ఇండియా మార్ట్ లో టెలీ అసోసియేట్ ఉద్యోగాలు 2025 – ఇంటి నుంచే పని చేసే వాళ్లకి బంగారు అవకాశం
IndiaMart Tele Associate Jobs 2025 : మన తెలుగు రాష్ట్రాల యువతకి ఉద్యోగం అంటే ఇక ఒక ఛాలెంజ్ అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూస్తూ టైమ్ వేస్ట్ అవుతోంది. కానీ ఇప్పుడు మంచి సాలీడ్ ప్రైవేట్ జాబ్ ఒకటి మన ముందుంది. అదే ఇండియా మార్ట్ సంస్థ ద్వారా టెలీ అసోసియేట్ పోస్టులకు నియామక ప్రకటన.
ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం. అంటే మీరు మీ ఇంట్లో నుంచే పనిచేయవచ్చు. ఇది ఎటువంటి సెల్స్ ప్రెషర్ లేకుండా, టార్గెట్ లేకుండా మాట్లాడే ఉద్యోగం. అందుకే ఈ ఉద్యోగం పట్ల చాలామందికి ఆసక్తి పెరుగుతోంది. దీనికి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం, పని విధానం, అవసరమైన వస్తువులు, అప్లికేషన్ ప్రాసెస్ – అన్నీ ఈ ఆర్టికల్ లో చర్చించుకుందాం.
ఇండియా మార్ట్ సంస్థ గురించి కొంతమంది కి తెలిసి ఉండకపోవచ్చు. ఇది భారతదేశపు అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ (B2B) మార్కెట్ ప్లేస్. చిన్నా పెద్దా బిజినెస్‌లకు ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు వారు తమ వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులతో మాట్లాడే, టెలీఫోన్ ద్వారా డీటెయిల్స్ చెప్పే ఉద్యోగానికి నియామకాలు చేపడుతున్నారు.
అసలే ఇంటి నుంచే పని చేసే అవకాశం, పైగా కనీస అర్హతలు మాత్రమే ఉండడం వల్ల ఇది చాలామందికి అందుబాటులో ఉన్న ఉద్యోగం.
అర్హతలు ఎలా ఉండాలి:
ఇందులో అప్లై చేయాలంటే మీరు కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అయితే డిగ్రీ ఉంటే మంచిదే కానీ తప్పనిసరి కాదు. మిగిలిన ముఖ్యమైన అర్హతలు కూడా తెలుసుకోవాలి:
* హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలగాలి – కనీసం మాట్లాడే స్థాయిలో
* ఇంటర్నెట్ పని చేయగల ల్యాప్టాప్ తప్పనిసరి
* మొబైల్ ఫోన్, సిమ్ కార్డు ఉండాలి
* రోజుకి కనీసం 3-4 గంటలు పనిచేసే టైం ఉండాలి
మీరు ఈ అవసరాలను నెరవేర్చగలిగితే చాలు – వెంటనే అప్లై చేయవచ్చు. ఇది ఫుల్ టైం ఉద్యోగం కాదు. కానీ మీరు రోజుకి కొన్ని గంటలు కేటాయించి మంచి ఆదాయం సంపాదించవచ్చు.
ఎంపిక విధానం:
ఇందులో ఎంపిక చాలా సింపుల్ గా ఉంటుంది. మొదట మీరు అప్లికేషన్ ఫామ్ submit చేస్తారు. తర్వాత చిన్న ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది – ఇది చాల సులభం. ఆ తర్వాత చిన్న interview ఉంటుంది. ఇందులో ఎక్కువగా basic communication skills, మీరు టెలీ కాల్ లో ఎలా మాట్లాడతారో పరీక్షిస్తారు.
మీ ప్రొఫైల్ short list అయితే వాళ్ళు మీ ఫోన్ నెంబర్ కి call చేసి మిగతా డీటెయిల్స్ చెప్తారు. మీరు అందులో మెరుగ్గా ప్రతిస్పందిస్తే, వెంటనే సెలెక్ట్ అవ్వచ్చు.
జీతం ఎలా ఉంటుంది:
ఇది పనిని బట్టి జీతం చెల్లించే విధానంగా ఉంటుంది. సాధారణంగా నెలకి పది నుంచి ఇరవై అయిదు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ముఖ్యంగా మీరు రోజుకి ఎక్కువ టైం ఇవ్వగలిగితే ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది.
జీతం వారానికి ఒకసారి మీ ఖాతాలోకి వస్తుంది. అంటే వారం వారం మీకు నగదు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలాకాలంగా ఇండియా మార్ట్ ఇస్తున్న మంచి సదుపాయం.
ఈ ఉద్యోగానికి ప్రధానంగా ఉండే పనులు:
* కంపెనీ ఇచ్చే లీడ్స్ కి కాల్ చేయడం
* వాళ్లకి కంపెనీ సర్వీసులు గురించి వివరించడం
* ఎటువంటి సెల్స్ టార్గెట్ లేదు
* వారిని కన్విన్స్ చేయడం మాత్రమే ముఖ్యమై పని
వీటి గురించి మిమ్మల్ని ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు. అంటే తొలిరోజే పని చేయాల్సిన అవసరం లేదు. మొదట 2-3 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో మీరు ఎలా మాట్లాడాలో, ఏవిధంగా కాల్ చేయాలో అన్నీ నేర్పుతారు.
Google Software Jobs 2025: హైదరాబాద్ లో గూగుల్ ఉద్యోగాల హడావిడి | ఫ్రెషర్స్ కి బంపర్ ఛాన్స్
ఇది నిజమైన Work From Home Job
ఇప్పుడు చాలా ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తున్నాయి. కానీ ఇండియా మార్ట్ లాంటి పెద్ద కంపెనీ నుంచి వచ్చే ఉద్యోగం అంటే అది నమ్మదగినది. సంస్థ నేరుగా జీతం ఇస్తుంది, ఎటువంటి third party కూడా ఉండదు. పైగా ఇది గతంలో కూడా వందలాది మందికి అవకాశం ఇచ్చిన సంస్థ. అందుకే దీనిపై కాస్త నమ్మకం ఉంచొచ్చు.
అప్లై చేసే విధానం:
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ముందుగా మీ పూర్తి biodata & basic details submit చేయాలి. వాటిలో:
* పేరు
* వయస్సు
* చదువు వివరాలు
* ఉండే ప్రదేశం
* మొబైల్ నెంబర్
* మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా లేదా
* రోజుకి ఎంత టైం కేటాయించగలరు అనే సమాచారం
అవి ఇచ్చిన తరువాత, మీ profile company వాళ్లు పరిశీలించి మిమ్మల్ని కాల్ చేస్తారు. ఇది పూర్తిగా online process.
అత్యవసరంగా గుర్తుంచుకోవలసినవి:
* ఇది Work From Home కానీ మీరు నిజంగా పని చేయాలి
* Time discipline చాలా ముఖ్యం
* Communicationలో basic confident ఉండాలి
* మొబైల్, laptop, internet తప్పనిసరి
DXC Analyst Jobs 2025 : ఫ్రెషర్లకి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం!
ఇందులో ఎలాంటి hidden charges లేవు. మీరు apply చేసేటప్పుడు ఎవరూ డబ్బులు అడగరూ. ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫేక్ process అయి ఉండొచ్చు.
ఇవే కాదు, మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వారు support ఇస్తారు. మీరు మీ doubts వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా clear చేసుకోవచ్చు. ట్రైనింగ్ లో ఎంత support అవసరమో అంత ఇస్తారు.
మొత్తానికి, ఈ ఉద్యోగం గురించి చెప్పాలంటే – చదువు తక్కువ అయినా, ఇంట్లో నుంచే పని చేయాలనుకునే వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత, మహిళలు, లేదా side income కోసం చూస్తున్న వాళ్లకు ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
ఇంకా apply చేయాలంటే ఆలస్యం చేయకండి. మీ దగ్గర basic సదుపాయాలు ఉంటే చాలు – ఇదే మీకు ఉద్యోగానికి తొలి అడుగు కావొచ్చు. మన ఊరిలో నుంచే ప్రభుత్వ కంపెనీ స్థాయిలో జీతం సంపాదించాలంటే ఇటువంటి అవకాశాలు వదలొద్దు.