Concentrix Work From Home Business Analyst ఉద్యోగాలు – IT ఫీల్డ్ లో ఇంటి నుంచి పనిచేసే మంచి అవకాశం

Concentrix Work From Home Business Analyst ఉద్యోగాలు – IT ఫీల్డ్ లో ఇంటి నుంచి పనిచేసే మంచి అవకాశం

ఈ రోజుల్లో IT ఫీల్డ్ అంటేనే ఓ కలల ఉద్యోగం అయిపోయింది. అందులోనూ ఇంటి నుంచే పనులు చేసే అవకాశం వస్తే అదృష్టమే అని చెప్పాలి. అలాంటి గోల్డెన్ ఛాన్స్‌నే ఇప్పుడు Concentrix అనే అంతర్జాతీయ కంపెనీ అందిస్తోంది. ఇది ఒక బహుళజాతి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ కంపెనీ Business Analyst – Work From Home పోస్టుకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పనితీరు కూడా అంత సీరియస్ గానీ లేదు, కానీ చక్కగా డిజిటల్ ప్రాజెక్టులపై పని చేయాలి.

ఇది సాధారణ ఉద్యోగం కాదు, టెక్నికల్ ప్రొఫైల్ అయినా కూడా డెవలపర్ లాగా కోడింగ్, టెక్నికల్ టూల్స్ వాడాలన్న బాధ లేదు. కేవలం కస్టమర్, డెవలపర్, టెస్టింగ్ టీమ్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ బ్రిడ్జ్ చేసే ఇంపార్టెంట్ ఉద్యోగం.

Concentrix కంపెనీ గురించి ఓసారి చూద్దాం

Concentrix అనేది ఒక గ్లోబల్ టెక్నాలజీ అండ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ కంపెనీ. ప్రపంచంలోని చాలా పెద్ద పెద్ద బ్రాండ్లకు సేవలు అందించే సంస్థ ఇది. మార్కెట్‌లో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇవాళ్టి ట్రెండ్ ప్రకారం డేటా, డిజిటల్ టెక్నాలజీ, మానవ నైపుణ్యాలు కలిపి సరికొత్త మార్గాలు చూపడమే వీరి టార్గెట్.

ఈ కంపెనీలో పని చేయడం అంటే కార్పొరేట్ రంగంలో సాఫ్ట్ స్కిల్స్, అనాలిటికల్ స్కిల్స్ పెంచుకోవడమే కాకుండా, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ మీద పని చేసే ఛాన్స్ కూడా దొరకడం.

Mentor Match ట్యూటర్ ఉద్యోగాలు 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ లో పార్ట్ టైమ్ & ఫుల్ టైమ్ Jobs | నెలకు ₹50,000 వరకు జీతం

ఉద్యోగ విశేషాలు – Business Analyst

ఈ ఉద్యోగం పేరు Business Analyst. ఇందులో మీరు నేరుగా ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ లో ఉండే టీమ్‌తో కాకుండా, క్లయింట్‌తో మాట్లాడే, requirements తీసుకునే, ఆ డాక్యుమెంట్ తయారుచేసే కీలక పాత్ర పోషించాలి.

ఇది ఒక టెక్నికల్ జాబ్ కాబట్టి మీ దృష్టిలో ఉండాల్సిన పనులు:
కొత్త ప్రాజెక్టుల కోసం క్లయింట్ నుంచి requirements తీసుకోవడం

ఆ requirements ఆధారంగా FSD (Functional Specification Document) తయారుచేసి క్లయింట్‌తో డిస్కస్ చేయడం

క్లయింట్ అడిగే ప్రశ్నలకు క్లియర్ గా సమాధానం ఇవ్వడం

FSD పై క్లయింట్ నుండి sign-off తీసుకోవడం

డెవలపర్, టెస్టర్‌లకి ఆ డాక్యుమెంట్ వివరించడం

టెస్టింగ్ పూర్తయ్యాక క్లయింట్‌కి UAT (User Acceptance Testing) లో డెమో ఇవ్వడం

క్లయింట్ UAT లో రిపోర్ట్ చేసిన ఇష్యూస్ ని లోపల టీమ్ కి తెలపడం

క్లయింట్ కి ప్రతి రోజు కాల్ లో ప్రాజెక్ట్ స్టేటస్ చెప్పడం

ముందుగా ఉన్న ప్రాజెక్టులు లేదా మొబైల్ యాప్స్ పని తీరును క్లయింట్ కి వివరించడం

ఇవి అన్నీ చూస్తే పక్కాగా ప్లానింగ్ చేయగలిగే వాళ్లు, English మాట్లాడగలిగే వాళ్లు అయితే చాలా కంఫర్ట్ గా చేసే జాబ్ ఇది.

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు

పని చేసే ప్రదేశం

ఈ ఉద్యోగం పూర్తిగా Work From Home. ఎక్కడైనా ఇండియాలో ఉంటే చాలు. మీరు ఇల్లు, కాలేజ్, లేదా ఏదైనా నగరంలో వుంటూ కూడా ఈ ఉద్యోగం చెయ్యవచ్చు. కొన్ని సందర్భాల్లో కనుక క్లయింట్ onsite కావాలంటే 1-2 రోజులు ట్రావెల్ ఉండొచ్చు, కానీ అది ఎక్కువగా ఉండదు.

Concentrix Work From Home Business Analyst అర్హతలు

ఇప్పుడు ఉద్యోగం apply చేయాలంటే ఏ అర్హతలు అవసరమో చూద్దాం:

మీరు కనీసం డిగ్రీ/ఇంజనీరింగ్ చేసి ఉండాలి. B.Sc, B.Com, B.Tech, BCA వంటివి కూడా ఒకే.

English లో మాట్లాడగలిగే నైపుణ్యం తప్పనిసరి

Microsoft Word, Excel, Teams వంటివి ఉపయోగించగలిగే పరిజ్ఞానం ఉండాలి

FSD వంటి డాక్యుమెంట్లు రాయగలిగే కంపోజిషన్ స్కిల్ ఉండాలి

టెక్నికల్ జ్ఞానం ఉండకపోయినా, ప్రాజెక్ట్ స్ట్రక్చర్, క్లయింట్ expectation, టైమ్ మేనేజ్మెంట్ ఇవి బాగా అర్థం చేసుకోగలవాళ్లు అయితే చాలు

జీతం వివరాలు

ఈ ఉద్యోగానికి మంచి జీతం వస్తుంది. సాధారణంగా Business Analyst గా జాయిన్ అవ్వగానే నెలకు ₹30,000 – ₹50,000 వరకు సాలరీ వస్తుంది. అనుభవం ఉంటే ఇంకా ఎక్కువ పొందవచ్చు. మీరు క్లయింట్ హ్యాండిల్ చేయడంలో మైండ్ అప్లై చేస్తే, సంవత్సరానికి కనీసం ₹6 లక్షల జీతం పొందవచ్చు.

కంపెనీ performance ఆధారంగా bonus కూడా ఉంటుంది. పైగా Work From Home కావడం వల్ల ట్రావెల్ ఖర్చులు ఉండవు. దీంతో నెట్ సెవింగ్ చాలా పెరుగుతుంది.

Concentrix Work From Home Business Analyst ఎంపిక విధానం

ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం చాలా క్లియర్ గా ఉంటుంది:

Resume Shortlisting: ముందుగా మీ రెజ్యూమ్ చూసి అర్హత కలిగిన వాళ్లని షార్ట్ లిస్ట్ చేస్తారు

HR Interview: మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లెక్సిబిలిటీ, ఇంట్రెస్ట్ ను చూసి HR ఇంటర్వ్యూ తీసుకుంటారు

Managerial Round: ఇది అసలు మెయిన్ రౌండ్. ఇక్కడ మీ అనాలిటికల్ స్కిల్స్, క్లయింట్‌కి ఎలా మాట్లాడతారు, ఆలోచన ఎలా ఉంటుంది అన్నది చూస్తారు

Final Offer Letter: మీరు అన్ని రౌండ్స్ పాస్ అయితే ఫైనల్ గా Offer Letter ఇస్తారు

పూర్తి ప్రాసెస్ ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్లాల్సిన పని లేదు.

Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్

ఎలా అప్లై చేయాలి?

మీకు ఈ ఉద్యోగం నచ్చితే, నేరుగా Concentrix Careers వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి. లేదా నీవు నమ్మే ప్రొఫెషనల్ జాబ్ పోర్టల్స్ (like Naukri, Indeed, LinkedIn) ద్వారా కూడా అప్లై చేయవచ్చు.

అప్లై చేసే ముందు:

మీ రెజ్యూమ్ అప్‌డేట్ చేయాలి

మీరు చేసిన ప్రాజెక్టులు, previous job experience ఉంటే చక్కగా వివరించాలి

కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఒక చిన్న intro attach చేయాలి

Notification 

Apply Online 

ఇది ఎవరికీ కరెక్ట్ జాబ్?

ఈ జాబ్ ప్రత్యేకంగా ఈ క్రింది వారికి బాగా సెట్ అవుతుంది:

ఇంటి నుంచే పని చేయాలనుకునే మహిళలు

Software కోర్సులు పూర్తిచేసి ప్రాక్టికల్ knowledge ఉన్నవాళ్లు

మల్టీ టాస్కింగ్ చేయగలిగే వాళ్లు

Customer-facing jobs చేయాలనుకునే వాళ్లు

Career ని Project Management వైపు తీసుకెళ్లాలనుకునే వాళ్లు

DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!

చివరిగా చెప్పాల్సిందంటే…

ప్రస్తుతం Work From Home Jobs అంటే చాలామందికి కావలసిన అవకాశమే. కానీ చాలా తక్కువ కంపెనీలే మాన్యువల్ వర్క్ కాకుండా Professional WFH Jobs ఇస్తున్నాయి. అలాంటివాటిలో Concentrix Business Analyst జాబ్ ఒక గోల్డ్ లెవల్ అవకాశంగా చెప్పాలి. మీలో అంతటా కమ్యూనికేషన్, డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉంటే… Technical Language ని అర్థం చేసుకోగలిగే Interest ఉంటే… ఈ ఉద్యోగానికి మీరే Perfect Match.

మరి ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇదొక Step మారుతే, రేపటి రోజుల్లో మీరు Project Manager స్థాయికి ఎదిగే దారి కూడా ఇది అవుతుంది.

 

Leave a Reply

You cannot copy content of this page