అదిరే ఫీచర్లతో.. ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్ – RailOne గురించిమాట్లడుకుందాం!
ఇప్పుడు ట్రైన్ టికెట్ బుకింగ్ అంటే IRCTC యాప్, PNR స్టేటస్ కోసం ఇంకో వెబ్‌సైట్, లైవ్ లొకేషన్ కోసం ఇంకో యాప్ ఓపెన్ చేయాలి. అన్నీ ఒక్క దగ్గరే ఉంటే ఎంత బాగుండేదో అనుకునే వాళ్లకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఉంది. అదే RailOne అనే కొత్త రైలు యాప్. ఇదొచ్చేసరికి… నిజంగా పక్కా యాప్ అనిపిస్తుంది.
RailOne అంటే ఏంటి?
ఇది మన అందరికి అవసరమైన ఓల్రౌండర్ రైల్వే యాప్. ట్రైన్ టికెట్ బుకింగ్, PNR చెకింగ్, లైవ్ ట్రైన్ స్టేటస్, కోచ్ పొజిషన్, ట్రైన్ రూట్స్, కేవలం ఏరియాలో ఏ ట్రైన్ వస్తుందో కూడా చూపిస్తుంది. అంటే ఏదైనా ట్రైన్ విషయం కోసం ఈ యాప్ ఉంటే చాలు, ఇంకొకటి అవసరం లేదు.
ఈ యాప్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు చూద్దాం
PNR Status చెక్ చేయడమూ – లైవ్ గ్గా
టికెట్ కన్ఫర్మ్ అయిందా కాదా అనేది మినిట్స్ లో తెలుసుకోవచ్చు.
Live Train Running Status
ఏ ట్రైన్ ఎక్కడుందో, ఎంత లేట్, ఇంకా ఎన్ని స్టేషన్లు ఉన్నాయో అన్నీ లైవ్ గా చూపిస్తుంది.
Ticket Booking – IRCTC Login tho
ఈ యాప్ నుంచి టికెట్ బుక్ చేయచ్చు. అక్కడకక్కడ IRCTC లాగిన్ tho డైరెక్ట్ లింక్ అవుతుంది.
Train Between Stations Search
స్టేషన్ A నుంచి స్టేషన్ Bకి ఏ ట్రైన్లు వస్తున్నాయో డేట్ వెయిస్ గా తెలుస్తుంది.
Coach Position Details
మీ బోగీ ఎక్కడ వుంటుందో ముందుగానే తెలిసిపోతుంది. ప్లాట్‌ఫాం ఎంట్రీకి ఈ ఫీచర్ బాగుండిపోతుంది.
Platform Number Prediction
కొన్ని రైలు స్టేషన్లలో ఏ ప్లాట్‌ఫాం లో ఆ ట్రైన్ వస్తుందో అంచనాగా తెలుపుతుంది.
Nearby Station Trains
మీరు ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న స్టేషన్లలో ఏ ట్రైన్లు వస్తున్నాయో కూడా చూపిస్తుంది.
User Interface ela undhi?
ఒక్క మాటలో చెప్పాలంటే – చాలా సింపుల్. ఏ వయసున్న వాడైనా ఈ యాప్ ni easy గా వాడగలడు. టెక్స్ట్ క్లీన్‌గా కనిపిస్తుంది, ఫాంట్స్ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉన్నయ్. కొంతవరకు Google Maps laga కుడా ఫీల్ ఉంటుంది కాబట్టి ట్రైన్ లొకేషన్ ఫాలో అవడంలో ఇబ్బంది ఉండదు.
ఏమీ Charges వుంటాయా?
ఈ యాప్ వాడటానికి ఏ రకమైన ఫీజు లేదు. Free గా Android Play Store లో దొరుకుతుంది. ఇకపోతే IRCTC టికెట్ బుకింగ్ అయితే మీ existing IRCTC లాగిన్ లోకి లాగిన్ కావాల్సిందే. బుకింగ్ Charges వుంటే అది IRCTC Terms prakaram untundi.
ఎవరికీ ఉపయోగపడుతుంది?
– రోజూ ట్రైన్ ప్రయాణాలు చేసే వాళ్లకి
– PNR Status కోసం Google లో వెతికేవాళ్లకి
– లైవ్ ట్రైన్ స్టేటస్ చూడాలనుకునేవాళ్లకి
– ఫ్రెండ్స్ లేక ఫ్యామిలీ ప్రయాణంలో ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకునే వాళ్లకి
– కొత్తగా ప్రయాణం చేసే స్టూడెంట్స్, టూరిస్టులకి చాలా హెల్ప్ అవుతుంది.
ఇంతగా యాప్ గురించి ఎందుకంత హైప్ వస్తోంది?
పెద్దగా అడ్స్ పెట్టకుండానే word of mouth తో ఈ యాప్ మీద క్రేజ్ పెరిగిపోతుంది. ఇంకా ప్లేస్టోర్ రివ్యూలు చూసినా 4.5+ రేటింగ్ లోనే ఉంది. ఒక్క యాప్ లో అన్ని కావాలన్న వాళ్లకు ఇది ఓ పరిపూర్ణం లాంటి అప్లికేషన్ అనొచ్చు.
మొత్తానికి చెప్పాలంటే…
ఒక్క చిన్న యాప్, కానీ పెద్ద ఉపయోగం. మీ ఫోన్‌లో రైల్వే సంబంధిత పనులు అన్నీ క్లియర్ చేసేసే Power ఉందీ RailOne యాప్‌కి. ఎప్పుడైనా ట్రైన్ ప్రయాణం చేసే ముందు ఈ యాప్ ఓసారి ఓపెన్ చేస్తే చాలు, అవసరాలన్నీ అక్కడే నిండిపోతాయి.
ఇంకా నువ్వు ఈ యాప్ వాడలేదు అంటే, ఓసారి ట్రై చేసి చూడచ్చు. నిజంగా “ఆల్ ఇన్ వన్” అనేది అసలైన అర్థం ఇందులోనే ఉంటుంది.