BOB LBO Recruitment 2025 : బ్యాంక్ ఉద్యోగం మీ ఊర్లోనే! బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 పోస్టులు విడుదల

BOB LBO Recruitment 2025 :

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో లొకల్ బ్రాంచ్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంక్ సేవలను మరింతగా విస్తరించేందుకు ఈ నియామకాన్ని చేపట్టారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం వంటి అన్ని ముఖ్య విషయాలను ఈ కథనంలో సులభంగా, తెలుగులో అందిస్తున్నాం. ఒకసారి పూర్తిగా చదవండి, మీకు కాకపోయినా అర్హత ఉన్నవారికి తప్పకుండా షేర్ చేయండి.

పోస్టుల వివరాలు

ఈ సారి బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 స్థానాలను భర్తీ చేయబోతోంది. ఇవి లొకల్ బ్రాంచ్ ఆఫీసర్ అనే పదవికి చెందాయి. ఉద్యోగ రకం రెగ్యులర్ మరియు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ ఉంటుంది. కానీ మీరు ఎక్కడ అప్లై చేస్తారో, అక్కడకు దగ్గరగానే పోస్టింగ్ ఇవ్వే అవకాశముంది.

అర్హతలు

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాదు, కనీసం ఒక సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. NBFCలు, ఫైనాన్షియల్ డిజిటల్ సంస్థల్లో పని చేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరగదు.

అదనంగా, దరఖాస్తుదారుడు ప్రాంతీయ భాషపై ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ఉదాహరణకు, మీరు ఆంధ్రప్రదేశ్‌లో అప్లై చేస్తే, తెలుగు భాషలో మాట్లాడడం, చదవడం, రాయడం రాకపోతే అవకాశం ఉండదు.

వయస్సు పరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwD వర్గాలకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

జీతం మరియు ఇతర లాభాలు

ఈ ఉద్యోగానికి బ్యాంక్ ఆఫ్ బరోడా జీత నియమావళి ప్రకారం జీతభత్యాలు ఉంటాయి. అభ్యర్థికి నెలకు సుమారుగా రూ.35,000 నుండి రూ.45,000 వరకు వేతనం లభించవచ్చు. దీని బాటగా ఇతర అలవెన్సులు, ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం

ఈ పోస్టులకు ఎగ్జామ్స్ ఉంటాయి. అభ్యర్థులను ముందుగా ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ప్రాంతీయ భాషా పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు దశలు పూర్తయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

పరీక్షలో రీజనింగ్, అంకగణితం, బ్యాంకింగ్ నాలెడ్జ్, ఇంగ్లీష్ భాష, సాధారణ జ్ఞానం వంటి విభాగాలపై ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటల (120 నిమిషాలు). ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్క్ ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు

ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరుగుతాయి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. అయితే చివరికి ఏ కేంద్రం కేటాయించాలన్నది బ్యాంక్ అధికారుల నిర్ణయం ఆధారంగా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

ఈ నోటిఫికేషన్ జూలై 4, 2025 న విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ అదే రోజున ప్రారంభమైంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూలై 24, 2025. ఆన్‌లైన్ పరీక్ష తేదీ త్వరలో వెల్లడించనున్నారు.

దరఖాస్తు ఫీజు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు సాధారణ, OBC మరియు EWS వర్గాల అభ్యర్థులకు రూ.850 ఫీజు.
SC, ST మరియు PwD అభ్యర్థులకు రూ.175 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజును ఆన్‌లైన్ ద్వారా – UPI, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.

దరఖాస్తు విధానం

బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ అయిన www.bankofbaroda.in ను ఓపెన్ చేయండి.

Careers సెక్షన్‌లోకి వెళ్లి LBO Recruitment 2025 లింక్‌ను ఎంచుకోండి.

మీ ఈమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయండి.

దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

ఫీజు చెల్లించాక ఫారం సమర్పించి ప్రింట్‌ అవుట్ తీసుకోండి.

Official Website 

Notification PDF

Apply link 

చివరి మాట

ఈ రకమైన నోటిఫికేషన్లు తరచుగా రావు. ఎగ్జామ్, ఇంటర్వ్యూతో ఎంపిక, మంచి జీతం, ఊరి దగ్గరే ఉద్యోగం – ఇవన్నీ కలసి బంగారుపల్లకిలో ఉద్యోగం ఎక్కినట్టే. మీరు అర్హత కలిగి ఉంటే తప్పక దరఖాస్తు చేయండి. మీకు అర్హత లేకపోయినా, అర్హత ఉన్నవారికి ఇది షేర్ చేయండి. వాళ్లకు ఇది జీవితాన్ని మలిచే అవకాశం కావచ్చు

Leave a Reply

You cannot copy content of this page