హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫ్రెషర్స్ హైరింగ్ 2025 – ప్రాసెస్ అసోసియేట్ పోస్టుకు అప్లై చేయండి
HCL Process Associate Jobs 2025 : ఇండియాలోని ప్రముఖ ఐటీ, బిజినెస్ సర్వీస్ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025కి సంబంధించి ప్రాసెస్ అసోసియేట్ పోస్టుకు ఫ్రెషర్స్‌ను నియమించేందుకు ఇది మంచి అవకాశం. ఎలాంటి స్ట్రీమ్‌లో డిగ్రీ పూర్తి చేసినవారు అయినా ఈ ఉద్యోగానికి అర్హులు. ఐటీ రంగంలో, లేదా బీపీఓ సెగ్మెంట్‌లో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది బంగారు అవకాశం.
కంపెనీ గురించి
హెచ్సీఎల్ టెక్నాలజీస్ అనేది 225,000 మందికిపైగా ఉద్యోగులు కలిగిన గ్లోబల్ కంపెనీ. 60 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతుంది. ఐటీ, డిజిటల్, క్లౌడ్, ఇంజినీరింగ్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ వంటి విభాగాల్లో హెచ్సీఎల్ సేవలు అందిస్తోంది. ఫ్రెషర్స్ హైరింగ్‌కి వస్తుండటంతో, కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి మంచి స్టార్ట్.
ముఖ్యమైన వివరాలు:
- పోస్టు పేరు: ప్రాసెస్ అసోసియేట్
- అనుభవం: 0 – 1 సంవత్సరం (ఫ్రెషర్స్ అర్హులు)
- వేతనం: రూ.3 లక్షలు – రూ.4 లక్షల మధ్య (ప్రాజెక్ట్ ఆధారంగా మారవచ్చు)
- లొకేషన్: పాన్ ఇండియా (దేశవ్యాప్తంగా)
- అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీటెక్ వంటివి)
- కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ రిక్రూట్మెంట్ 2025 : అర్హత, ఎంపిక విధానం పూర్తి వివరాలు
అర్హత మరియు అవసరమైన స్కిల్స్:
- బేసిక్ ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- MS Office (ఎక్సెల్, వర్డ్) గురించి ప్రాథమిక అవగాహన
- రోటేషనల్ షిఫ్ట్స్‌లో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి
- రిపిటిటివ్ పనుల్లోనూ కచ్చితత్వంతో పనిచేయగలగాలి
ముఖ్య బాధ్యతలు:
- కస్టమర్ సర్వీస్, బ్యాక్‌ఎండ్ ఆపరేషన్స్ నిర్వహించడం
- డేటా ఎంట్రీ, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్
- ప్రాజెక్ట్ టీమ్‌తో కలిసిన డెలివరీ పనులలో పాలుపంచుకోవడం
- క్లయింట్ మెయిల్స్/చాట్స్‌కు స్పందించడం
- ప్రాసెస్ డాక్యుమెంటేషన్, రిపోర్ట్స్ రెడీ చేయడం
ఈ రోల్ హెల్త్‌కేర్, టెలికాం, బ్యాంకింగ్, ఇన్ష్యూరెన్స్ వంటి విభాగాల ప్రాజెక్ట్స్‌తో సంబంధముండవచ్చు.
Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్
ఇంటర్వ్యూలో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి?
- ఆన్లైన్ అప్లికేషన్ స్క్రీనింగ్: మీ రెజ్యూమ్, అప్లికేషన్ ఫామ్‌ను హెచ్సీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలి
- హెచ్‌ఆర్ స్క్రీనింగ్: మీ బ్యాక్‌గ్రౌండ్, షిఫ్ట్స్‌పై రెడీనెస్ గురించి సాధారణ ప్రశ్నలు
- అప్టిట్యూడ్/కమ్యూనికేషన్ టెస్ట్: కొన్ని ప్రాజెక్టుల కోసం ఈ టెస్ట్ అవసరం
- టెక్నికల్/ఆపరేషన్స్ రౌండ్: సిట్యుయేషనల్ క్వశ్చన్స్, ప్రాసెస్ అర్ధం అయ్యిందా అని చూస్తారు
- ఫైనల్ హెచ్‌ఆర్ రౌండ్: జాయినింగ్ డేట్, వేతనం, లొకేషన్ పై చర్చ
HCL Process Associate Jobs 2025 అప్లై చేసే విధానం:
- హెచ్సీఎల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి
- “Process Associate – Freshers” అని సెర్చ్ చేయాలి
- ఆన్‌లైన్ ఫామ్ ఫిల్ చేసి రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాలి
- HR నుంచి కాల్స్/మెయిల్స్ వస్తాయని మనసులో పెట్టుకోండి
- లేదా నౌకరి, లింక్డ్ఇన్ వంటి ట్రస్టెడ్ పోర్టల్స్ ద్వారానూ అప్లై చేయవచ్చు
ఉద్యోగం ద్వారా వచ్చే ప్రయోజనాలు:
- శిక్షణ మరియు ఆన్బోర్డింగ్ ప్రోగ్రామ్స్
- వర్క్ లైఫ్ బ్యాలెన్స్
- వృత్తి అభివృద్ధికి అవకాశాలు (12-18 నెలల తర్వాత ప్రమోషన్ ఛాన్సులు)
- మెడికల్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ వంటివి (లొకేషన్ ఆధారంగా)
- జాబ్ సెక్యూరిటీ మరియు మంచి వర్క్ కల్చర్
ముఖ్య గమనిక:
ఈ సమాచారం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్లై చేయడం మాత్రమే సురక్షితం. సెలెక్షన్ ప్రాసెస్, వేతనం వంటివి ప్రాజెక్ట్ అవసరాల ఆధారంగా మారవచ్చు.
DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!
ఎందుకు అప్లై చేయాలి?
- మంచి బ్రాండ్, గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్న కంపెనీ
- ఫ్రెషర్స్‌కి సరళమైన హైరింగ్ ప్రాసెస్
- ఏ స్ట్రీమ్ వాల్లైనా అప్లై చేసుకునే అవకాశం
- ఐటీ, బీపీఓ రంగాల్లో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి శుభావకాశం
- నెలకు 25,000 – 33,000 వరకు జీతం ఉండే అవకాశం
ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా పేజీని ఫాలో అవ్వండి. HCL లాంటి స్టేబుల్ కంపెనీలో, ట్రైనింగ్ తో కూడిన ఫ్రెషర్స్ ఉద్యోగం దొరకడం చాలా మంచిదని చెప్పాలి. సమయాన్ని వదలకుండా వెంటనే అప్లై చేయండి!