BEL Trainee Engineer Recruitment 2025 – పూర్తి వివరాలు
పరిచయం
ఫ్రెండ్స్, మన దగ్గర ఇంజనీరింగ్ చదివిన వాళ్లకి పెద్ద కంపెనీ లాంటిదిలో జాబ్ దొరకాలని కల ఉంటుంది. ముఖ్యంగా డిఫెన్స్ సంబంధం ఉన్న కంపెనీ ల్లో అయితే ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతాం. అలాంటి ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. Bharat Electronics Limited (BEL) అనే Navaratna PSU నుంచి కొత్తగా Trainee Engineer-I పోస్టులకి భారీ నోటిఫికేషన్ వచ్చింది.
మొత్తం 610 పోస్టులు ఖాళీగా ఉంచారు. పోస్టింగ్ బెంగుళూరు కాంప్లెక్స్ తో పాటు, ఇండియా అంతటా BEL ప్రాజెక్ట్స్ లో ఉంటుంది. జీతం మొదట 30,000 నుంచి మొదలై, రెండో, మూడో సంవత్సరం పెరుగుతూ 40,000 వరకు వస్తుంది.
అంటే ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఫ్యూచర్ కోసం వెతుకుతున్న వాళ్లకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
ఖాళీలు ఎంత? – పోస్టుల బ్రేక్‌డౌన్
BEL నోటిఫికేషన్ లో discipline వారీగా ఇలా పోస్టులు ఉన్నాయి:
-
TEBG విభాగం:
-
Electronics – 258
-
Mechanical – 131
-
Computer Science – 44
-
Electrical – 55
-
మొత్తం – 488
-
-
TEEM విభాగం:
-
Electronics – 43
-
Mechanical – 55
-
Electrical – 24
-
మొత్తం – 122
-
గ్రాండ్ టోటల్: 610 పోస్టులు
అర్హతలు (Eligibility)
విద్యార్హత
-
B.E, B.Tech లేదా 4 సంవత్సరాల B.Sc Engineering డిగ్రీ ఉండాలి.
-
యూనివర్సిటీ/కాలేజీ తప్పనిసరిగా AICTE/UGC ద్వారా అప్రూవ్ అయి ఉండాలి.
-
డిసిప్లైన్ wise క్వాలిఫికేషన్స్:
-
Electronics: Electronics, ECE, ETE, Communication, Instrumentation, Telecommunication.
-
Mechanical: Mechanical, Mechatronics, Industrial Engg & Management.
-
Computer Science: CSE, IT, Information Science.
-
Electrical: Electrical, EEE.
-
వయస్సు పరిమితి (as on 01-09-2025)
-
General/EWS: 28 ఏళ్ళ లోపు ఉండాలి.
-
OBC: 3 years రిలాక్సేషన్.
-
SC/ST: 5 years రిలాక్సేషన్.
-
PwBD: 10 years అదనంగా రిలాక్సేషన్.
జీతం (Salary Structure)
BEL Trainee Engineer కి జీతం ఇలా ఉంటుంది:
-
1st Year – ₹30,000 నెలకు
-
2nd Year – ₹35,000 నెలకు
-
3rd Year (extend అయితే) – ₹40,000 నెలకు
అదనంగా:
-
₹12,000 ప్రతీ సంవత్సరం (Medical, Attire, Footwear Allowance లకు)
-
Area Allowance – 10% extra, BEL యూనిట్ లేని ప్రదేశాల్లో పోస్ట్ అయితే
-
Project Engineer-I గా promote అయ్యి 4 years complete చేస్తే ₹1,00,000 Retention Bonus
సెలక్షన్ ప్రాసెస్
BEL లో Trainee Engineer సెలక్షన్ పూర్తిగా Written Test మీదే ఆధారపడుతుంది.
-
పరీక్ష Marks: 85
-
Duration: 90 నిమిషాలు
-
Sections: Technical + General Aptitude
-
Correct Answer: 1 మార్కు
-
Wrong Answer: -0.25 మార్కులు
Final selection discipline wise, category wise merit list ఆధారంగా జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు
-
General / OBC / EWS: ₹177 (₹150 + GST)
-
SC / ST / PwBD: ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు
-
Online Application Start Date: 24-09-2025
-
Last Date for Apply Online: 07-10-2025
-
Written Test (Electronics & Mechanical): 25-10-2025
-
Written Test (CS & Electrical): 26-10-2025
దరఖాస్తు చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్
-
కొత్త passport-size ఫోటో
-
Date of Birth proof (SSC/SSLC)
-
Degree Final లేదా Provisional Certificate
-
Caste/EWS/PwBD Certificate (అవసరం అయితే)
-
SBI Collect Fee Receipt
అప్లై చేసే విధానం (How to Apply)
-
ముందుగా BEL అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ చేయాలి.
-
Online Registration లో మీ Basic Details fill చేయాలి.
-
General/OBC/EWS అయితే SBI Collect ద్వారా ఫీజు పేమెంట్ చేయాలి.
-
Payment చేసిన తర్వాత వచ్చిన Reference Number అప్లికేషన్ లో ఎంటర్ చేయాలి.
-
అవసరమైన అన్ని Certificates scan చేసి upload చేయాలి.
-
Application submit చేసే ముందు ఒకసారి మొత్తం డీటైల్స్ verify చేసుకోవాలి.
-
Final Submit చేసిన తర్వాత ఎటువంటి corrections చేయలేరు, కాబట్టి జాగ్రత్తగా చెయ్యాలి.
ఈ జాబ్ ఎందుకు బెస్ట్ ఛాన్స్?
-
PSU company కావడం వల్ల job security బాగా ఉంటుంది.
-
Defence sector projects లో పనిచేసే అవకాశముంది.
-
Trainee Engineer గా మొదలై, performance బాగా ఉంటే Project Engineer role కి clear growth ఉంటుంది.
-
3 years వరకు మంచి జీతం + Allowances, తరువాత Project Engineer role లో ఇంకా bright future.
ముగింపు
BEL Trainee Engineer Recruitment 2025 అనేది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి మిస్ కాకూడని అవకాశం. 610 పోస్టులు అంటే చాలా పెద్ద scale లో వాకెన్సీలు అని చెప్పాలి. కాబట్టి eligible అయిన వారు ఆలస్యం చేయకుండా 7 అక్టోబర్ 2025 లోపు అప్లై చేసేయండి.
ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ లో BEL Recruitment 2025 కి సంబంధించిన మొత్తం వివరాలు ఇచ్చాను. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.