భారత తీరరక్షణ దళం అసిస్టెంట్ కమాండెంట్ 2027 బ్యాచ్ నోటిఫికేషన్ – పూర్తి వివరాలు తెలుగులో
Coast Guard AC 2025 Jobs Notification : ఒక్కసారి ఈ ఉద్యోగం వచ్చిందంటే.. గవర్నమెంట్ లైఫ్ సెట్ అన్నమాట! భారత తీరరక్షణ దళం (Indian Coast Guard) లో అసిస్టెంట్ కమాండెంట్ (Assistant Commandant) పోస్టుల భర్తీకి 2027 బ్యాచ్ నోటిఫికేషన్ వచ్చేసింది. Group ‘A’ Gazetted Officer స్థాయి లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. దేశ సేవ తో పాటు జీతం, పర్మనెన్సీ, పెన్షన్ అన్నీ కలిపి ఈ జాబ్ చాలా గొప్ప అవకాశం.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 08 జూలై 2025 సాయంత్రం 4 గంటల నుండి
చివరి తేదీ: 23 జూలై 2025 రాత్రి 11:30 వరకు
మొత్తం ఖాళీలు: 170 పోస్టులు
General Duty (GD): 140 పోస్టులు
Technical (Engineering / Electrical / Electronics): 30 పోస్టులు
అర్హతలు:
1. జనరల్ డ్యూటీ (GD)
లింగం: పురుషులు మాత్రమే
వయస్సు: 21 నుంచి 25 సంవత్సరాల మధ్య (01 జూలై 2001 నుండి 30 జూన్ 2005 మధ్య పుట్టినవాళ్లు)
విద్యార్హత: కనీసం గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. ఇంటర్మీడియట్ (10+2) లో మాథమేటిక్స్ & ఫిజిక్స్ ఉండాలి. డిప్లొమాతో గ్రాడ్యుయేషన్ చేసినవాళ్లు కూడా అర్హులు.
2. టెక్నికల్ (Mechanical/Electrical/Electronics)
లింగం: పురుషులు మాత్రమే
వయస్సు: GDకి సమానమే
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి.
మెకానికల్, మెరైన్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్, టెలికమ్యూనికేషన్ తదితర బ్రాంచులు.
ఇంటర్ లో మాథ్ & ఫిజిక్స్ తప్పనిసరి.
ఎగ్జామినేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, EWS: రూ.300/-
SC / ST అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం:
ఎంపిక మొత్తం ఐదు దశల్లో ఉంటుంది:
స్టేజ్-1: CGCAT (Common Admission Test)
ఆన్‌లైన్ పరీక్ష
మొత్తం 100 మార్కులు – 4 సెక్షన్లు:
ఇంగ్లీష్ (25)
రీజనింగ్ & న్యూమెరికల్ అబిలిటీ (25)
సైన్స్ & మ్యాథ్స్ (25)
జనరల్ నాలెడ్జ్ (25)
ప్రతి సరైన ఉత్తరానికి 4 మార్కులు, తప్పుకు -1 మార్క్
స్టేజ్-2: ప్రిలిమినరీ సెలెక్షన్ బోర్డ్ (PSB)
కంప్యూటరైజ్డ్ టెస్ట్ + Picture Perception & Discussion Test
ఇది కేవలం క్వాలిఫైయింగ్ – మార్కులు లెక్కించరు
స్టేజ్-3: Final Selection Board (FSB)
4-5 రోజులు నోయిడా లో జరిగే ఇంటర్వ్యూలు
సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు
స్టేజ్-4: మెడికల్ పరీక్ష
డిల్లీలోని మిలటరీ హాస్పిటల్ లో పూర్తిగా ఆరోగ్య పరీక్ష
అర్హతల లోపం ఉన్నవారికి రివ్యూ మెడికల్ అవకాశం ఉంటుంది
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
స్టేజ్-5: ట్రైనింగ్ & ఇండక్షన్
ఇండియా నేవల్ అకాడమీ (INA), ఎజిమలాలో శిక్షణ ప్రారంభం
ట్రైనింగ్ తేదీ: జనవరి 2027
మెడికల్ అర్హతలు:
ఎత్తు: కనీసం 157 సెంటీమీటర్లు
బరువు: ఎత్తు, వయస్సు కి అనుగుణంగా
చూపు:
GD: 6/6 – 6/9 uncorrected, 6/6 corrected
Tech: 6/36 uncorrected, 6/6 corrected
టాటూలకు పరిమితులు ఉన్నాయి (చేతి లోపల భాగంలో మాత్రమే)
జీతం & ప్రమోషన్లు:
అసిస్టెంట్ కమాండెంట్: ₹56,100
ఉప కమాండెంట్: ₹67,700
కమాండెంట్ (జూనియర్ గ్రేడ్): ₹78,800
కమాండెంట్: ₹1,23,100
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్: ₹1,31,100
ఇన్స్పెక్టర్ జనరల్: ₹1,44,200
అదనపు డైరెక్టర్ జనరల్: ₹1,82,200
డైరెక్టర్ జనరల్: ₹2,05,400
ఇతర లాభాలు:
కుటుంబానికి మెడికల్ సదుపాయం
ప్రభుత్వ హౌస్ లేదా HRA
LTC, గ్రాట్యూటీ, పెన్షన్ స్కీమ్‌లు
45 రోజులు ఇర్న్ లీవ్, 8 రోజులు కాజువల్ లీవ్
గ్రూప్ ఇన్సూరెన్స్ – ₹1.25 కోట్లు
కాంటీన్, బ్యాంకు లోన్, రేషన్ సదుపాయాలు
అప్లై చేయడమెలా?
అధికారిక వెబ్‌సైట్: joinindiancoastguard.cdac.in లోకి వెళ్ళండి
రిజిస్ట్రేషన్: మొబైల్ నెంబర్, ఇమెయిల్ ద్వారా
అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి
ఫీజు పేమెంట్ ఆన్‌లైన్ లోనే చేయాలి (UPI, Card, Net Banking)
అప్లికేషన్ లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు:
ఫోటో, సిగ్నేచర్, పుట్టిన తేది ప్రూఫ్
Aadhaar/ PAN/ Voter ID
విద్యార్హత సర్టిఫికెట్లు
సర్వీస్ సర్టిఫికెట్ (ఉద్యోగస్తులకి)
కేటగిరీ సర్టిఫికెట్ (SC/ST/OBC/EWS)
శిక్షణ వివరాలు:
GD క్యాడర్: 44 వారాల శిక్షణ
టెక్నికల్ క్యాడర్: 22 వారాల శిక్షణ
నేవీ & కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ అకాడమీల్లో శిక్షణ
మెరిట్ లిస్ట్:
స్టేజ్-1 (CGCAT) & స్టేజ్-3 (FSB) మార్కుల ఆధారంగా
డిసెంబర్ 2026లో ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వెబ్‌సైట్ లో వస్తుంది
ఎవరెవరు అప్లై చేయకూడదు?
డిసిప్లినరీ కారణాల వలన ఇతర శిక్షణ కేంద్రాల నుండి తొలగించబడినవాళ్లు
క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లు
ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినవాళ్లు
చివరిగా…
ఈ జాబ్ అంటే సాధారణంగా చదువుతో పాటు శారీరకంగా, మానసికంగా సన్నద్ధంగా ఉండాలి. ఇది కేవలం ఉద్యోగం కాదు – దేశసేవకి తీసుకునే అద్భుతమైన అవకాశం. Coast Guard లో ఈ స్థాయి పోస్టులు అరుదుగా వస్తాయి. కాబట్టి అర్హులైతే తప్పకుండా అప్లై చేయండి.
చివరి తేదీ: 23 జూలై 2025 రాత్రి 11:30 గంటల లోగా