RRB Technician Notification 2025: ఆఖరి తేదీ పొడిగించారు – 6238 ఖాళీలు
RRB Technician Notification 2025 : ఇండియన్ రైల్వేలో Technician ఉద్యోగాలకు సంబంధించిన CEN నెం. 02/2025 నోటిఫికేషన్ ఇటీవలే విడుదల కాగా, ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించారు. మొదటగా జూలై 28, 2025 వరకు దరఖాస్తు చేయాలన్న షెడ్యూల్ ఉండగా, తాజాగా విడుదలైన Corrigendum ప్రకారం, దరఖాస్తు చేసుకునే చివరి తేదీని ఆగస్టు 7, 2025 (రాత్రి 11:59 వరకు) పొడిగించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా Technician Grade I (సిగ్నల్) మరియు Technician Grade III పోస్టుల కోసం మొత్తం 6238 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక RRB వెబ్‌సైట్‌లో ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
RRB Technician 2025 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
Indicative Notice విడుదల తేదీ: 21 జూన్ 2025
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 28 జూన్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 7 ఆగస్టు 2025 (రాత్రి 11:59 వరకు)
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 9 ఆగస్టు 2025
అప్లికేషన్ సవరణ (Correction) విండో: 10 ఆగస్టు నుండి 19 ఆగస్టు 2025 వరకు
స్క్రైబ్ వివరాల నమోదుకు తేదీలు: 20 నుండి 24 ఆగస్టు 2025
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
దరఖాస్తు చేసే విధానం:
మీ RRB ప్రాంతానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
CEN నెం. 02/2025 లింక్‌పై క్లిక్ చేయాలి
ఆధార్, ఈమెయిల్, ఫోన్ నంబర్ సహాయంతో కొత్తగా రిజిస్టర్ అవ్వాలి
వ్యక్తిగత, విద్యా వివరాలు నింపాలి
ఫోటో, సిగ్నేచర్, ఆధార్ వెరిఫికేషన్ వివరాలు అప్‌లోడ్ చేయాలి
అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
చివరగా సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోవాలి
అర్హతలు:
Technician Grade I (సిగ్నల్): సంబంధిత ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో డిప్లొమా లేదా బీఎస్సీ
Technician Grade III: 10వ తరగతి/SSLC మరియు సంబంధిత ట్రేడ్స్‌లో ITI
వయస్సు పరిమితి (01-07-2025 నాటికి):
Technician Grade I: 18 నుంచి 33 ఏళ్లు
Technician Grade III: 18 నుంచి 30 ఏళ్లు
(SC/ST/OBC/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తించవచ్చు)
మెడికల్ స్టాండర్డ్స్:
Technician Grade I Signal: B-1
Technician Grade III: సంబంధిత పోస్టుల ప్రకారం
దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ తప్పకుండా ఉండాలి. ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్స్ అప్‌డేట్ అయి ఉండాలి. తప్పు వివరాల వల్ల అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
మెడికల్ పరీక్ష (ME)
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు | NABCONS Tribal Development Jobs 2025
పరీక్ష విధానం:
Technician Grade I Signal (Pay Level 5):
జనరల్ అవేర్‌నెస్: 10 ప్రశ్నలు – 10 మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 15 ప్రశ్నలు – 15 మార్కులు
కంప్యూటర్స్ & అప్లికేషన్స్: 20 ప్రశ్నలు – 20 మార్కులు
మ్యాథమెటిక్స్: 20 ప్రశ్నలు – 20 మార్కులు
బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్: 35 ప్రశ్నలు – 35 మార్కులు
మొత్తం: 100 ప్రశ్నలు – 100 మార్కులు
పరీక్ష కాలవ్యవధి: 90 నిమిషాలు
నెగటివ్ మార్కింగ్: ఒక్కో తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత
Technician Grade III (Pay Level 2):
మ్యాథమెటిక్స్: 25 ప్రశ్నలు – 25 మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 25 ప్రశ్నలు – 25 మార్కులు
జనరల్ సైన్స్: 40 ప్రశ్నలు – 40 మార్కులు
జనరల్ అవేర్‌నెస్: 10 ప్రశ్నలు – 10 మార్కులు
మొత్తం: 100 ప్రశ్నలు – 100 మార్కులు
పరీక్ష కాలవ్యవధి: 90 నిమిషాలు
నెగటివ్ మార్కింగ్: ఒక్కో తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత
అర్హత మార్కులు:
OC/EWS: 40%
OBC/SC: 30%
ST: 25%
PwBD అభ్యర్థులకు 2% వరకు రాయితీ ఉండవచ్చు
Government Bank Jobs 2025: ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు వచ్చేశాయి!
అప్లికేషన్ ఫీజు:
UR/OBC: రూ. 500 (CBT రాసిన తరువాత రూ. 400 తిరిగి ఇచ్చేది)
SC/ST/PwBD/మహిళలు/Ex-SM/EWS: రూ. 250 (CBT రాసిన తర్వాత పూర్తి మొత్తం తిరిగి వస్తుంది)
తుదిగా చెప్పాల్సిందేంటంటే, ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్క దశలో కూడా సరిగ్గా డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. ఇది మంచి అవకాశం కావడంతో గమనంగా తీసుకోవాలి.
ఇంకా ఏమైనా స్పష్టత కావాలంటే మీ RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా వారి హెల్ప్ డెస్క్ ద్వారా సంప్రదించండి.