ECIL Recruitment 2025 | హైదరాబాద్ ECILలో 412 ITI జాబ్స్ – Apply Online, Salary Details
మన హైదరాబాద్‌లోని Electronics Corporation of India Limited (ECIL) నుంచి పెద్ద ఎత్తున జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 412 ITI Trade Apprentice పోస్టులు ఖాళీగా ఉన్నాయని ECIL అధికారికంగా ప్రకటించింది. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ ఆర్టికల్‌లో eligibility, వయసు పరిమితి, సెలెక్షన్ ప్రాసెస్, అప్లై చేయాల్సిన విధానం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటి అన్ని వివరాలు మనం క్లియర్‌గా చూద్దాం.
ECIL Jobs Overview
-
సంస్థ పేరు: Electronics Corporation of India Limited (ECIL)
-
పోస్టు పేరు: ITI Trade Apprentice
-
మొత్తం పోస్టులు: 412
-
జాబ్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ
-
దరఖాస్తు విధానం: Online
-
ప్రారంభ తేది: 01-09-2025
-
చివరి తేది: 22-09-2025
-
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: 07 నుంచి 09 అక్టోబర్ 2025
పోస్టుల వివరాలు
ECIL లో ఈ సారి అనేక ట్రేడ్స్‌లో ఖాళీలు ఉన్నాయి. వాటి సంఖ్య ఇలా ఉంది:
-
Electronics Mechanic – 95
-
Fitter – 130
-
Electrician – 61
-
Computer Operator & Programming Assistant – 51
-
Refrigeration & AC Technician – 3
-
Turner – 15
-
Welder – 22
-
Machinist – 12
-
Machinist (G) – 2
-
Painter – 9
-
Carpenter – 6
-
Plumber – 3
-
Mechanic Draftsman – 3
మొత్తం పోస్టులు: 412
అర్హతలు
-
అభ్యర్థులు ITI పూర్తి చేసి ఉండాలి.
-
ఎలాంటి ట్రేడులో పోస్టు కోసం అప్లై చేస్తున్నారో, ఆ ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ ఉండాలి.
-
recognized board లేదా university నుండి ITI చేసి ఉండాలి.
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
వయసు పరిమితి
-
కనీసం వయసు: 18 సంవత్సరాలు
-
గరిష్ఠ వయసు: 25 సంవత్సరాలు (31-10-2025 నాటికి లెక్క)
వయసులో రాయితీలు
-
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
-
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
-
PWD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
జీతం వివరాలు
ECIL Apprenticeship పోస్టులకు జీతం సంస్థ నిబంధనల ప్రకారం ఇస్తారు. ప్రతి ట్రేడ్‌కి వేరే వేరే స్టైపెండ్ ఉంటుంది. Apprenticeship కాబట్టి training కాలంలో మంచి స్టైపెండ్ అందుతుంది.
సెలెక్షన్ ప్రాసెస్
ECIL Apprentice పోస్టులకు రాత పరీక్ష ఉండదు. ఎంపిక పూర్తిగా merit ఆధారంగా జరుగుతుంది.
-
ITI లో పొందిన మార్కులు ఆధారంగా merit list తయారవుతుంది.
-
Shortlisted అభ్యర్థులను Document Verification కి పిలుస్తారు.
-
ఫైనల్‌గా డాక్యుమెంట్స్ వెరిఫై అయిన వాళ్లకి మాత్రమే సెలెక్షన్ కన్ఫర్మ్ అవుతుంది.
అప్లికేషన్ ఫీ
-
ఏ కేటగిరీకి ఫీజు లేదు.
-
SC, ST, OBC, General, EWS – అందరూ ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం
-
ముందుగా ECIL అధికారిక వెబ్సైట్ ecil.co.in ఓపెన్ చేయాలి.
-
Careers సెక్షన్లోకి వెళ్లి Apprentice Jobs నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి.
-
Notification లో eligibility & last date చూసుకోవాలి.
-
Online application form ని సరిగా పూరించాలి.
-
అవసరమైతే certificate details అప్లోడ్ చేయాలి.
-
Submit చేసి, acknowledgement number save చేసుకోవాలి.
Document Verification Venue
Electronics Corporation of India Limited, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, ECIL (PO), Hyderabad – 500062
ముఖ్యమైన తేదీలు
-
Online Applications Start: 01-09-2025
-
Last Date for Apply: 22-09-2025
-
Document Verification Dates: 07-10-2025 నుంచి 09-10-2025
ఈ ఉద్యోగాల ప్రాముఖ్యత
ECIL అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ సంస్థ. ఇక్కడ apprenticeship పూర్తి చేయడం వల్ల భవిష్యత్తులో పెద్ద ఉద్యోగాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ITI పూర్తి చేసిన అభ్యర్థులకి ఇది ఒక మంచి platform. Training సమయంలోనే industry-level knowledge దొరుకుతుంది.
ECIL లో experience certificate తర్వాత, ఇతర PSU, Central Govt, Defence jobs లో apply చేయడానికి ఇది చాలా plus అవుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
Q1. ECIL Apprentice జాబ్స్ కి ఎవరెవరు అప్లై చేయొచ్చు?
ITI పూర్తిచేసిన ఎవరైనా eligible.
Q2. Application fee ఎంత?
ఏ ఫీజు లేదు. Free ga apply చేయొచ్చు.
Q3. Selection ఎలా జరుగుతుంది?
ITI marks ఆధారంగా merit list తయారవుతుంది. తర్వాత document verification జరుగుతుంది.
Q4. Last date ఎప్పటివరకు?
22-09-2025 వరకు online application submit చేయొచ్చు.
Q5. Job location ఎక్కడ?
హైదరాబాద్ – తెలంగాణ.
ముగింపు
ఈసారి ECIL నుంచి వచ్చిన 412 ITI Apprentice ఉద్యోగాలు మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి మంచి అవకాశం. Eligibility simple గా ఉంది, fee లేదు, selection కూడా ITI marks ఆధారంగా జరుగుతుంది. ఎవరికైతే ITI complete అయ్యిందో వాళ్లు తప్పకుండా apply చేయాలి.