Wipro Hiring 2025 : విప్రో‌లో నాన్ వాయిస్ జాబ్స్ – హైదరాబాద్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ

విప్రో‌లో నాన్ వాయిస్ జాబ్స్ – హైదరాబాద్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ

Wipro Hiring 2025 :

హైదరాబాద్ లో ఉన్నవాళ్లకి చక్కని అవకాశంగా చెప్పొచ్చు. విప్రో కంపెనీ నుండి నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలకి నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. కొత్తగా డిగ్రీ అయిపోయిన వాళ్లు, ఫ్రెషర్స్ ఈ అవకాశం దొరికినంతలో ఉపయోగించుకోవచ్చు.

ఇంటర్వ్యూ తేదీ:

ఇంటర్వ్యూ 27వ తేదీ జూన్ (గురువారం) రోజున జరుగుతుంది.
ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే ఇంటర్వ్యూకి తీసుకుంటారు. ఆలస్యం చేయకుండా టైమ్ కి వెళ్ళాలి.

ఇంటర్వ్యూ జరగే ప్రదేశం:

విప్రో ప్రైవేట్ లిమిటెడ్, SEZ,
203/1, మాధవ రెడ్డి కాలనీ,
గచ్చిబౌలి, మనికొండ, నానక్‌రాంగూడ,
హైదరాబాద్ – 500032
(డొమినోస్ పిజ్జా వెండర్ గేట్ కి ఎదురుగా ఉంటుంది)

ఎలాంటి జాబ్ అంటే:

ఇది నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగం. అంటే ఫోన్ మాట్లాడాల్సిన పని ఉండదు. కంప్యూటర్ మీద డేటా టైపింగ్ లాంటి పనులు చేస్తారు.

ఎవరు అర్హులు:

– ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవాళ్లు
– 2025లో గ్రాడ్యుయేట్ అయినవాళ్లూ అప్లై చేసుకోవచ్చు
– ఫ్రెషర్స్ కి ఇది బెస్ట్ ఛాన్స్
– ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేదా మార్కుల మెమో ఉండాలి
– కంప్యూటర్ నైపుణ్యం, ఎక్సెల్ మీద కాస్త ఐడియా ఉండాలి
– ఇంగ్లీష్ లో మాట్లాడే స్కిల్ అవసరం
– డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అన్నీ చేయగల వాళ్లే రావాలి
– హైదరాబాద్ లో ఉన్న వాళ్లకే ఇది బాగుంటుంది
– వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట, వర్క్ ఫ్రమ్ హోం కాదు

వారానికి పనిదినాలు:

వారంలో 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. మిగతా 2 రోజులు సెలవు.

ఇంటర్వ్యూకి తీసుకురావాల్సిన పేపర్లు:

– రెజ్యూమ్
– ప్రభుత్వ గుర్తింపు ఐడీ (ఆధార్, పాన్ వగైరా)
– పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి

విప్రో టీమ్ చెప్పింది:

అభ్యర్థులు ఇంటర్వ్యూకి డైరెక్ట్ గా అక్కడికి వెళ్లొచ్చు. ముందుగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. టైమ్ కి వెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలూ.ఈ ఉద్యోగం కొత్తగా చదువు పూర్తిచేసిన వాళ్లకి సరిగ్గా సరిపోతుంది. కంప్యూటర్ మీద కనీస నైపుణ్యం ఉన్నవాళ్లు ట్రై చేయొచ్చు. హైదరాబాద్లో స్టే ఉన్న వాళ్లకి ఇది బాగా సూటవుతుంది.మరిన్ని జాబ్స్ కోసం మా Free Jobs Information Channel లో చూడండి!

Apply Link 

Leave a Reply

You cannot copy content of this page