RRB Paramedical Jobs 2025 : ఇండియన్ రైల్వేలో 434 పారా మెడికల్ ఉద్యోగాలు!

RRB Paramedical Jobs 2025 Notification – ఇండియన్ రైల్వేలో 434 పారా మెడికల్ ఉద్యోగాలు!

ఇండియన్ రైల్వే సిబ్బంది విభాగం నుండి పారా మెడికల్ ఉద్యోగాల కోసం ఓ పెద్ద నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రైల్వే జాబ్స్ కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా CEN 03/2025 అనే అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ తో 434 ఖాళీలకు సంబంధించి ఒక సూచనాత్మక ప్రకటనను రిలీజ్ చేసింది. రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం ఆశించే వారు ఇది తప్పకుండా వదలకూడదు.

ఇది ఓ పక్క ఉద్యోగ భద్రత కలిగిన మంచి ఆప్షన్, ఇంకో పక్క దేశ సేవ చేయగలిగే గౌరవమైన ఉద్యోగం కూడా. ముఖ్యంగా మెడికల్ సైడ్ చదువుకున్న వారు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి.

అప్లికేషన్ మొదలయ్యే తేదీ – ఆగస్టు 9, 2025

అప్లికేషన్ క్లోజింగ్ తేదీ – సెప్టెంబరు 8, 2025 (రాత్రి 11:59 వరకు)

భర్తీ చేయబోయే పోస్టులు ఏవేంటే?

ఈ రిక్రూట్మెంట్ లో కింద పేర్కొన్న పోస్టులు ఉన్నాయి. ఒక్కో పోస్టుకి ఉన్న ఖాళీలు, వయస్సు పరిమితి వివరాలు కూడా చూద్దాం:

పోస్ట్ పేరు ఖాళీలు వయస్సు పరిమితి
నర్సింగ్ సూపరింటెండెంట్ 272 20 నుండి 40 సంవత్సరాలు
డయాలిసిస్ టెక్నీషియన్ 4 20 నుండి 33 సంవత్సరాలు
హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ II 33 18 నుండి 33 సంవత్సరాలు
ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) 105 20 నుండి 35 సంవత్సరాలు
రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ 4 19 నుండి 33 సంవత్సరాలు
ECG టెక్నీషియన్ 4 18 నుండి 33 సంవత్సరాలు
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II 12 18 నుండి 33 సంవత్సరాలు

వయస్సు లెక్కించడానికి రిఫరెన్స్ డేట్ – 1 జనవరి 2026.

ఎవరు అర్హులు? (Eligibility)

ఒక్కో పోస్టుకి విడివిడిగా ఉండే విద్యార్హతల వివరాలు అధికారిక నోటిఫికేషన్ CEN 03/2025 లో స్పష్టంగా ఇవ్వబోతున్నారు. అయితే చాలా పోస్టులకు సంబంధించి కనీసం Intermediate, Pharmacy డిగ్రీ, Nursing కోర్సులు, Lab Technician ట్రైనింగ్, ECG/Dialysis టెక్నికల్ ట్రైనింగ్ ముదలైనవి అవసరమవుతాయి.

అదే విధంగా, అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో మీ Aadhaar వివరాలు (పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిస్) అన్నీ మీ 10వ తరగతి సర్టిఫికేట్ తో మ్యాచ్ అవ్వాలి. లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. Aadhaar update చేసుకుని అప్లై చేయడం బెటర్.

ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025

సాలరీ & జాబ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి?

ఇవన్నీ 7th Pay Commission పేబాండ్ ప్రకారం ఇస్తారు. వేర్వేరు పోస్టులకు వేరే వేరే లెవల్స్ ఉంటాయి. ఉదాహరణకు:

  • నర్సింగ్ సూపరింటెండెంట్: Level-7 (సుమారు ₹44,900 నుండి ప్రారంభం)

  • ఫార్మసిస్ట్: Level-5 (సుమారు ₹29,200 నుండి)

  • ల్యాబ్ అసిస్టెంట్, ECG Technician లాంటి పోస్టులకు Level-3 లేదా Level-4 పే స్కేల్ ఉంటుంది.

ఇంకా HRA, DA, Transport Allowance వంటి అన్ని Central Govt బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.

అప్లై చేయడమెలా?

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ లోనే చేయాలి. rrbapply.gov.in అనే కామన్ పోర్టల్ నుంచి అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఆగస్టు 9, 2025 నుండి అప్లికేషన్ లింక్ యాక్టివ్ అవుతుంది. మొదటి రోజు నుంచి అప్లై చెయ్యడం మంచిది, ఎందుకంటే చివరి రోజుల్లో సైట్ స్లో అయిపోయే ఛాన్స్ ఉంటుంది.

Notification 

Apply Online 

అప్లికేషన్ చేయడంలో ముఖ్యమైన సూచనలు:

  • మీ పూర్తి వివరాలు Aadhaar కి అనుగుణంగా ఉండాలి.

  • ఫోటో, సిగ్నేచర్ క్లియర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి.

  • కేటగిరీ (SC/ST/OBC/EWS/UR) వివరాలు సరైన ప్రూఫ్ తో అప్లై చేయాలి.

  • అబ్జెక్షన్ లేకుండా మొత్తం అప్లికేషన్ సాఫీగా ప్రాసెస్ అవ్వాలంటే ఎలాంటి తప్పులూ చేయకూడదు.

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025

ఫీజు డిటెయిల్స్?

ఇంకా అధికారికంగా అప్లికేషన్ ఫీజు ప్రకటించలేదు. కానీ గత రిక్రూట్మెంట్స్ ని బట్టి చూస్తే:

  • Gen/OBC/EWS కి ₹500 వరకు ఉండొచ్చు (అందులో కూడా CBT కి హాజరవ్వడం ద్వారా ₹400 రీఫండ్ ఉంటుంది)

  • SC/ST/PWD/Women కి ₹250 వరకు మాత్రమే ఉండొచ్చు

అధికారిక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఖచ్చితమైన డీటెయిల్స్ అప్‌డేట్ అవుతాయి.

ఎగ్జామ్ ఎలా ఉంటుంది?

CBT (Computer Based Test) ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కొన్నిపోస్టులకు స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ కూడా ఉండొచ్చు.

సాధారణంగా RRB పరీక్ష ఫార్మాట్:

  • General Awareness

  • Professional Knowledge (పోస్ట్ కి సంబంధించి)

  • Arithmetic & Reasoning

  • General Science

పరీక్ష గురించి పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో ఉంటుంది.ఎక్కడ ఏ పోస్టులు ఉంటాయి?

ఈ ఖాళీలు వేర్వేరు జోన్లు, రైల్వే బోర్డులు ద్వారా ఉంటాయి. ఉదాహరణకు:

  • RRB Secunderabad

  • RRB Chennai

  • RRB Mumbai

  • RRB Kolkata

  • RRB Ahmedabad
    …ఇలా మొత్తం 21 RRB లలో విభజించి పోస్టింగ్ ఇస్తారు.

ఎంపిక అయినవాళ్లకి ట్రైనింగ్ ఉంటుంది?

అవును. ఎంపిక అయిన అభ్యర్థులు జాయిన్ అయ్యే ముందు ఒక చిన్న ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో కూడా స్టైపెండ్ ఇస్తారు.

ఈ ఉద్యోగాలు ఎందుకు స్పెషల్?

  • భారత రైల్వేల్లో నర్సింగ్, ఫార్మసీ, టెక్నీషియన్ ఉద్యోగాలకి మంచి డిమాండ్ ఉంటుంది.

  • ఉద్యోగ భద్రత, రెగ్యులర్ పెరుగుతున్న పే స్కేల్, కేంద్ర ప్రభుత్వ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి.

  • ఎలాంటి ప్రైవేట్ ఉద్యోగాల్లా ఒత్తిడి లేదు. టైమింగ్ స్టబుల్ గా ఉంటుంది.

  • పోస్టింగ్ ప్రాంతం ముందుగానే తెలిసిపోతుంది – ఫ్యామిలీ ప్లాన్ చేయడానికి సులభం.

Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!

చివరిగా చెప్పాల్సింది…

ఈ RRB Paramedical Staff Recruitment 2025 అనేది ఆరోగ్య విభాగంలో సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగం కావడం వల్ల, చాలా మంది పోటీ పడతారు. అందుకే ముందుగానే అప్లై చేయడం, పరీక్ష సిలబస్ ప్రిపేర్ అవడం చాలా అవసరం.

మీరు నర్సింగ్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్ వంటివి చదివినవారైతే… ఇది మిస్ కాకూడదు.

 ఇప్పుడు మీ టైం – Application link ఆగస్టు 9 నుంచి ఓపెన్ అవుతుంది!

Leave a Reply

You cannot copy content of this page