CWC రిక్రూట్మెంట్ 2025
హలో ఫ్రెండ్స్ !
జాబ్ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్నారా?
CWC నుంచి ఒక మంచి అవకాశం వచ్చేసింది
వేర్‌హౌసింగ్, మార్కెటింగ్, సివిల్ ఇంజనీరింగ్, లేదా MIS లో ఆసక్తి ఉంటే గనక, ఇప్పుడే అప్లై చేయండి.
మరి ఫుల్ డీటైల్స్ చూద్దామా వచ్చేయండి మరి.
CWC అంటే ఏంటి
CWC అంటే సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్.
ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కింద ఉన్న ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ
అగ్రికల్చరల్ గూడ్స్, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ కోసం సైంటిఫిక్ స్టోరేజ్, కంటైనర్ ఫ్రెయిట్ స్టేషన్స్, ఇన్‌ల్యాండ్ డిపోలు, ఎయిర్ కార్గో కాంప్లెక్సెస్ మొదలైన వాటిని ఈ సంస్థ నడుపుతుంది
ఇండియా మొత్తం లో లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో ఒక గట్టి పేరు సంపాదించిన వాటిలో ఇది కూడా ఒకటి.
జాబ్ వివరాలు
సంస్థ పేరు – సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్
నోటిఫికేషన్ నం – CWC/I-Engagement/Young Professional/2025/01
నోటిఫికేషన్ తేదీ – 18 జూన్ 2025
ఖాళీలు – 6
జాబ్ విధానం – కాంట్రాక్ట్ మీద రెండు సంవత్సరాలు అలాగే ఒక సంవత్సరం పొడిగించవచ్చు
అప్లై చేసే విధానం – ఆన్లైన్
ఆధికారిక వెబ్‌సైట్ – www.cewacor.nic.in
పోస్టులు
పోస్టు పేరు | ఖాళీలు | పని చేసే స్థలం |
---|---|---|
యంగ్ ప్రొఫెషనల్ (ఎంఐఎస్) | 1 | కార్పొరేట్ ఆఫీస్, న్యూ ఢిల్లీ |
యంగ్ ప్రొఫెషనల్ (మార్కెటింగ్ & బిజినెస్ డెవలప్మెంట్) | 1 | రీజినల్ ఆఫీస్, రాయపూర్ |
యంగ్ ప్రొఫెషనల్ (సివిల్/ఎగ్జిక్యూషన్) | 1 | కార్పొరేట్ ఆఫీస్, న్యూ ఢిల్లీ |
యంగ్ ప్రొఫెషనల్ (సివిల్/ఎగ్జిక్యూషన్) | 1 | రీజినల్ ఆఫీస్, రాయపూర్ |
యంగ్ ప్రొఫెషనల్ (సివిల్/ఎగ్జిక్యూషన్) | 1 | రీజినల్ ఆఫీస్, పంచకుల |
యంగ్ ప్రొఫెషనల్ (సివిల్/ఎగ్జిక్యూషన్) | 1 | రీజినల్ ఆఫీస్, భువనేశ్వర్ |
క్వాలిఫికేషన్ వివరాలు
యంగ్ ప్రొఫెషనల్ MIS
B.E లేదా B.Tech CS లేదా IT లేదా MCA ఉండాలి.
పవర్ బిఐ , పైథాన్, ఎస్క్యూఎల్ లో అనుభవం ఉంటే మంచిది.
బిజినెస్ మరియు డేటా ఎనలిసిస్ సర్టిఫికేషన్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్
మార్కెటింగ్ లేదా లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్ లో PG డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి.
వేర్‌హౌసింగ్ లేదా లాజిస్టిక్స్ లో 0 నుండి 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉండాలి.
సివిల్
సివిల్ ఇంజినీరింగ్ లో ఫుల్ టైం డిగ్రీ ఉండాలి
కనీసం 3 సంవత్సరాల కన్స్ట్రక్షన్ అనుభవం ఉండాలి
వయసు పరిమితి
గరిష్ట వయసు 35 సంవత్సరాలు.
రిజర్వేషన్ ఉన్నవారికి CWC నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది
జీతం వివరాలు
యంగ్ ప్రొఫెషనల్ MIS – 50,000/- రూపాయలు
మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ – మూడు సంవత్సరాల లోపే అయితే 50,000 రూపాయలు, అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే 60,000 రూపాయలు
సివిల్ – 60,000 రూపాయలు
సెలక్షన్ విధానం
- అర్హత ఉన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు
- షార్ట్‌లిస్ట్ అయినవారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు
- ఇంటర్వ్యూకి హాజరైన తర్వాత పర్సనల్ ఇంటరాక్షన్ జరుగుతుంది
- దాని ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది
అప్లై విధానం
- www.cewacor.nic.in వెబ్‌సైట్ లోకి వెళ్ళండి
- రిక్రూట్మెంట్ సెక్షన్ లో CWC యంగ్ ప్రొఫెషనల్స్ లింక్ క్లిక్ చేయండి
- ఆన్లైన్ ఫారమ్ నింపండి
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
- సబ్మిట్ చేయండి
- లాస్ట్ డేట్ ముందు సబ్మిట్ చేయడం మర్చిపోవద్దు
- జాగ్రత్త కోసం ఫారమ్ ను ప్రింట్ తీసుకుని పెట్టుకోవచ్చు
ఫీజు వివరాలు
నోటిఫికేషన్ లో ఎలాంటి ఫీజు వివరాలు ఇవ్వలేదు
అందువల్ల అప్లై చేయడానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు
అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు
- ఫైనల్ డిగ్రీ లేదా ప్రొవిజినల్ సర్టిఫికేట్
- మార్క్‌షీట్లు
- వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రూఫ్ – డ్యూరేషన్ మరియు పే స్లిప్ లేదా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్
- రెగ్యులర్ కోర్సు ప్రూఫ్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు సిగ్నేచర్
ఈ డాక్యుమెంట్లు మర్చిపోకండి
ముఖ్యమైన తేదీలు
ఆరంభ తేదీ – 18 జూన్ 2025 మిడ్నైట్ నుంచి
చివరి తేదీ – 01 జూలై 2025 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు
కొన్ని ప్రశ్నలు
ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేయచ్చా?
అవును కానీ ప్రతి పోస్టుకు వేరే ఫారమ్ నింపాలి
ఇంటర్వ్యూకి వస్తే ట్రావెల్ అలవెన్స్ ఇస్తారా?
ఇవ్వరు TA లేదా DA అందించరు
చివరగా…
CWC లో పని చేయడం అంటే దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగంలో మన వంతుగా కృషి చేయడం
మంచి జీతం, మంచి పేరు ఉన్న ఈ ఉద్యోగం మీ భవిష్యత్తుకు ఒక మెరుగైన అడుగు అవుతుంది
మీ అర్హతలు సరిపోతే ఆలస్యం చేయకుండా అప్లై చేయండి.
ఇట్లు మీ
తెలుగు కెరీర్స్
మరింత సమాచారం కోసం www.telugucareers.com ని తప్పకుండా ఫాలో అవ్వండి.