AP Health Jobs 2025 – పరీక్ష లేకుండా Direct Recruitment | ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు

AP లో ఉద్యోగాలు విడుదల – పరీక్ష లేకుండా అప్లై చేయండి

AP Health Jobs 2025  మన ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మంచి అవకాశం వచ్చింది. Health Medical & Family Welfare Department నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇది సాధారణంగా పెద్ద exam రాసి qualify అయ్యే jobs కాదండి. ఏ పరీక్షలు లేకుండా ప్రత్యక్షంగా కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు జరగనున్నాయి. ఈ ఉద్యోగాలు గుంటూరు జిల్లా పరిధిలోని బాపట్ల, నరసరావుపేట ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన 15 బెడ్డెడ్ డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్స్ కోసం కావడంతో, స్థానికులకు ఇది మంచి అవకాశం అవుతుంది.

ఈసారి పోస్టుల సంఖ్య కూడా తక్కువేం కాదు. Doctors నుంచి మొదలు House Keeping వరకు, మొత్తం 10 రకాల పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా తమ qualification కు తగ్గట్టుగా మంచి అవకాశం దొరుకుతుంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పది రకాల పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటి జాబితా ఇలా ఉంది:

  • Doctor – మొత్తం 2 పోస్టులు (జీతం ₹60,000)

  • Project Coordinator cum Vocational Counsellor – 2 పోస్టులు (జీతం ₹25,000)

  • Nurse (ANM) – 4 పోస్టులు (జీతం ₹15,000)

  • Ward Boy – 4 పోస్టులు (జీతం ₹13,000)

  • Counsellor / Social Worker / Psychologist – 4 పోస్టులు (జీతం ₹17,500)

  • Accountant cum Clerk – 2 పోస్టులు (జీతం ₹12,000)

  • Peer Educator – 2 పోస్టులు (జీతం ₹10,000)

  • Chowkidar – 4 పోస్టులు (జీతం ₹9,000)

  • House Keeping – 2 పోస్టులు (జీతం ₹9,000)

  • Yoga / Dance / Music / Art Teacher (Part Time) – 2 పోస్టులు (జీతం ₹5,000)

మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికీ ఒక అవకాశం ఉంటుంది అన్నమాట.

ఎవరికి ఏ qualifications కావాలి?

ఇక్కడ interesting point ఏమిటంటే, అన్ని jobs కి పెద్ద పెద్ద degrees అవసరం లేదు. Exampleగా చెప్పాలంటే –

  • Doctor పోస్టుకి MBBS ఉన్న వాళ్లకు అవకాశం.

  • Project Coordinator పోస్టుకి degree తో పాటు కనీసం 3 ఏళ్ళ అనుభవం ఉండాలి.

  • Nurse పోస్టుకి ANM (Auxiliary Nurse Midwife) course complete చేసివుండాలి.

  • Ward Boy పోస్టుకి కేవలం 8వ తరగతి చదివి ఉంటే సరిపోతుంది. అనుభవం ఉంటే ఇంకా బాగుంటుంది.

  • Counsellor / Social Worker / Psychologist పోస్టుకి Social Sciences లో degree ఉంటే సరిపోతుంది.

  • Accountant cum Clerk పోస్టుకి degree తో పాటు computer & accounts knowledge ఉండాలి.

  • Peer Educator పోస్టుకి ప్రత్యేక qualification అవసరం లేదు, చదువుకున్నా లేకపోయినా, ఎవరైతే drugs వాడిన experience నుంచి బయటపడ్డారో వాళ్ళకే అవకాశం.

  • Chowkidar పోస్టుకి 5వ క్లాస్ చదివినా సరిపోతుంది.

  • House Keeping కి తెలుగులో చదవడం రాయడం వచ్చి ఉంటే చాలు.

  • Yoga / Music Teacher పోస్టుకి మూడు సంవత్సరాల experience ఉంటే సరిపోతుంది.

వయసు పరిమితి

వయసు పరిమితి 42 ఏళ్ళు మాత్రమే. కానీ caste లేదా category బట్టి relaxation కూడా ఉంది:

  • SC, ST, BC, EWS వారికి 5 ఏళ్ళ వయసు సడలింపు.

  • Ex-servicemen కి 3 సంవత్సరాలు plus ఆర్మీలో చేసిన service add అవుతుంది.

  • Physically Challenged వారికి 10 సంవత్సరాల సడలింపు.

  • మొత్తానికి ఎంత relaxation ఉన్నా, final age limit 52 years దాటకూడదు.

ఫీజు వివరాలు

అప్లికేషన్ పంపేటప్పుడు ఒక application fee compulsory:

  • OC candidates – ₹300

  • BC/EWS candidates – ₹200

  • SC/ST candidates – ₹100

  • Physically Challenged – ఫీజు లేదు

Fee ని Union Bank of India, Kannavarithota Branch, Guntur లోని DCHS account కి online transfer చేసి, receipt attach చేయాలి.

ఎక్కడ, ఎలా అప్లై చేయాలి?

  • Applications 03.09.2025 నుండి 16.09.2025 వరకు అందుబాటులో ఉంటాయి.

  • Candidates తమ application ని పూర్తిగా ఫిల్ చేసి, అన్ని documents attach చేసి, గుంటూరు DCHS ఆఫీస్ లో physically submit చేయాలి.

  • Address: O/o DCHS, Opp. Indian Oil Petrol Bunk, Pattabhipuram Main Road, Guntur-6.

  • Last Date: 16.09.2025 సాయంత్రం 5.30 PM లోపు చేరాలి.

Notification 

Application Form

సెలెక్షన్ ఎలా జరుగుతుంది?

ఇక్కడ entrance exam వంటివి లేవు. Selection మొత్తం merit base మీద జరుగుతుంది.

  • 90% weightage అంటే మీ qualifying exam లో తీసుకున్న marks ఆధారంగా.

  • 10% weightage అంటే మీరు qualification పూర్తి చేసి ఎంత కాలం అయ్యిందో దాని ఆధారంగా (1 year = 1 mark, max 10 marks).

అంటే ఎటువంటి written exam లేదు, interviews కూడా ఉండవు. Purely marks మీద selection జరుగుతుంది.

కావాల్సిన Documents

Application తో పాటు కొన్ని self-attested documents తప్పనిసరిగా attach చేయాలి:

  • SSC certificate

  • Intermediate certificate

  • Degree / Qualification certificates

  • All years marks memos

  • Caste certificate (అవసరమైతే)

  • Local certificate (4th class నుండి 10th వరకు చదివిన details లేదా residence certificate)

  • Medical council registration (Doctors/Nurses కోసం)

  • Disability certificate (అవసరమైతే)

Documents స్పష్టంగా, clear గా ఉండాలి. లేకపోతే application reject అవుతుంది.

ఇతర ముఖ్యమైన షరతులు

  • ఎంపికైన వారు తప్పనిసరిగా తాము join అయిన hospital లో ఉండాలి.

  • కాంట్రాక్ట్ ఉద్యోగం కాబట్టి permanent govt job అనుకోకూడదు.

  • Contract రద్దు చేయడానికి లేదా extend చేయడానికి Government కి పూర్తి హక్కు ఉంది.

  • Selection list, provisional list లాంటివి https://guntur.ap.gov.in site లో విడుదల అవుతాయి.

ఈ ఉద్యోగాలు ఎందుకు ప్రత్యేకం?

  1. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలెక్షన్.

  2. 5వ క్లాస్, 8వ క్లాస్ చదివిన వాళ్లకు కూడా అవకాశం.

  3. Locals కి ప్రాధాన్యం.

  4. Job types కూడా విభిన్నంగా ఉండటం వల్ల ప్రతి caste, ప్రతి qualification కి ఏదో ఒక అవకాశం దొరుకుతుంది.

 మొత్తానికి చెప్పాలంటే, AP Health Department ఈసారి ఇచ్చిన notification చాలా rare. చదివిన వాళ్లకు, చిన్న qualifications ఉన్న వాళ్లకూ, అనుభవం ఉన్నవాళ్లకూ – అందరికీ ఇందులో ఒక chance ఉంది. కాబట్టి చివరి తేదీకి ముందే applications submit చేసి, ఈ golden opportunity ని ఉపయోగించుకోండి.

Leave a Reply

You cannot copy content of this page