TGPRB Notification 2025 : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 – పూర్తి వివరాలు
తెలంగాణ ప్రభుత్వంలో మరో పెద్ద అవకాశాన్ని TSLPRB ప్రకటించింది. Assistant Public Prosecutors (Category – 6) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 118 ఖాళీలు ఉన్నాయి. లా చదివినవాళ్లకి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.
ఖాళీల వివరాలు
-
మొత్తం పోస్టులు: 118
-
Multi Zone – I: 50
-
Multi Zone – II: 68
-
వీటిలో Direct Recruitment – 95, Limited Recruitment (Backlog) – 23 పోస్టులు ఉన్నాయి.
జీతం (Scale of Pay)
ఈ ఉద్యోగానికి మంచి పెరిగే స్కేల్ ఉంది.
-
₹54,220 – ₹1,33,630
అర్హతలు (Eligibility)
వయస్సు పరిమితి
-
గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు (01 జూలై 2025 నాటికి)
-
ప్రభుత్వం ప్రత్యేకంగా 12 సంవత్సరాల వయసు సడలింపు ఇచ్చింది.
-
రిజర్వేషన్ కేటగిరీలకు వయసులో ప్రత్యేక రాయితీలు ఉంటాయి.
విద్యార్హత
-
ఏదైనా డిగ్రీతో పాటు LLB / BL లా డిగ్రీ ఉండాలి.
-
5 years integrated law course పూర్తి చేసినవాళ్లు కూడా అర్హులు.
అనుభవం
-
కనీసం 3 సంవత్సరాల క్రిమినల్ కోర్ట్స్ లో ప్రాక్టీస్ చేసి ఉండాలి.
-
ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఇప్పటికీ కొనసాగుతూ ఉండాలి (నోటిఫికేషన్ తేదీకి).
ఆరోగ్య ప్రమాణాలు (Medical Standards)
-
ఫిజికల్‌గా హెల్తీగా ఉండాలి.
-
Speech, Hearing, Sight సమస్యలు ఉన్నవాళ్లకి అర్హత లేదు.
-
Stammering/Stuttering ఉన్నవాళ్లు కూడా అర్హులు కారూ.
పరీక్ష విధానం (Selection Process)
రాత పరీక్ష – రెండు పేపర్లు
-
Paper I (Objective type) – 200 మార్కులు (200 ప్రశ్నలు, నెగెటివ్ మార్కింగ్ ఉంది)
-
Paper II (Descriptive type) – 200 మార్కులు (Pleading & Drafting)
క్వాలిఫై అవ్వాలంటే:
-
OC/EWS – 40%
-
BC – 35%
-
SC/ST/PH – 30%
👉 Paper-I qualify కాలేకపోతే Paper-II చూడరు. కాబట్టి Paper-Iలో మంచి ప్రిపరేషన్ చాలా ముఖ్యం.
ఫీజు వివరాలు
-
SC/ST (Local Telangana): తగ్గింపు ఫీజు ఉంటుంది.
-
Others: సాధారణ ఫీజు చెల్లించాలి.
-
Fee once paid non-refundable.
Payment Method: Credit Card / Debit Card / Net Banking ద్వారా.
అప్లికేషన్ ప్రాసెస్
-
ముందుగా www.tgprb.in వెబ్‌సైట్ లో రిజిస్టర్ అవ్వాలి.
-
Mobile number యూజర్ IDగా ఉంటుంది.
-
Fee చెల్లించిన తర్వాత Online Application submit చేయాలి.
-
Photo + Signature కలిపి jpg formatలో upload చేయాలి (30kb – 50kb).
-
Once submitted, correction option ఉండదు. కాబట్టి జాగ్రత్తగా details verify చేసుకోవాలి.
అవసరమైన సర్టిఫికేట్లు
-
SSC/Matric సర్టిఫికేట్ (DOB కోసం)
-
Law Degree Certificate
-
Bar Council Enrollment Certificate
-
క్రిమినల్ కోర్టులో కనీసం 3 సంవత్సరాల ప్రాక్టీస్ సర్టిఫికేట్
-
Study / Residence Certificate
-
Community Certificate (SC, ST, BCలకు)
-
EWS / Non-Creamy Layer Certificate (అవసరమైతే)
-
OH Certificate (PH Categoryకు)
-
Meritorious Sports Person సర్టిఫికేట్ (అవసరమైతే)
రిజర్వేషన్లు
-
SC, ST, BC, EWSలకు రిజర్వేషన్ ఉంటుంది.
-
33⅓% మహిళలకు రిజర్వేషన్ ఉంది.
-
OH (Orthopedically Handicapped) వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది.
-
Meritorious Sports Persons quota కూడా ఉంది.
లోకల్ రిజర్వేషన్
-
Multi Zone I & II ఆధారంగా లోకల్ కాండిడేట్స్‌కి ప్రాధాన్యత.
-
First 5% పోస్టులు open merit basis, మిగతా 95% స్థానికులకు మాత్రమే.
ముఖ్యమైన విషయాలు
-
Online application dates త్వరలోనే Press Release ద్వారా ప్రకటిస్తారు.
-
Candidates ఒకే Application form submit చేయాలి. ఎక్కువ forms submit చేస్తే రిజెక్ట్ అవుతుంది.
-
False information ఇస్తే legal action తీసుకుంటారు.
ఎందుకు ఈ ఉద్యోగం?
-
Telanganaలో law graduatesకి ఇది high profile govt job.
-
మంచి pay scale తో పాటు prestige, job security, career growth ఉంటాయి.
-
Criminal lawలో career కొనసాగించాలనుకునే advocatesకి ఇది super chance.