BEML Recruitment 2025 – రైల్వే శాఖలో 96 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్!
BEML Recruitment 2025 : ఉద్యోగం కోసం తపనపడుతున్న తెలుగువారి కోసం ఇది గోల్డెన్ ఛాన్స్ అనొచ్చు. భారత ప్రభుత్వ రైల్వే శాఖకి చెందిన పబ్లిక్ సెక్టార్ కంపెనీ – BEML (Bharat Earth Movers Limited) నుంచి తాజాగా 96 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. BE/B.Tech పూర్తి చేసిన వాళ్లకి ఇది అరుదైన అవకాశం.
BEML అంటే సాధారణంగా భూమి తవ్వే యంత్రాలు, రైలు డబ్బాలు, మిలటరీకి అవసరమైన హెవీ వెహికల్స్ తయారు చేసే కంపెనీ. ఇది కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ ఆధీనంలో నడుస్తుంది. అంటే, ఈ జాబ్స్ కచ్చితంగా రైల్వే PSU ఉద్యోగాలు అనొచ్చు. ఎవరికైనా స్టబుల్, సెక్యూర్, కేంద్ర ప్రభుత్వం జాబ్ కావాలంటే తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేయాలి.
పోస్టుల వివరాలు:
-
సంస్థ పేరు: Bharat Earth Movers Limited (BEML)
-
పోస్ట్ పేరు: Junior Executive
-
మొత్తం ఖాళీలు: 96
-
జీతం: నెలకి ₹35,000 నుంచి ₹43,000 వరకు
-
లొకేషన్లు:
-
కేరళ – పళక్కాడు
-
కర్ణాటక – కోలార్, మైసూరు, బెంగళూరు
-
తెలంగాణ – హైదరాబాద్
-
మహారాష్ట్ర – పుణె
-
ఢిల్లీ – న్యూఢిల్లీ
-
అర్హతలు (Eligibility):
అధ్యయన అర్హత (Educational Qualification):
అభ్యర్థి BE లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి ఏదైనా స్ట్రీమ్ లో చదివినా సరే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచే చదివి ఉండాలి.
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
వయస్సు పరిమితి (Age Limit):
-
గరిష్ఠంగా 29 ఏళ్లు మాత్రమే అనుమతిస్తారు.
-
ఎస్సీ/ఎస్టీ/ఒబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం (How to Apply):
ఈ జాబ్స్ కి Online ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఎవరైనా అర్హులైతే వెంటనే అప్లై చేయొచ్చు.
దరఖాస్తు ప్రారంభం తేదీ: 30 జూలై 2025
దరఖాస్తు చివరి తేదీ: 9 ఆగస్టు 2025
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
ఇంటర్వ్యూ లొకేషన్లు (Walk-in Interview Centres):
ఈ జాబ్స్ కి రాత పరీక్ష లేదు. Walk-in Interview ద్వారా నేరుగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు తగిన పత్రాలు తీసుకెళ్లి నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలి.
Palakkad – కేరళ
BEML Palakkad Complex, KINFRA Wise Park, Menon Para Road, Kanjikode East, Palakkad – 678621.
Kolar – కర్ణాటక
H&P Unit, BEML KGF Complex, BEML Nagar, Kolar Gold Fields – 563115.
మైసూరు, బెంగళూరు, హైదరాబాద్, పుణె, ఢిల్లీ
BEML Mysore Complex, Belavadi Post, Mysuru – 570018.
ఇంటర్వ్యూ తేదీలు:
11వ, 12వ ఆగస్టు 2025
అప్లై చేయాలనుకునేవాళ్లు ఇలా చేయాలి:
-
ముందుగా అధికారిక వెబ్‌సైట్ bemlindia.in కి వెళ్లాలి
-
అందులో Careers / Recruitment సెక్షన్ ఓపెన్ చేయాలి
-
Junior Executive Notification అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, పూర్తిగా చదవాలి
-
అర్హత ఉంటే, Apply Online లింక్ ద్వారా అప్లికేషన్ ఫారం నింపాలి
-
ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్స్ అటాచ్ చేయాలి
-
చివరగా, సబ్మిట్ చేసి అప్లికేషన్ నెంబర్/ఎక్స్‌నాలెడ్జ్‌మెంట్ నెంబర్ దాచుకోవాలి
ముఖ్యమైన తేదీలు (Important Dates):
కార్యాచరణ | తేదీ |
---|---|
ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ | 30-07-2025 |
అప్లికేషన్ చివరి తేదీ | 09-08-2025 |
ఇంటర్వ్యూ తేదీలు | 11, 12 ఆగస్టు 2025 |
ఈ జాబ్స్ ఎవరికి సూటవుతాయ్?
-
BE/B.Tech చదివిన వాళ్లకి, ఫ్రెషర్లు అయినా అప్లై చేయొచ్చు
-
హైదరాబాద్, బెంగళూరు, పుణె, మైసూరు లాంటి నగరాల్లో సెట్ అవ్వాలనుకునే వాళ్లకి మంచి ఛాన్స్
-
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకునే వాళ్లకి ఈ పోస్టులు పక్కా సెటప్పే
-
ఇంటర్వ్యూలో దమ్మున్న వాళ్లకి, రాత పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది
- Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
మన సూచనలు:
ఈ ఉద్యోగాలు పక్కా రైల్వే శాఖకి చెందినవే కనుక గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకునే వాళ్లు ఈ అవకాశాన్ని వదులుకోకండి. Walk-in ఇంటర్వ్యూకు కావల్సిన పత్రాలన్నీ సిద్ధం చేసుకోండి. Resume అప్‌డేట్ చేయండి. ముందుగా అప్లికేషన్ పెట్టి అప్లికేషన్ నెంబర్ తీసుకోండి. ఇంటర్వ్యూకు ముందు ఎటువంటి ప్రిపరేషన్ చేయాలో క్లీన్ ఐడియా ఉండాలి.