AP Kaushalam Survey 2025 | ఏపీ కౌశలం సర్వే పూర్తి వివరాలు | Work From Home Jobs, Govt & Private Jobs

ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు

AP Kaushalam Survey 2025 ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై ఆధారంగా కౌశలం సర్వే 2025 ను ప్రారంభించింది. ఇది ముందుగా Work From Home Surveyగా ఉండగా, ఇప్పుడు అదే కార్యక్రమాన్ని కౌశలం సర్వే గా మార్చి చేసింది.

ఈ సర్వేను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నారు. గతంలో Work From Home Survey లో వివరాలు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు కౌశలం సర్వేలో అప్‌డేట్ చేయించుకోవాలి.

What is Kaushalam Survey 2025?

  • మొదట దీన్ని Work From Home Survey గా ప్రారంభించారు.

  • ఇప్పుడు దీన్ని కౌశలం సర్వేగా మార్చి, రాష్ట్రంలోని ప్రతి ఒకరి విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ నైపుణ్యత వివరాలు సేకరిస్తున్నారు.

  • Surveyలో Data ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే ప్రైవేట్ & గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల సమచారం అందిస్తుంది.

  • అర్హతల వారీగా ఇండస్ట్రీలు & నోటిఫికేషన్స్ పంపబడతాయి.

ఎవరు అర్హులు? – Who is eligible for Kaushalam Survey

ఆగస్టు 15, 2025 వరకు ITI, Diploma, Graduation, PG, Ph.D., PG Diploma ఉన్నవారిని మూడుమే సర్వేలో తీసుకుంటారు.

15 ఆగస్టు 2025 తర్వాత విడుదలైన కొత్త GSWS Employees Appలో:

  • 10వ తరగతి (SSC)

  • Intermediate (12th Class)

  • 10వ తరగతి తర్వాత కోర్సులు చేస్తున్నవారు కూడా survey లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

  • ప్రస్తుతం చదువుతున్నవారు (Degree, B.Tech, PG మొదలైనవారు) కూడా తమ వివరాలు అప్‌డేట్ చేయాలి.

    సర్వే ఎలా జరుగుతుంది?

    1. GSWS Employees App (New Version) డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    2. App లో Logout & Login చేసి కొత్త details update చేయాలి.

    3. Survey ను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహిస్తారు.

    4. బయోమెట్రిక్ / Face / OTP ద్వారా ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది.

    5. వ్యక్తిగత వివరాలు, స్పెషలైజేషన్, స్కూల్/కళాశాల పేరు, మార్కులు/GPA, సర్టిఫికేట్ అప్‌లోడ్ వంటి వివరాలు నమోదు చేస్తారు.

    కొత్త Youth కి Features

    • 10వ తరగతి, Intermediate, SSC పూర్తి చేసిన విద్యార్థులు కూడా యాడ్ చేయబడతారు.

    • ప్రస్తుతం చదువుతున్న కోర్సులు కూడా వివరించాలి.

    • OTP (మొబైల్/ఇమెయిల్) ద్వారా verification జరుగుతుంది.

కౌశలం సర్వే రిపోర్ట్

ప్రభుత్వం ఈ సర్వే రిపోర్ట్లను క్లస్టర్-వారీగా, మండల వారీగా, జిల్లా వారీగా అందిస్తోంది.

వేగంగా సర్వే పూర్తి చేసుకోవడానికి సూచనలు

  • ముందుగానే Pending లో ఉన్న పనులు నెట్ ద్వారా పూర్తి చేసుకోవాలి.

  • అవసరమైన ముఖ్యమైన సమాచారం దగ్గర ఉంచుకోవాలి.

  • సర్టిఫికేట్ ను WhatsApp ద్వారా సులభంగా అప్‌లోడ్ చేయవచ్చు.

  • App లోకి వెళ్ళి డైరెక్ట్‌గా కూడా అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుంది.

  • Mobile OTP ద్వారా verification చేసుకున్న తర్వాత survey పూర్తి అవుతుంది.

సర్వేలో అడిగే ప్రశ్నలు

  • తెలిసిన భాషలు

  • విద్యార్హత & స్పెషలైజేషన్

  • పైనాన్షియల్ స్థితి & మార్గాలు

  • చిన్న చిన్న స్కిల్స్ / కళలకు సంబంధించిన వివరాలు

  • సర్టిఫికేట్ అప్‌లోడ్

  • అదనపు అర్హతలు ఉంటే వాటి వివరాలు

ముందుమాట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కౌశలం సర్వే 2025 ద్వారా రాష్ట్రంలో ప్రతి యువకుడి విద్య, నైపుణ్యాలను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు వేసింది.

ఈ సర్వేలో మీ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ నోటిఫికేషన్స్, ఇండస్ట్రీలు, ఉద్యోగ అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి.

ఏపీ కౌశలం సర్వే 2025 అప్‌డేట్స్ & రిపోర్ట్స్ కోసం మాతో కొనసాగండి.

Leave a Reply

You cannot copy content of this page