AP District Court Exam Dates 2025 – CBT పరీక్ష షెడ్యూల్ విడుదల!

AP జిల్లా కోర్టుల పరీక్షల తేదీల శుభవార్త – హైకోర్టు నోటిఫికేషన్ విడుదల!

AP District Court Exam Dates 2025 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బిగ్ బ్రేకింగ్. 2025 మే 6న రాష్ట్రంలోని 1620 పోస్టుల భర్తీకి పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు, జూలై 10, 2025 న విడుదలైన తాజా నోటిఫికేషన్ ద్వారా, ఆ పోస్టులకి సంబంధించి పరీక్షల తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి.

ఈ నోటిఫికేషన్‌ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా కోర్టులలో పనిచేసే స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వంటి అనేక విభాగాల్లో పరీక్షలు నిర్వహించబోతున్నారు.

చాలా రోజుల నిరీక్షణకు హైకోర్టు క్లారిటీ ఇచ్చింది!

ఈ పోస్టులకు వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. ఫలితంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష తేదీల కోసం రోజుల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ నిరీక్షణకు ఇప్పుడు హైకోర్టు తెరదించింది. తాజా షెడ్యూల్ ప్రకారం, అన్ని పోస్టులకీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా ఎంపిక జరుగుతుంది.

పరీక్షల తేదీలు షెడ్యూల్ ఇలా ఉంది:

డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్
పరీక్ష తేదీలు: ఆగస్టు 20 & 21

మొత్తం: 6 సెషన్లు

కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్
పరీక్ష తేదీ: ఆగస్టు 22

మొత్తం: 2 సెషన్లు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్
పరీక్ష తేదీలు: ఆగస్టు 23 & 24

మొత్తం: 6 సెషన్లు

ఇలా విడతలవారీగా పరీక్షలు పెట్టడం వల్ల అభ్యర్థులు ఒకదాని తర్వాత మరొక పరీక్షకు సన్నద్ధం అవ్వచ్చు. ఒక్క రోజులో అన్ని పరీక్షలు కాకుండా బిగ్ రిలీఫ్ అన్న మాట.

హాల్ టికెట్లు ఎప్పటి నుంచి డౌన్లోడ్?

హైకోర్టు విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం, హాల్ టికెట్లు ఆగస్టు 13 నుంచి అందుబాటులో ఉంటాయ్. అభ్యర్థులు హైకోర్టు వెబ్‌సైట్‌కు వెళ్లి తమ లాగిన్ వివరాలతో hall ticket డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఒకవేళ అదే రోజు డౌన్లోడ్ చేయకపోతే, చివర్లో సైట్ హ్యాంగ్ అవుతుందంటూ అధికారుల హెచ్చరిక. కాబట్టి ముందే తీసుకోవడం మంచిది.

ఏం తీసుకెళ్లాలి పరీక్షకి?

పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్‌తో పాటు, ఒక ఒరిజినల్ ID proof తప్పనిసరిగా తీసుకెళ్లాలి. (AADHAR, Voter ID, DL వంటివి).

లేట్‌గా వెళ్లిన వాళ్లను లోపలకి అనుకోరు. అందుకే ముందే వెళ్లడం మంచిది.

ఇంకా పరీక్ష CBT (Computer Based Test) కాబట్టి, కీబోర్డ్, మౌస్ మీద కనీస పరిజ్ఞానం ఉండాలి.

ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?

ఇప్పటివరకు జిల్లు కోర్టుల్లో పెండింగ్ కేసులు అధికంగా ఉన్నాయి. కొత్తగా సిబ్బంది నియామకం వల్ల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయ్, పౌర సేవలు వేగవంతం అవుతాయి, అంటే ప్రజలకి న్యాయం త్వరగా అందుతుంది. ఈ ఉద్యోగాల ద్వారా కోర్టు వ్యవస్థ మరింత గట్టిపడే అవకాశం ఉంది.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు:

హాల్ టికెట్ డౌన్లోడ్ జూలై 13 నుండి మొదలవుతుంది

ఏ పోస్టుకు ఏ రోజు పరీక్ష ఉందో ఇప్పటికే షెడ్యూల్ విడుదల

CBT format కాబట్టి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం

ID proof లేకపోతే పరీక్షకు అనుమతి ఉండదు

మరిన్ని వివరాలకు హైకోర్టు వెబ్‌సైట్‌ చూడండి

ప్రిపరేషన్ ఎలా చేయాలి?

ఇప్పుడు అభ్యర్థులు చేతిలో గట్టి దాదాపు 30 రోజులు ఉన్నాయ్. ఈ టైం లో మాక్ టెస్టులు రాయడం, సిలబస్ రివైజ్ చేయడం, CBTకి అలవాటు పడటం ముఖ్యం.

ఇంటర్నెట్‌లో plenty of free mock tests ఉన్నాయ్. వాటిని రాసి అప్పటికప్పుడు టైం మేనేజ్‌మెంట్ కూడా పెంచుకోవచ్చు.

Download Schdule

చివరికి ఒక మాట:

2025లో ఈ AP జిల్లా కోర్టు ఉద్యోగాలు ఎంతో మంది నిరుద్యోగులకి మార్గదర్శకమవ్వబోతున్నాయి. ఎవరిచేత కూడా ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు. ఆగస్టు 20 నుంచి CBT పరీక్షలు మొదలవుతాయి. హాల్ టికెట్లు ఆగస్టు 13 నుంచి లభ్యం అవుతాయి.

ఎవరెవరు ఏ ఏ పోస్టులకు అప్లై చేసారో… ఆ తేదీల ప్రకారం ప్రిపరేషన్ మొదలెయ్యండి. ఈసారి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం మీద మీ పేరు ఉండాలంటే, ఇప్పటి నుంచే కష్టపడండి!

 

Leave a Reply

You cannot copy content of this page