ARCI R&D Officer Jobs 2025 : Hyderabad లో ఉన్నత స్థాయి కేంద్ర ఉద్యోగాలు వచ్చాయి!

R&D డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ – Officer Level Jobs, Hyderabad Posting తో Best Chance!

ARCI R&D Officer Jobs 2025 : Hyderabad లో ఉన్న సెంట్రల్ R&D organization నుంచి Officer Level ఉద్యోగాలకు నోటిఫికేషన్ బయట పడింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (Department of Science & Technology) కి చెందిన ఓ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. పేరు: ARCI – International Advanced Research Centre for Powder Metallurgy and New Materials.

ఇది తెలంగాణ హైదరాబాదులో ఉన్న అటానమస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్. ఇప్పటివరకు చాలా సైంటిఫిక్, టెక్నాలజికల్ రంగాల్లో సేవలందించిన సంస్థ ఇది. ఈసారి ఈ సంస్థ నుండి Scientist E, Scientist C, Scientist B అనే మూడు లెవెల్స్ లో Officer Level ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.

మొత్తం 11 పోస్టులు, వాటిలో కొన్ని సీనియర్ లెవెల్ వర్క్ ఉండే Scientist E, కొన్ని ఇంజినీరింగ్ మరియు సైన్స్ బేస్డ్ Junior Scientist B పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 జూలై 28లోపు అప్లై చేయాల్సి ఉంటుంది.

ఇవి ఏ రకమైన ఉద్యోగాలు?

ఇవి అంత తక్కువ స్థాయి ఉద్యోగాలు కావు. ఇవన్నీ ప్రతిష్టాత్మకమైన R&D సైంటిస్టు ఉద్యోగాలు. హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఇంఛార్జ్ లెవెల్ వరకు ఉన్న రోల్స్. Hyderabad లోనే పోస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు రీసెర్చ్ లో ఇంటరెస్ట్, నానో టెక్నాలజీ, బ్యాటరీ టెక్, మెటీరియల్స్ సైన్స్ వంటి విభాగాల్లో నాలెడ్జ్ ఉంటే – ఈ పోస్టులు మీకోసమే.

పోస్టులు ఎంతంటే?

ఈసారి విడుదలైన ఖాళీలు కేవలం 11 మాత్రమే. అయితే ప్రతి ఒక్కటి ప్రాముఖ్యత కలిగిన పోస్టే.

Scientist E – 3 పోస్టులు

Scientist C – 1 పోస్టు

Scientist B (Science) – 2 పోస్టులు

Scientist B (Engineering) – 5 పోస్టులు

Scientist B అనేది base level scientist పోస్టు, Scientist E అంటే 10+ years R&D అనుభవం ఉన్న వారికి లభించే సీనియర్ పోస్టు. మరి మీ అనుభవానికి, అర్హతలకు తగ్గట్టు apply చేయవచ్చు.

జీతం ఎంత వస్తుంది?

ఈ ఉద్యోగాలు పర్మనెంట్ గవర్నమెంట్ పోస్టులు కావడం వల్ల బేసిక్ జీతంతో పాటు అన్ని అలవెన్సులు లభిస్తాయి. Scientist E లాంటి పోస్టులకు నెలకు సుమారుగా రూ. 1.3 లక్షలు జీతం వస్తుంది. Scientist B కీ సుమారు లక్ష రూపాయల జీతం వస్తుంది.

ఇది కేవలం బేసిక్ కాదూ, దీనితో పాటు:

DA (Dearness Allowance)

HRA (House Rent)

Transport Allowance

NPS (Pension)

LTC (Leave Travel Concession)

Medical reimbursements

Children Education Allowance

అన్నీ కలిపి పూర్తి స్ధాయిలో గవర్నమెంట్ బెనిఫిట్స్ కలవు. ఉద్యోగ భద్రతతో పాటు జీత భద్రత కూడా ఉంటుంది.

అర్హతలు ఏం కావాలి?

Scientist E: Physical Sciences లో Doctorate లేదా Engineering లో Master’s + 10 సంవత్సరాల R&D అనుభవం అవసరం. మీకు battery research, nanomaterials, hydrogen fuel, solar photovoltaics వంటి రంగాల్లో practical work ఉంటే ఇది మీకే.

Scientist C: Electrical లేదా EEE లో డిగ్రీ + 4 సంవత్సరాల పని అనుభవం అవసరం. Substation, Solar PV లాంటి practical exposure ఉన్నవారు apply చేయవచ్చు.

Scientist B (Science): Physical లేదా Chemical Sciences లో Master’s ఉండాలి. doctorate ఉంటే plus point. కనీసం 1 year R&D అనుభవం ఉంటే మంచిది.

Scientist B (Engineering): Materials, Mechanical లేదా Chemical Engineering లో డిగ్రీ ఉండాలి. Masters ఉంటే బెస్ట్. 1 year R&D experience ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.

వయస్సు పరిమితి?

Scientist B, C పోస్టులకు గరిష్ఠ వయస్సు 35 ఏళ్లు. Scientist E కు స్పష్టంగా వయస్సు చెప్పలేదు కానీ, అనుభవాన్ని బట్టి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు వయస్సు సడలింపులు ఉంటాయి.

సెలెక్షన్ విధానం ఎలా ఉంటుంది?

Scientist E & C – ఈ పోస్టులకు మీ R&D పై అనుభవం ఆధారంగా Presentation (15-20 mins) తీసుకుంటారు. ఆ తరువాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

Scientist B – Written Exam (Competitive Written Examination – CWE) జరుగుతుంది.

100 Objective questions

మొత్తం 300 మార్కులు

3 గంటల పరీక్ష

Negative marking ఉంటుంది

Written Test + Interview కి 50% weightage ఉంటుంది

ఈ విధంగా మీ technical knowledge తో పాటు communication skills కూడా assess చేస్తారు.

అప్లికేషన్ ఫీజు ఎంత?

Scientist E, C – ₹1000 ఫీజు (ఏ category అయినా సరే)

Scientist B –

₹600: General, OBC

₹300: ST, EWS, PWD, Women

ఈ ఫీజును Canara Bank Hyderabad లోని అకౌంట్‌కి NEFT లేదా RTGS ద్వారా చెల్లించాలి. ఫీజు వివరాలు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ లో mention చేయాలి.

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

దరఖాస్తు ఎలా చేయాలి?

మీరు మొదటగా ARCI అధికారిక వెబ్‌సైట్ – www.arci.res.in కి వెళ్ళాలి

“Careers” సెక్షన్ లోకి వెళ్లి “Scientist Recruitment 2025” నోటిఫికేషన్ ఎంచుకోండి

మీ అర్హత, అనుభవం చూసుకుని సరైన పోస్టు సెలెక్ట్ చేసుకోండి

అఫిషియల్ అప్లికేషన్ ఫామ్ ద్వారా వివరాలు ఫిల్ చేసి, ఫీజు చెల్లించి సమర్పించండి

Scientist E & C పోస్టులకు రీసెర్చ్ ప్రపోజల్, రిఫరెన్స్ appraisal letters attach చేయాలి

ఈ ఉద్యోగాలు ఎందుకు ప్రత్యేకం?

Hyderabad లో పోస్టింగ్ ఉండడం

Pure R&D job కాబట్టి innovation scope ఎక్కువ

Officer Level scientist పోస్టులు కావడం

JRF, SRF experience ఉన్నవారికి next-level career

స్త్రీలకు ప్రత్యేక ప్రోత్సాహం (gender balance encourage చేస్తున్నారు)

Long-term govt benefits + రీసెర్చ్ లో స్థిరమైన జాబ్

Notification 

Apply Online 

చివరిగా…

ఇలాంటి R&D పోస్టులు చాల అరుదుగా వస్తాయి. ఇది R&D passion ఉన్నవాళ్లకి, పబ్లికేషన్ ఉన్నవాళ్లకి, authentic research చేయాలనుకునే వాళ్లకి perfect opportunity.

మీకు బోధనా, పరిశోధనలపై ఆసక్తి ఉంటే… ఇలాంటి prestigious institute లో scientistగా పని చేయడం గొప్ప గౌరవం.

జూలై 28, 2025 చివరి తేదీ. Apply చేయడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి. పూర్తి వివరాలు ARCI website లో దొరుకుతాయి. అప్లికేషన్ ముందే పూర్తి చేసి పెట్టుకోండి, చివరికి పోటీలో పోయేలా కాకుండా.

Leave a Reply

You cannot copy content of this page