PGIMER Recruitment 2025 :
PGIMER జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 2025 – తెలుగులో పూర్తి వివరాలు
పంజాబ్ లోని ప్రముఖ వైద్య విద్యా సంస్థ అయిన PGIMER – Postgraduate Institute of Medical Education and Research, Chandigarh సంస్థ 2025కి సంబంధించి కొత్తగా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (Junior Administrative Assistant – Group C) ఉద్యోగ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఇది పూర్తిగా ఇంటర్/12వ తరగతి చదివిన అభ్యర్థుల కోసం మంచి అవకాశం అని చెప్పొచ్చు.
ఈ పోస్టు మొత్తానికి 3 ఖాళీలు మాత్రమే ఉండటం వల్ల, పోటీ తక్కువగా ఉన్నా, ఎంపిక చాలా కఠినంగా ఉంటుందన్న సంగతి ముందుగానే గుర్తుపెట్టుకోవాలి.
ఉద్యోగ వివరాలు
పోస్టు పేరు: జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (Junior Administrative Assistant)
వర్గం: గ్రూప్ C
నియామక సంస్థ: PGIMER, చండీగఢ్
ఉద్యోగ రకం: కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు
ఈ పోస్టుకు కేవలం 3 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా:
UR (General) – 2
OBC – 1
విద్యార్హతలు
ఈ పోస్టుకు అప్లై చేయాలంటే కనీసం నీకు ఇంటర్మీడియట్ (12th class) పాస్ అయి ఉండాలి. Degree అవసరం లేదు. కానీ టైపింగ్ స్కిల్ మాత్రం తప్పనిసరి.
టైపింగ్ స్పీడ్:
ఇంగ్లీష్ టైపింగ్: కనీసం 35 words per minute ఉండాలి.
హిందీ టైపింగ్ tho apply cheyyadam ki option notification lo mention cheyyaledhu, కాబట్టి English typing speed compulsory.
జీతం వివరాలు :
ఈ పోస్టు 7వ పే కమిషన్ ప్రకారం Level – 2 pay scale లో ఉంటుంది.
అంటే జీతం: ₹19,900 – ₹63,200 వరకు ఉంటుంది.
ఇంకా DA, HRA, Transport Allowance లాంటివి alavatlu government norms prakaram add avutayi. So overall decent central govt income untundhi.
వయస్సు పరిమితి :
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు (1 ఆగస్టు 2024 నాటికి లెక్క)
కానీ SC, ST, OBC, PwBD లాంటి వర్గాలకు వయస్సులో మినహాయింపు ఉంటుంది, అది కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం ఉంటుంది.
ఎగ్జామ్ విధానం – ఎంపిక ఎలా జరుగుతుంది?
ఈ పోస్టుకు ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:
Computer Based Test (CBT)
ఇది Online exam. దీనిలో నీకు General Knowledge, Reasoning, Quantitative Aptitude, English Language లాంటి subjects నుంచి questions వస్తాయి. Exact syllabus notification లో mention cheyyaledu, కానీ usual pattern government exams laga untundhi.
Typing Test
CBT లో qualify ayyaka, typing test conduct chestaru. ఇది just qualifying nature lo untundhi. Final merit list typing lo pass ayina vallalo CBT score prakaram prepare chestaru.
Document Verification
Final selection ki mundu, certificates checking untundhi.
అప్లికేషన్ ఫీజు
General/OBC/EWS: ₹1500
SC/ST: ₹800
PwBD (divyangula) కు ఫీజు లేదు (₹0)
ఫీజు ఆన్‌లైన్ లోనే చెల్లించాలి – అంటే Credit card, Debit card, Net banking లేదా UPI ద్వారా.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభం: 04 జూలై 2025
చివరి తేదీ: 04 ఆగస్టు 2025
CBT పరీక్ష తేదీ: తరువాత PGIMER అధికారిక వెబ్‌సైట్ లో ప్రకటిస్తారు
దరఖాస్తు విధానం
ఈ పోస్టుకు ఆన్‌లైన్ లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
Official website: [pgimer.edu.in] లోకి వెళ్ళి “Recruitment” సెక్షన్ లో apply link activate అవుతుంది.
Step-by-step instructions అక్కడ ఉంటాయి.
ఒకసారి apply చేసి form submit చేసాక, print తీసుకోవడం మర్చిపోద్దు – document verification కి అవసరం అవుతుంది.
ఎందుకు ఈ ఉద్యోగం మంచి అవకాశం?
కేంద్ర ప్రభుత్వ జాబ్
పదవికి పర్మనెంట్ posting
Pay scale కూడా decent gaa untundhi
PGIMER లాంటి prestigious organization లో ఉద్యోగం అంటే craze untundhi
అవన్నీ కంటే మిన్నగా – ఇంటర్ పాస్ అయితే చాలు, no need of degree, no experience, no GATE, nothing!
ఎవరు అర్హులు?
ఇంటర్ చదివినవాళ్లు ,Diploma kuda chance
టైపింగ్ speed ఉన్నవాళ్లు
Government ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న freshers
Group D/DSSSB/SSC CHSL టైప్ preparation lo ఉన్నవాళ్లు – వాల్లకి ఇది బెస్ట్ ఆప్షన్
ముగింపు మాట
PGIMER లో Junior Administrative Assistant పోస్టు కంటే better opportunity ఇంటర్ పాస్ చేసినవాళ్లకి చాల తక్కువగా దొరుకుతుంది. మూడు పోస్టులే ఉన్నా… మన preparation strong unte, typing practice daily chesthu, CBT syllabus revise chesthu velthe, selection possibility undhi.
Notification date recent gaa vachindi, అప్లై చేయడానికి full one month undhi – కాబట్టి ఈ రోజు నుండే serious gaa preparation మొదలుపెట్టు.