లోకి అడుగు పెట్టే చాన్స్.

  • ITI చేసినవాళ్లకి directగా practical experience దొరుకుతుంది.

  • RTC లాంటి పెద్ద సంస్థలో పనిచేయడం వలన తర్వాత ఇతర ఉద్యోగాలకు apply చేయడానికి ఇది ఒక plus point అవుతుంది.

  • Exam లేకుండా, marks ఆధారంగా మాత్రమే selection జరుగుతుంది.

చిన్న టిప్స్ అప్లై చేసేవారికి

  • Application details తప్పకుండా cross-check చేయాలి. చిన్న mistake వలన కూడా rejection అవ్వొచ్చు.

  • Certificates అన్నీ properగా self-attest చేసి పంపాలి.

  • Last minute కి వదిలేయకుండా ముందుగానే documents పంపేయడం మంచిది.

  • ITI marks బలంగా ఉన్నవాళ్లకి almost confirm selection chances ఉంటాయి.

ముగింపు

మొత్తానికి, APSRTC ITI Apprenticeship 2025 అంటే ITI పూర్తి చేసినవాళ్లకి ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. Transportation sector లో career మొదలుపెట్టాలనుకునే వారికి ఇది ఒక right opportunity. కాబట్టి eligible అయిన ప్రతి ఒక్కరూ వెంటనే అప్లై చేయడం మంచిది.

Leave a Reply

You cannot copy content of this page