DRDO CEPTAM-11 Recruitment 2025 – 764 పోస్టులకు భరీ నోటిఫికేషన్ విడుదల
దేశంలో డిఫెన్స్ రంగం అంటే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా DRDO అంటే చాలా మందికి నిజమైన సర్వీస్ చేసామనే గర్వం కలిగించే సంస్థ. అలాంటి సంస్థలో ఉద్యోగం వస్తే జీవితమే మారిపోతుంది అని చెప్పాలి. ఇప్పుడు 2025 సంవత్సరానికి సంబంధించి CEPTAM-11 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 764 పోస్టులు ఉండటంతో చాలా మంది యువత ఎదురు చూస్తున్న అవకాశమే ఇది.
DRDO అంటే ఏంటి – కొంచెం వివరంగా
DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దేశానికి కావలసిన మిస్సైల్స్, రాడార్లు, ఫైటర్ సిస్టమ్స్, బాంబ్ డిటెక్షన్ టూల్స్, సర్విల్లెన్స్ పరికరాలు, ఆర్మీకి అవసరమయ్యే ఆధునిక పరికరాలు… ఇలా చాలా పెద్ద లెవల్‌లో డెవలప్ చేస్తుంది. వీళ్లే దేశ రక్షణ టెక్నాలజీ వెన్నెముక.
అందుకే ఇక్కడ ఉద్యోగం అంటే చాలా రెస్పెక్ట్, చాలా స్టేబిలిటీ, మరియు అయ్యే జీతం కూడా మంచి స్టాండర్డ్‌లో ఉంటుంది.
ఇప్పుడు ఈ CEPTAM-11 నోటిఫికేషన్‌లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి:
1. Senior Technical Assistant-B (STA-B)
2. Technician-A (Tech-A)
పోస్టుల మొత్తం సంఖ్య
ఒక్కసారి చూడండి:
-
STA-B పోస్టులు – 561
-
Technician-A పోస్టులు – 203
-
మొత్తం – 764
ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు రావడం చాలా అరుదు.
ఎవరెవరు అర్హులు
STA-B కు
B.Sc లేదా డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్లు. ఏ స్ట్రీం లో ఉందో నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉంటుంది కాని ఎక్కువగా సంబంధిత సబ్జెక్టులే తీసుకుంటారు.
Tech-A కు
ITI చేసిన వాళ్లే అర్హులు. ట్రేడ్ వారీగా పోస్టులు కేటాయింపు ఉంటుంది.
ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు వివరాలు
-
కనీసం 18 సంవత్సరాలు
-
గరిష్టం 28 సంవత్సరాలు
-
రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లాభాలు ఉంటాయి.
జీతం ఎంత వస్తుంది
Technician-A
Level-2 స్కేల్. అంటే సుమారు ఇరవై వేల నుంచి అరవై మూడు వేల వరకు పెరుగుతూ ఉంటుంది.
STA-B
Level-6 స్కేల్. అంటే నెలకు ముప్పై ఐదు వేల నుంచి ఒక లక్ష పన్నెండువేల వరకు జీతం.
డీఏ, హెచ్ఆర్ఏ, అలవెన్సులు అన్నీ విడిగా వస్తాయి. కాబట్టి మొత్తం సాలరీ చాలా బాగుంటుంది.
పోస్ట్ వారీగా చేసే పనులు
STA-B ఏం చేస్తారు
-
సైంటిస్టులతో కలిసి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో సపోర్ట్ చేయడం
-
ల్యాబ్ పరికరాలు ఆపరేట్ చేయడం
-
డేటా తీసుకోవడం, విశ్లేషించడం
-
టెస్టులు, ట్రయల్స్ లో సహాయం చేయడం
-
టెక్నికల్ రిపోర్ట్స్ సిద్ధం చేయడం
Tech-A ఏం చేస్తారు
-
ఆయా ట్రేడ్ కి సంబంధించి యంత్రాలు, పరికరాలు ఆపరేట్ చేయడం
-
ల్యాబ్ వర్క్ లో సహాయం
-
టెస్టింగ్ కి అవసరమైన సెటప్ రెడీ చేయడం
-
మిషన్ మింటెనెన్స్ వంటి ఫీల్డ్ పనులు
ఎంపిక విధానం
DRDO CEPTAM-11 సెలెక్షన్ పూర్తిగా రాత పరీక్ష + ట్రేడ్ టెస్ట్ (టెక్-A కి మాత్రమే) ఆధారంగా జరుగుతుంది.
STA-B కి
-
Tier-1: సాధారణ పరీక్ష (క్వాంటిటేటివ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్)
-
Tier-2: సంబంధిత సబ్జెక్టు మీదే పూర్తిగా ప్రశ్నలు
Tier-1 స్క్రీనింగ్ మాత్రమే. అసలు సెలెక్షన్ Tier-2 మీదే.
Tech-A కి
-
Tier-1: CBT – సెక్షన్ A (జనరల్) + సెక్షన్ B (ట్రేడ్ సంబంధిత)
-
Tier-2: ట్రేడ్ టెస్ట్ (ITI లెవెల్ ప్రాక్టికల్ ఎగ్జామ్)
ఎక్కడా నెగటివ్ మార్కింగ్ ఉండదు.
ఇంకా వచ్చే లాభాలు
DRDO ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు, ఇంకా:
-
పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
-
పెన్షన్/ఎన్‌పీఎస్
-
మెడికల్ సదుపాయం
-
ప్రయాణ అలవెన్సులు
-
వార్షిక పెరుగుదల
-
ప్రమోషన్ ఛాన్సులు
-
ఫ్యామిలీకు మంచి సెక్యూరిటీ
అప్లికేషన్ ఫీజులు
-
జనరల్/OBC/EWS: 100
-
మహిళలు, SC/ST/PwBD/ESM: ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు
-
ఆన్‌లైన్ అప్లై స్టార్ట్: డిసెంబర్ 9, 2025
-
లాస్ట్ డేట్: డిసెంబర్ 29, 2025 (అంచనా)
-
ఎగ్జామ్ డేట్: తర్వాత తెలియజేస్తారు
ఇప్పుడు ముఖ్యమైనది – ఎలా అప్లై చేయాలి
ఇది చాలా ఈజీ. కింది స్టెప్స్ ఫాలో చేయండి.
అసలు దారి తప్పకుండా క్లీన్ గా చెప్తున్నా.
స్టెప్ 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న Apply Online ఆప్షన్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2: మీ అర్హతలు సరిగ్గా ఉన్నాయో లేదో నోటిఫికేషన్ ని పూర్తిగా చదవండి.
స్టెప్ 3: మొబైల్ నంబర్, ఇమెయిల్ తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
స్టెప్ 4: అప్లికేషన్ ఫారం లో అడిగిన ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నింపండి.
స్టెప్ 5: ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్స్ అన్నీ అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 6: అవసరమైతే ఆన్‌లైన్ లో ఫీజు చెల్లించండి.
స్టెప్ 7: ఫారం సబ్మిట్ చేసి, చివరగా ఒక ప్రింట్ తీసుకుని ఉంచుకోండి.
చివరి మాట
DRDO CEPTAM-11 నోటిఫికేషన్ అనేది చాలా మంది కోసం లైఫ్ చెంజింగ్ అవకాశం.
ఇది ప్రభుత్వ ఉద్యోగం, మంచి జీతం, మరియు దేశ రక్షణలో భాగం అవుతామనే గౌరవం కూడా ఇస్తుంది.
కాబట్టి అర్హతలు ఉన్నవాళ్లు ఒక్కరోజు కూడా లేటు చేయకుండా అప్లై చేయండి.