సీసీఆర్ఏఎస్ (CCRAS) జాబ్స్ 2025 – 394 పోస్టులు విడుదల | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) కు ఇది బంగారు అవకాశం
CCRAS MTS Jobs 2025 : ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ఆయుర్వేద శాస్త్ర పరిశోధన మండలి (CCRAS) తాజాగా ఓ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 394 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు 179 ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకి అర్హులైన అభ్యర్థులు CCRAS అధికారిక వెబ్సైట్ అయిన ccras.nic.in ద్వారా ఆగస్టు 31, 2025 లోగా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS)
మొత్తం ఖాళీలు: 394
ప్రాధాన్యత ఉన్న పోస్టు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 179 ఖాళీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 1, 2025
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 31, 2025
అధికారిక వెబ్సైట్: ccras.nic.in
పోస్టుల వివరాలు (మొత్తం 394):
పోస్టు పేరు ఖాళీలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) 179
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) 37
అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) 39
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 10
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 14
స్టాఫ్ నర్స్ 14
లైబ్రరీ క్లర్క్ 1
అసిస్టెంట్ 13
డ్రైవర్ 5
ఫార్మసిస్ట్ గ్రేడ్-1 12
రీసెర్చ్ అసిస్టెంట్ (బోటనీ, ఫార్మకోలజీ, కెమిస్ట్రీ మొదలైనవి) 15కి పైగా
రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద, పాథాలజీ) 21
మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ 15
జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 1
లాబ్ అటెండెంట్ 9
హిందీ ట్రాన్స్‌లేటర్ 2
ఇతర పోస్టులు కొన్ని
అర్హతలు:
ప్రతీ పోస్టుకు వేర్వేరు అర్హతలు ఉండొచ్చు. కొన్ని పోస్టులకు డిగ్రీ అవసరం అయితే, MTS, డ్రైవర్ లాంటి పోస్టులకు పదోతరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణత చాలవచ్చు. పూర్తిగా అర్హత వివరాలు త్వరలో అధికారిక నోటిఫికేషన్ ద్వారా విడుదల అవుతాయి.
వయసు పరిమితి:
ఇప్పటి వరకు వయో పరిమితి అధికారికంగా తెలియజేయలేదు. అయితే సాధారణంగా MTS పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 30 ఏళ్ల లోపల ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన వివరాలు త్వరలో వెబ్సైట్లో ప్రకటిస్తారు.
ఎంపిక విధానం:
ఎంపిక విధానం పోస్టును బట్టి మారవచ్చు. అయితే సాధారణంగా:
MTS పోస్టులకు రాత పరీక్ష + డాక్యుమెంట్ వెరిఫికేషన్
స్టెనోగ్రాఫర్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉండొచ్చు
డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందని అంచనా
ఇతర గ్రూప్ A & B పోస్టులకు ఇంటర్వ్యూ లేదా CBT ఉండొచ్చు
జీతభత్యాలు:
MTS వంటి పోస్టులకు ప్రారంభ జీతం రూ. 18,000 – 56,900 వరకు ఉంటుంది (లెవెల్-1).
UDC, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులకు రూ. 25,000 – 81,000 వరకు ఉంటుంది.
రీసెర్చ్ ఆఫీసర్ లాంటి గ్రూప్ A పోస్టులకు రూ. 56,100 – 1,77,500 వరకు ఉండొచ్చు.
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కాబట్టి DA, HRA, TA వంటి అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ccras.nic.in వెబ్‌సైట్‌కి వెళ్ళాలి
హోం పేజీలో Recruitments సెక్షన్‌కి వెళ్లాలి
మీకు కావాల్సిన పోస్టు ఎంచుకొని Apply Online బటన్‌పై క్లిక్ చేయాలి
మీ వివరాలు, విద్యార్హతలు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి
అవసరమైతే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
చివరగా ఫారమ్‌ను సమర్పించి ప్రింట్ తీసుకోవాలి
అప్లికేషన్ ఫీజు:
ప్రస్తుతం అప్లికేషన్ ఫీజు వివరాలు అధికారికంగా తెలియజేయలేదు. సాధారణంగా:
SC/ST/PwBD అభ్యర్థులకు మినహాయింపు ఉండొచ్చు
ఇతరులకు రూ. 100 – 500 వరకు ఉండే అవకాశం ఉంది
ఎందుకు ఈ MTS పోస్టులు బెస్ట్ అంటావా?
సింపుల్ అర్హతలు – పదో తరగతి చాలు
Central Govt pay scale – బాగుంటుంది
పర్మనెంట్ జాబ్, పింఛన్, హెల్త్ కార్డ్స్
ఎగ్జామ్ తక్కువ లెవెల్లో ఉంటుంది – ఎక్కువ పోటీ ఉండకపోవచ్చు
Work-Life balance – బయట వర్క్ ఉండదు, జాబ్ సెటిల్డ్ ఉంటుంది
కొన్ని సాధారణ ప్రశ్నలు:
ప్ర: సిలబస్ ఏముంటుంది?
జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లిష్, రీజనింగ్ తరహాలో ఉండొచ్చు. పూర్తి వివరాలు త్వరలో అధికారిక నోటిఫికేషన్లో వస్తాయి.
ప్ర: టైపింగ్ టెస్ట్ ఎవరికైనా ఉందా?
LDC మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
ప్ర: స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంతో పోలిస్తే ఇది ఎలా ఉంటుంది?
కేంద్ర ఉద్యోగం కాబట్టి జీతం, భద్రత, భవిష్యత్తు అన్ని మెరుగ్గా ఉంటాయి.
చివరిగా…
ఈ CCRAS రిక్రూట్మెంట్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం 394 పోస్టులు. అందులో మనలాంటి విద్యార్హతలు ఉన్నవాళ్లకి తగ్గ 100కి పైగా మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా MTS పోస్టులు – పదోతరగతి విద్యార్థులకు పర్ఫెక్ట్.
ఇంతవరకు అప్లై చేయని వాళ్లు కూడా సెప్టెంబరు 1కి ముందు అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ లింక్, అన్ని వెబ్సైట్లో వస్తాయి