IFSCA అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2025 – పూర్తి వివరాలు
IFSCA Assistant Manager Recruitment 2025 : మన తెలుగు రాష్ట్రాల యువతకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) నుంచి కొత్తగా అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ – A) పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 20 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. ఈ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ లెవల్‌లో ఉండటంతో, జీతం కూడా బాగా ఉంటుంది, భవిష్యత్తులో మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి డీటైల్స్ ఒక్కొక్కటిగా చూద్దాం.
ఖాళీలు ఎన్ని ఉన్నాయి?
IFSCA ఈసారి మొత్తం 20 పోస్టులు విడుదల చేసింది. వాటిని కేటగిరీ వారీగా చూస్తే:
-
జనరల్ కేటగిరీ: 12 పోస్టులు
-
లీగల్ (Law): 04 పోస్టులు
-
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT): 04 పోస్టులు
అంటే లా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లకైనా, IT వైపు చదివిన వాళ్లకైనా, జనరల్ ఫైనాన్స్/కామర్స్/ఇకనామిక్స్ చదివిన వాళ్లకైనా ఇది మంచి ఛాన్స్.
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
అర్హతలు ఎలా ఉండాలి?
జనరల్ కేటగిరీకి:
-
మాస్టర్స్ డిగ్రీ – స్టాటిస్టిక్స్, ఇకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (Finance), ఎకానోమెట్రిక్స్
లేదా -
ప్రొఫెషనల్ డిగ్రీ – CA, CFA, CS, ICWA
లేదా -
IT/కంప్యూటర్ సైన్స్/ MCA/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ
లేదా -
లా లో బ్యాచిలర్ డిగ్రీ
లీగల్ పోస్టులకి:
-
లా లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి
IT పోస్టులకి:
-
బ్యాచిలర్ డిగ్రీ IT / కంప్యూటర్ సైన్స్ / MCA / IT
వయస్సు పరిమితి
-
కనీసం 21 ఏళ్లు ఉండాలి
-
గరిష్టంగా 30 ఏళ్లు మించరాదు (25.09.2025 నాటికి)
-
అంటే 26.09.1995 తర్వాత పుట్టిన వాళ్లు, 25.09.2004 లోపు పుట్టిన వాళ్లు అర్హులు.
-
రిజర్వేషన్ ఉన్న కేటగిరీలకు (SC, ST, OBC మొదలైనవారికి) వయస్సు రీలాక్సేషన్ ఉంటుంది.
- గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
అప్లికేషన్ ఫీజు ఎంత?
-
జనరల్ / OBC / EWS అభ్యర్థులకు: రూ. 1000/-
-
SC / ST / PwBD అభ్యర్థులకు: రూ. 100/-
-
ఫీజు కేవలం ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. (డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా)
సెలెక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగాలు పొందాలంటే మూడు స్టేజీలలో సెలెక్షన్ జరుగుతుంది:
-
ప్రిలిమ్స్ రాత పరీక్ష
-
మెయిన్స్ రాత పరీక్ష
-
పర్సనల్ ఇంటర్వ్యూ
తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది.
జీతం
ఈ ఉద్యోగాలకు జీతం రూ. 1,80,000 వరకు ఉంటుంది.Indhulone అలవెన్సులు, హౌస్ రెంట్, ట్రావెల్, మెడికల్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
IFSCA Assistant Manager Recruitment 2025కి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఆన్‌లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ప్రాసెస్ ఇలా ఉంటుంది:
-
ముందుగా IFSCA అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
-
అక్కడ కనిపించే “Apply Online” లింక్ పై క్లిక్ చేయాలి.
-
రిజిస్ట్రేషన్ చేసి, మీ వివరాలు కరెక్ట్‌గా ఫిల్ చేయాలి. (పేరు, తండ్రి పేరు, జన్మతేది, క్వాలిఫికేషన్ మొదలైనవి)
-
అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సంతకం, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
-
చివరగా అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ లో చెల్లించాలి.
-
సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
గమనిక: ఎవరూ హార్డ్ కాపీని ఆఫీస్‌కి పంపాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు
-
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 11.09.2025
-
అప్లికేషన్ చివరి తేదీ: 25.09.2025
-
ప్రిలిమ్స్ పరీక్ష: 11.10.2025
-
మెయిన్స్ పరీక్ష: 15.11.2025
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
ఎందుకు ఈ ఉద్యోగం బెస్ట్ ఛాన్స్?
-
సెంట్రల్ గవర్నమెంట్ లెవల్ లో ఉండటం వల్ల జాబ్ సెక్యూరిటీ బాగా ఉంటుంది.
-
జీతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
-
ఫైనాన్స్, లా, IT – ఈ మూడు రంగాల్లో చదివిన వాళ్లకి ఒకేసారి గోల్డెన్ ఛాన్స్.
-
భవిష్యత్తులో ప్రొమోషన్స్, కెరీర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న: నేను MBA చేసాను కానీ Finance స్పెషలైజేషన్ అని సర్టిఫికేట్ లో రాలేదు, నేను అప్లై చేయచ్చా?
సమాధానం: అవును, కానీ మీరు యూనివర్సిటీ నుంచి “Finance స్పెషలైజేషన్” అని ప్రూఫ్ తెచ్చి ఇవ్వాలి.
ప్రశ్న: ఫీజు ఆఫ్‌లైన్‌లో చెల్లించొచ్చా?
సమాధానం: లేదు, కేవలం ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.
ప్రశ్న: ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలలో ఏ సబ్జెక్టులు వస్తాయి?
సమాధానం: నోటిఫికేషన్ ప్రకారం జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే స్పెషలైజేషన్ సబ్జెక్టులు (Finance/IT/Law) ఉంటాయి.
ప్రశ్న: ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా?
సమాధానం: అవును, ఈ పోస్టులకి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు.
ముగింపు
IFSCA అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు చాలా రేర్‌గా వచ్చే గవర్నమెంట్ స్థాయి ఉద్యోగాలు. ఫైనాన్స్, లా, IT చదివిన వాళ్లకి ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు. వయస్సు లిమిట్ 30 ఏళ్ల వరకు ఉన్నందున, ఈ మధ్యే చదువు పూర్తిచేసిన యువత, లేదా జాబ్ కోసం ఎదురుచూస్తున్నవాళ్లు వెంటనే అప్లై చేయాలి.